డిస్ట్రిబ్యూటర్ ఆరోపణలపై స్పందించిన విజయ్ దేవరకొండ తండ్రి..!

టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించి  స్టార్ హీరో  ఫేమ్ ని సంపాదించినటువంటి విజయ్ దేవరకొండ అందరికీ బాగానే గుర్తుంటాడు. అంతే గాక విభిన్న కథనాలు పెంచుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ చెరగని ముద్ర వేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అయితే  విజయ్ “వరల్డ్ ఫేమస్ లవర్” అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. అలాగే చిత్రానికి ప్రముఖ సినీ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరించారు. […]

Share:

టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించి  స్టార్ హీరో  ఫేమ్ ని సంపాదించినటువంటి విజయ్ దేవరకొండ అందరికీ బాగానే గుర్తుంటాడు. అంతే గాక విభిన్న కథనాలు పెంచుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ చెరగని ముద్ర వేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అయితే  విజయ్ “వరల్డ్ ఫేమస్ లవర్” అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. అలాగే చిత్రానికి ప్రముఖ సినీ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరించారు.

అయితే ప్రపంచ వ్యా ప్తంగా వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలైనది. అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన  ఈ చిత్రం విజయ్ దేవరకొండ అంచనాలను ఏ  మాత్రం అందుకోలేకపోయింది. అంతేగాక ఈ చిత్రంలోని మొదటి భాగం ప్రేక్షకులని బాగానే అలరించినప్పటికీ రెండో భాగం మాత్రం తుస్సుమంది.

దీంతో ఈసారి  విజయ్ దేవరకొండ కి బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పలేదు. అయితే ఈ చిత్ర ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ బాగానే కష్టపడినప్పటికీ కథనంలో సరైన ఎలివేషన్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినట్లు తెలిసింది. దీంతో అప్పట్లో విజయ్ దేవరకొండ మీడియా ముందుకు రావడమే మానేశాడు.

అయితే ఇదిలా ఉండగా, డెక్కన్ క్రానికల్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ స‌మంత కలిసి నటించిన ఖుషి మూవీ ఈ శుక్ర‌వారం (సెప్టెంబ‌ర్‌1న‌) ఖుషి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ప‌వ‌న్ ఐకానిక్ మూవీ టైటిల్‌తో రిలీజైన ఈ మూవీ కామెడీనే ఈ సినిమాకుపెద్ద బ‌లంగా నిలిచింది. ఫ‌న్ కోసం దేశ‌ముదురు, అర్జున్‌రెడ్డి తో పాటు ప‌లు సినిమాల్ని వాడుకున్నాడు. అవి బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత కెమిస్ట్రీని అందంగా చూపించ‌డంపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు డైరెక్ట‌ర్‌. ఫ‌స్ట్ హాఫ్‌లో క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే ల‌వ్ స్టోరీ సీన్స్ ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తాయి. ఆరాధ్య పాత్రలో సమంత, విప్ల‌వ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్నారు. అయితే ప్రస్తుతం  విజయ్ దేవరకొండ ఖుషి సినిమా బాగా రన్ అవుతోంది.

కానీ విజయ్ గత సినిమా ప్లాప్ వల్ల అది ఇప్పుడు చర్చగా మారింది. వరల్డ్ ఫేమస్ లవర్‌ చిత్రానికి నిర్మాత కె ఎస్ రామారావు. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్‌ అభిషేక్.. తనకు నష్టం వచ్చిందని విజయ్ పై అభిషేక్ ఆరోపణలు చేశారు. దీనిపై విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు ను ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ చేసింది.

ఈ సంధర్భంగా విజయ్ తండ్రి గోవర్ధన్ రావు మాట్లాడుతూ… అభిషేక్ తన కుమారుడు విజయ్ దేవరకొండపై ‘నిరాధార ఆరోపణలు’ చేశారు. దాని బదులు తనకు ఏదైనా డబ్బు చెల్లించాల్సి ఉందని భావిస్తే కోర్టులను ఆశ్రయించాలని అన్నారు.

అభిషేక్ నామాతో విజయ్ దేవరకొండకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం చెపుతూ.. అభిషేక్ నామాతో మాకు ఎలాంటి సంబంధం లేదు. డిస్ట్రిబ్యూటర్‌గా, వరల్డ్ ఫేమస్ లవర్‌పై వచ్చిన నష్టాలపై నిర్మాత కె ఎస్ రామారావుతో అతనికి కొంత వివాదం ఉంది, అయితే కె ఎస్ రామారావు ను ఏమి అనలేక దానిని విజయ్ దేవరకొండ వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు. మేము అతనికి ఏమీ బాకీ లేనప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత కూడా మానవతా దృక్పథంతో అభిషేక్‌ని కలిశాము.

సినిమా కోసం విజయ్‌కి ఇచ్చే పారితోషికంలో 50% వదులుకున్నామని, సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో రామారావు ఇచ్చిన ఫ్లాట్‌ని స్వాధీనం చేసుకోలేదని కూడా చెప్పాం. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఏమిటి? అన్నింటికంటే మించి, అభిషేక్ మమ్మల్ని సంప్రదించినప్పుడు, విజయ్ నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్‌తో చిత్రాలకు సంతకం చేశాడు, కాబట్టి మాకు డేట్స్ ఖాళీగా లేవు అని చెప్పాము. దాని సాకుగా చూపుతో లేనిపి నిందలు అభిషేక్ వేస్తున్నాడని గోవర్ధన్ చెప్పారు.
బాలీవుడ్ దర్శకుల ప్రస్తావన: సంజయ్ లీలా బన్సాలీ వంటి బాలీవుడ్ దర్శకులపై విజయ్ దేవరకొండ పట్టుబట్టారని అభిషేక్ పేర్కొన్నారని, స్పష్టంగా చెప్పాలంటే, అభిషేక్ నామాతో మాట్లాడుతున్నామని విజయ్‌కి తెలియదు, కాబట్టి అతని పేరును లాగడం దురదృష్టకరం. ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యూహాలు పని చేయవని,నిరాధారమైన ఆరోపణలు చేయడం కంటే న్యాయస్థానాన్ని లేదా వాణిజ్య సంస్థలను ఆశ్రయించవచ్చని  గోవర్ధన్ చెప్పారు.