మృణాల్‌కు విజయ్‌ దేవరకొండ బర్త్‌డే సర్‌‌ప్రైజ్!

ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ చిత్రం విడుదలై ఏడాదిన్నర గడిచినా.. ఇంకా ప్రేక్షకుల గుండెల్లో ‘సీత’లా మారుమోగుతూనే ఉంది. అప్పటి నుంచి మృణాల్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ ఆమెపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో సూపర్ బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె పుట్టిన రోజున టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సర్‌‌ప్రైజ్ ఇచ్చాడు. […]

Share:

ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ చిత్రం విడుదలై ఏడాదిన్నర గడిచినా.. ఇంకా ప్రేక్షకుల గుండెల్లో ‘సీత’లా మారుమోగుతూనే ఉంది. అప్పటి నుంచి మృణాల్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ ఆమెపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో సూపర్ బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె పుట్టిన రోజున టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సర్‌‌ప్రైజ్ ఇచ్చాడు. వేరే చిత్రంలో బిజీగా ఉంటున్నప్పటికీ మృణాల్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యాడు. 

పరశురాం డైరెక్షన్‌లో విజయ్, మృణాల్‌ 

విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌‌ హీరోహీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖారారు చేయలేదు. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌ స్పాట్‌లోనే మృణాల్ బర్త్‌ డే వేడుకలకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఆమెతో కేక్‌ కట్ చేయించారు. మరోవైపు వేరే సినిమాతో బిజీగా ఉంటున్న విజయ్‌ దేవరకొండ కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం షేర్ చేసింది. ఈ వేడుకల్లో నిర్మాతలు, ఇతర చిత్ర బృదం కూడా పాల్గొంది. గీతా గోవిందం లాంటి సూపర్‌‌హిట్ చిత్రం తర్వాత విజయ్, పరశురాం కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ‘వీడి13’ (వర్కింగ్ టైటిల్) పేరుతో సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే లొకేషన్ల వేటను పూర్తి చేసింది మూవీ టీమ్. తర్వాత వెంటనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ శరవేగంగా నడుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి దివ్యాంశ కౌశిక్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన మృణాల్ ఠాకూర్‌‌ సొంత రాష్ట్రం మహారాష్ట్ర. 1992 ఆగస్టు 1న పుట్టిన మృణాల్.. మహారాష్ట్రలోనే చదువు పూర్తి చేసుకుంది. చదువుకునే రోజుల్లోనే సీరియల్స్‌లో అవకాశం దక్కించుకుంది. 2012 నుంచి పలు సీరియల్స్‌లో కనిపించింది. ‘విట్టి దండు’ అనే మరాఠీ సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత మరో నాలుగేళ్లకు హిందీలో ‘లవ్ సోనియా’ అనే సినిమా చేసింది. బాలీవుడ్‌లో సూపర్ 30, బాట్లా హౌస్, ఘోస్ట్ స్టోరీస్, తుఫాన్, దమాకా, జెర్సీ, లస్ట్ స్టోరీస్2 తదితర సినిమాల్లో మెరిసింది. బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇన్ని సినిమాలు చేసినా సీతారామం తర్వాతే.. మృణాల్ ఠాకూర్ అనే నటి గురించి చర్చ మొదలైంది. సీతగా ఆమె చేసిన క్యారెక్టర్‌‌కు ప్రశంసల వర్షం కురిసింది. తన నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. తెలుగులోనే కాదు.. హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విజయవంతమైంది. క్రేజీ హీరోయిన్‌గా మృణాల్ మారిపోయింది. 

స్టార్లతో వరుస సినిమాలు

సీతారామం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం వరుస సినిమాలను ఓకే చేస్తోంది. న్యాచురల్ స్టార్ నానితో కలిసి ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తోంది. ఇక రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో ‘వీడి13’లో కనిపించనుంది. త్వరలో రవి తేజ సినిమాలోనూ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తమిళంలో శివకార్తికేయన్ సరసన స్క్రీన్ పంచుకోనున్నట్లు కోలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఇక హిందీలోనూ రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది.