ప్రమోషన్ లో చిన్న కూతురితో కనిపించిన విజయ్ ఆంటోనీ 

విజయ్ ఆంటోనీ , ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి బిచ్చగాడు సినిమా గుర్తొస్తుంది. కానీ, ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో విజయ్ ఆంటోని ఉన్నాడని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా, తన తండ్రి మరణాన్ని ఇప్పటికే జీర్ణించుకోలేని విజయ్ తన కూతురు మరణంతో మరింత కృంగిపోయాడు. తన మనసుని మరింత బలపరుచుకుని, చాలా రోజుల తర్వాత సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు విజయ్ ఆంటోని.  ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ ఆంటోనీ:  ప్రముఖ నటుడు, సంగీత స్వరకర్త అయిన విజయ్ ఆంటోని […]

Share:

విజయ్ ఆంటోనీ , ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి బిచ్చగాడు సినిమా గుర్తొస్తుంది. కానీ, ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో విజయ్ ఆంటోని ఉన్నాడని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా, తన తండ్రి మరణాన్ని ఇప్పటికే జీర్ణించుకోలేని విజయ్ తన కూతురు మరణంతో మరింత కృంగిపోయాడు. తన మనసుని మరింత బలపరుచుకుని, చాలా రోజుల తర్వాత సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు విజయ్ ఆంటోని. 

ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ ఆంటోనీ: 

ప్రముఖ నటుడు, సంగీత స్వరకర్త అయిన విజయ్ ఆంటోని తన పెద్ద కుమార్తె మీరా మరణించిన కొన్ని రోజుల తర్వాత మొదటిసారిగా బయట కనిపించారు. కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుని మరణించిన కొన్ని రోజులకి నటుడు తిరిగి షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం. అతను తన చిన్న కూతురు లారాతో కలిసి తన రాబోయే చిత్రం రథం ప్రమోషనల్ ఈవెంట్‌కి హాజరయ్యాడు. తన వృత్తి మీద తనకి ఉన్న అభిమానాన్ని, నిబద్ధత కారణంగా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు విజయ్ ఆంటోని. పలువురు విజయ్‌పై ప్రేమను, బలాన్ని కురిపించారు.

నిర్మాత ధనంజయన్ కూడా Xలో రాబోయే చిత్రం రథం సినిమాకు సంబంధించి ప్రమోషన్ ఇంటర్వ్యూలకు సంబంధించి కొన్ని ఫొటోస్ షేర్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా.. వృత్తి నైపుణ్యానికి నిజమైన ఉదాహరణ, @vijayantony sir, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని.. @csamudhan @Mahima_Nambiar వచ్చి తమ సినీ బృందానికి మద్దతు ఇవ్వడమే కాకుండా.. తన వ్యక్తిగత విషాదాన్ని అధిగమించిన వ్యక్తి నిజంగా సినీపరిశ్రమకు గొప్ప ప్రేరణ & బెంచ్‌మార్క్.. అంటూ రాసుకొచ్చారు. 

కూతురి సూసైడ్ నోట్: 

తను ఎంతో గారాబంగా పెంచుకున్న కూతురు ఇక లేదు అని తెలిసి విజయ్ ఆంటోని ఎంతగానో కుమిలిపోయాడు. సెప్టెంబర్ 19న తన కూతురు తన గదిలో ఉరి వేసుకొని చనిపోయిన సంఘటన మర్చిపోలేకపోతున్నాడు. చివరిగా విజయ్ ఆంటోనీ కూతురు సూసైడ్ నోట్ లో ఏముందో చూసి ప్రతి ఒక్కరు మనసు కలచివేస్తుంది. ‘లవ్ యు ఆల్, మిస్ యు ఆల్’ అంటూ ‘తన స్నేహితులను, టీచర్స్ ని మిస్ అవుతానని’ అంతేకాకుండా ‘తను లేకుండా తన కుటుంబం వేదనకు గురవుతుందని’, చనిపోయేముందు ఆంటోనీ కూతురు నోట్ ద్వారా తెలిపింది.

బిచ్చగాడు హీరో ఇంట్లో విషాదం:

విజయ్ ఆంటోని కూతురికి ఇలా అవ్వడం బాధాకరమైన విషయం. చదువులో ఒత్తిడి కారణంగానే తను సూసైడ్ చేసుకుంది అంటున్నారు. విజయ్ ఆంటోని చాలాసార్లు యాంటీ సూసైడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాడు. అలాంటి పర్సన్ ఇంట్లో ఇలా అవ్వడం బాధాకరమైన విషయం. విజయ్ ఆంటోని కూతురు 12వ తరగతి చదువుతుంది. ఇటీవల తను సూసైడ్ చేసుకుంది. విజయ్ ఆంటోనీ ఇంట్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి ఏం కాదు. తన తండ్రి కూడా ఇలాగే సూసైడ్ చేసుకున్నాడు. ఏది ఏమైనా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుందాం. 

తన కూతురి మరణం అనంతరం, కూతురు కోసం సోషల్ మీడియాలో రాసిన ఒక లెటర్ వైరల్ గా మారింది. ‘అందరికీ నమస్కారం, నా కూతురు మీరా నిజంగా చాలా మంచిది, ధైర్యవంతురాలు. తను మనందరినీ వదిలి ఒక ప్రశాంతమైన ప్రపంచంలోకి వెళ్లిపోయింది. అక్కడ కులం, మతం, డబ్బు, ఈర్ష, నొప్పి, పేద, ధనిక వంటివి అసలు ఏమి ఉండవు. తను ఇప్పటికీ నాతో మాట్లాడుతూనే ఉంది. ఎందుకంటే నేను కూడా తనతో చనిపోయాను కాబట్టి. ఈ క్షణం నుంచి నేను ఆమెతో ఇంకా టైం స్పెండ్ చేయడానికి నాకు కుదురుతుంది. తను పేరు మీద నేను చేసిన మంచి కార్యాలు అన్నీ కూడా ఆమె మొదలుపెట్టినవే.. 

నేను మీ ఆంటోనీ..’ 

విజయ్ ఆంటోనీ రాసిన విషాదకరమైన లెటర్ ప్రతి ఒక్కరి మనసుల్ని కలిచివేస్తోంది. ఈ కఠిన సమయంలో విజయ్ ఆంటోని గారు ధైర్యంగా షూటింగ్ మొదలు పట్టి స్ఫూర్తిదాయకంగా మారారు.