విగ్నేష్ శివన్ కు ప్రత్యేకమైన విషెస్ తెలిపిన నయనతార

నయనతార తన భర్త విగ్నేష్ శివన్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన పోస్ట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. విగ్నేష్ శివన్ తన 38 ఏటలోకి అడుగుపెడుతున్న సందర్భంలో, నయనతార కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేస్తూ, కింద తన భాగస్వామి కోసం ప్రత్యేకమైన లేఖను కూడా రాయడం జరిగింది..  పుట్టినరోజు నయనతార పోస్ట్:  జవాన్ సినిమాతో హిట్ కొట్టిన నాయనతర, ప్రస్తుతం తన భర్త పుట్టినరోజు సంబరాలను ప్రత్యేకంగా చేసుకుంటుంది. అంతేకాకుండా తన భర్తతో […]

Share:

నయనతార తన భర్త విగ్నేష్ శివన్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన పోస్ట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. విగ్నేష్ శివన్ తన 38 ఏటలోకి అడుగుపెడుతున్న సందర్భంలో, నయనతార కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేస్తూ, కింద తన భాగస్వామి కోసం ప్రత్యేకమైన లేఖను కూడా రాయడం జరిగింది.. 

పుట్టినరోజు నయనతార పోస్ట్: 

జవాన్ సినిమాతో హిట్ కొట్టిన నాయనతర, ప్రస్తుతం తన భర్త పుట్టినరోజు సంబరాలను ప్రత్యేకంగా చేసుకుంటుంది. అంతేకాకుండా తన భర్తతో తీసుకున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూనే భావోద్వేగానికి గురవుతూ ఇలా రాసుకొచ్చింది.. “ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ గురించి రాయడానికి నా దగ్గర ఎంత ఉన్నప్పటికీ, ఒకవేళ రాయడం మొదలుపెడితే ఆపుతానో లేదో అని అనుమానం నాలో కలుగుతుంది. నువ్వు చూపించిన అభిమానానికి ప్రేమకి చాలా చాలా థాంక్స్. మన బంధానికి నువ్వు ఇస్తున్న గౌరవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను.. ఎప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు నాకు ఎంతో ప్రత్యేకం. నిజంగా నిన్ను ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. నా జీవితంలోకి నువ్వు వచ్చినందుకు, కలల జీవితాన్ని అందించినందుకు, నా జీవితానికి ఒక అర్థం తెచ్చినందుకు, అద్భుతంగా మార్చినందుకు థాంక్యూ సో మచ్. నా విషయంలో నువ్వు చేసేవన్నీ బెస్ట్. నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నీకు ఎప్పుడూ కూడా మంచే జరగాలి. నువ్వు కోరుకునేవన్నీ నిజం అవ్వాలి. ప్రపంచంలో ఉన్న సంతోషం నీకు దక్కాలి..లవ్ యూ..” 

బాలీవుడ్ లో నయనతార డెబ్యూ:

నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. సినిమాని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేశాడు. తను ఇంతకుముందు నయనతారతో రాజా రాణి వంటి చిత్రం చేశాడు. రిలీజ్ అయిన జవాన్ సినిమాలో నయనతార లుక్ చాలా బాగుంది. అంతేకాకుండా నయనతార ఒక పోలీస్ ఆఫీసర్ గా అదే విధంగా శారీలో కూడా షారుక్ ఖాన్ పక్కన చాలా బాగా ఆకట్టుకుంది. మంచి మంచి పాటలు కు స్టెప్పులు వేసి అదరగొట్టింది. జవాన్ సినిమాతో నయనతార బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా హిట్ కొట్టింది. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన నటించింది నయనతార. ఈ సినిమాలో నయనతారే కాకుండా విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా కూడా కనిపించారు. దీపికా పదుకొనే ఇందులో గెస్ట్ గా సినిమాలో కనిపించడం జరిగింది. సినిమా రిలీజ్ అవ్వకముందే, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రతి ఒక్కరిలో సినిమా మీద ఇంకా ఆసక్తి పెరిగేలా చేసిందని చెప్పుకోవాలి. జవాన్ సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. షారుక్ ఖాన్,అట్లీ దీన్ని లాంచ్ చేసిన ఈ ట్రైలర్ చూసి అందరూ షాక్ అవ్వడమే కాకుండా అందులో కనిపించిన ప్రముఖ సౌత్ ఇండియా నటీనటులు పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నాయని సినిమా చూసిన ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. 

ఆమె ఎక్కువగా సమాజంలో ఎక్కువగా జరిగే అంశాల దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించడం జరిగింది నయనతార. ఆ సినిమాలలో ముఖ్యంగా నయనతారకు మంచి పేరు తెచ్చినవి, పుతియా నియమం, అరమ్మ్, బిల్లా, నానుమ్ రౌడీ ధాన్, కొలమావు కోకిల, మాయ. ఇప్పటికీ నయనతార మంచి జడ్జిమెంట్ తో సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా తను విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది. నయనతార సినిమాలో ఉంది కాబట్టే జవాన్ సినిమా తమిళ ప్రేక్షకుల్ని కూడా అలరించింది. అని చెప్పాలి నయనతార నటించిన హిందీ సినిమా జవాన్ పెద్ద విజయం సాధించింది కాబట్టి.. నయనతార బాలీవుడ్ లో కూడా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుందాం.