లైగర్ ఫ్లాప్ పై విజయ్ దేవరకొండ స్పంద‌న‌

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. తన సినిమాలతో కంటే తన యాటిట్యూడ్ తో ఎక్కువ ఫేమ్ ని సంపాదించుకున్నాడు అనడంలో పెద్ద సందేహం లేదు అని చెప్పొచ్చు. కేవలం ఆడియన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ కూడా విజయ్ కి ఫ్యాన్ అయ్యిపోయారు. పాన్ ఇండియా సినిమా లేకుండానే పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు అనే చెప్పాలి. కానీ ఒక సినిమా మొత్తం మార్చేసింది. పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా విజయ్ దేవరకొండని […]

Share:

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. తన సినిమాలతో కంటే తన యాటిట్యూడ్ తో ఎక్కువ ఫేమ్ ని సంపాదించుకున్నాడు అనడంలో పెద్ద సందేహం లేదు అని చెప్పొచ్చు. కేవలం ఆడియన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ కూడా విజయ్ కి ఫ్యాన్ అయ్యిపోయారు. పాన్ ఇండియా సినిమా లేకుండానే పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు అనే చెప్పాలి. కానీ ఒక సినిమా మొత్తం మార్చేసింది.

పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా విజయ్ దేవరకొండని బాగా బాధించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా విజయ్ మీద తన యాటిట్యూడ్ పై కూడా ఎన్నో విమర్శలు వచ్చేలా చేసింది. అయితే విజయ్ ఇప్పుడు తన యాటిట్యూడ్ ని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు స్టేజి పై విజయ్ మాట్లాడుతుంటే ఒక యాటిట్యూడ్ కనిపించేది. కానీ ఇప్పుడు మెచ్యూరిటీ కనిపిస్తుంది.

ఏది ఏమైనప్పటికీ, లైగర్ బాక్సాఫీస్ వద్ద తక్కువ పనితీరును కనబరిచింది, దాని కలెక్షన్లు రెండవ వారంలో బాగా పడిపోయాయి. నివేదికల ప్రకారం, రూ. 90 – రూ. 125 కోట్ల బడ్జెట్‌తో రూ.60.80 కోట్లు వసూలు చేసింది.

 ఖుషి మూవీ ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ..

నాకు లైగర్ లాంటి ఫ్లాప్ కావాలి. అప్పుడే నేను నేర్చుకోగలను. నన్ను గైడ్ చేయడానికి ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకు ఒక సక్సెస్ వస్తే దాని నుంచి విజయం వైపు ఎలా వెళ్ళాలి అనేది అర్దమవుతుంది. అలాగే ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడే మనం ఏమి చేయకూడదు కూడా అర్ధమవుతుంది. మనం చేసిన తప్పుని మనం గ్రహించగలగాలి. అలాకాకుండా దానిని బలవంతంగా ప్రజల పై రుద్దాలి అని చూస్తే ఎన్నో విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అవి హిట్ సినిమా అయితే ఆడియన్సే బ్లాక్ బస్టర్ ట్యాగ్ ఇస్తారు. నా నెక్స్ట్ మూడు సినిమాలకు నేను మాట్లాడకూడదు, నా పనే మాట్లాడాలని సైలెంట్ గా ఉంటున్నా” అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ 

భారీ ప్లాప్ అయిన సినిమాలు…

సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది చాలా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాదు, కానీ కొందరు హీరోలు చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ వాళ్లు స్టార్ హీరోలు గా మంచి పాపులారిటీని సంపాదించుకుంటారు అలాంటి వాళ్లలో విజయ్ దేవరకొండ ఒకరు

పెళ్లి చూపులు సినిమాతో డీసెంట్ హిట్ కొట్టి ఒక కొత్త హీరో ఇండస్ట్రీ కి వచ్చాడు అని జనం అందరి చేత శభాష్ అనిపించుకున్న విజయ్ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.అయితే విజయ్ కెరియర్ స్టార్టింగ్ లో అర్జున్ రెడీ, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్స్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ ఆయన చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ లుగా మిగిలాయి వాటిలో ద్వారక అనే సినిమా ఒకటి.ఇది పెళ్లి చూపులు తర్వాత సినిమా గా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది అలాగే నోట సినిమా కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఫస్ట్ షో తోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

అలాగే భరత్ కమ్మ డైరెక్షన్ లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా భారీ డిజాస్టర్ అయింది…ఇక ఆ తర్వాత పూరి డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమా గా వచ్చిన లైగర్ సినిమా భారీ ప్లాప్ అయింది.

ఇప్పుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో చేస్తున్న ఖుషి సినిమా తో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా విజయం సాధిస్తేనే విజయ్ మార్కెట్ మళ్లీ పెరుగుతుంది లేకపోతే తన మార్కెట్ ఇంకా డౌన్ అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వడం విజయం కి చాలా కీలకం.