63 ఏళ్ల వయసులో కూడా యంగ్ అనిపిస్తున్న మోహన్‌లాల్ 

దిగ్గజ స్టార్, మోహన్‌లాల్, తను ఏం చేసినా సరే ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉన్నారు. ఇటీవల, లెజెండరీ నటుడు 100 కిలోల బరువును ఈజీగా ఎత్తి తన బెస్ట్ ఫిట్ బలాన్ని ప్రదర్శిస్తూ, విశేషమైన వర్కౌట్ వీడియోతో నెటిజన్లను మరోసారి ఆకట్టుకున్నాడు.  యంగ్ మోహన్ లాల్:  60 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటికీ, ఫిట్‌నెస్ పట్ల మోహన్‌లాల్ లో ఉన్న అంకితభావం అచంచలంగా ఎదుగుతూనే ఉందని చెప్పుకోవాలి. అతను తన ఫిట్నెస్ కోసం చేస్తున్న వర్క్ అవుట్, అదే విధంగా […]

Share:

దిగ్గజ స్టార్, మోహన్‌లాల్, తను ఏం చేసినా సరే ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉన్నారు. ఇటీవల, లెజెండరీ నటుడు 100 కిలోల బరువును ఈజీగా ఎత్తి తన బెస్ట్ ఫిట్ బలాన్ని ప్రదర్శిస్తూ, విశేషమైన వర్కౌట్ వీడియోతో నెటిజన్లను మరోసారి ఆకట్టుకున్నాడు. 

యంగ్ మోహన్ లాల్: 

60 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటికీ, ఫిట్‌నెస్ పట్ల మోహన్‌లాల్ లో ఉన్న అంకితభావం అచంచలంగా ఎదుగుతూనే ఉందని చెప్పుకోవాలి. అతను తన ఫిట్నెస్ కోసం చేస్తున్న వర్క్ అవుట్, అదే విధంగా మొత్తం ఆరోగ్యం పట్ల కొంచెం కూడా రాజీ పడనట్లు కనిపిస్తుంది మోహన్ లాల్. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ స్పూర్తిదాయకమైన వీడియోను పంచుకుంటూ, అనుభవజ్ఞుడైన నటుడు తన శారీరక దృఢత్వాన్ని ఇంకాస్త ఫిట్ గా మార్చుకోవడానికి, తన కోసం కొత్త ఫిట్‌నెస్ లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించాడు. జీవితంలోని అన్ని అంశాలలో క్రమశిక్షణ మరియు పట్టుదల మనల్ని అన్నివేళలా సరైన రీతిలో ఉండటానికి సహాయం చేస్తుందని అంతేకాకుండా,తన అభిమానులకు కూడా స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. 

మోహన్‌లాల్ 100kg బరువుని అవలీలగా ఎత్తిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆ వీడియోని చూసిన అభిమానులు ఈ విధంగా స్పందిస్తున్నారు..”ఈ ఈయనకి నిజంగా 63 ఏళ్లు ఉన్నాయా?” ఫిట్‌నెస్‌పై మోహన్‌లాల్‌కు ఉన్న అంకితభావం, అంతేకాకుండా అతని వయస్సులో అంత దృఢమైన శరీర ఫిట్నెస్ కోసం సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాలు, అతని సామర్థ్యం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. 

మోహన్‌లాల్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు దాని గురించి చెప్పనవసరం లేదు. అయితే రహస్య ఫిట్నెస్ సాధనాల కోసం అంతేకాకుండా ఆయన ప్రేరణ ఇచ్చే కొన్ని ఆరోగ్య సూత్రాల కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే అటువంటి అభిమానుల కోసం ‘లూసిఫర్’ నటుడు ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఒక బెస్ట్ వీడియోను షేర్ చేసుకోవడం జరిగింది. ఒక బెస్ట్ జిమ్ కోచ్ ద్వారా, నటుడు మోహన్‌లాల్, 100 కిలోల బరువును చాలా తేలికగా ఎత్తడం కనిపించింది.

మోహన్‌లాల్ రాబోయే చిత్రాలు: 

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రతిభావంతుడైన పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన అతని రాబోయే చిత్రాలలో ఒకటి, ‘లూసిఫర్ 2: ఎంపురాన్’, అతని బిజీ షెడ్యూల్‌లో ఇది మెయిన్ చిత్రంగా చెప్పుకోవాలి. అయితే అనుకోని కారణాల వల్ల సినిమా నిర్మాణం కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కానీ త్వరలోనే అందరి ముందుకు అలరించడానికి రానుంది.

మోహన్‌లాల్ మరో సినిమా, అతను బెస్ట్ యాక్టింగ్ కి తగ్గట్టు, లిజో జోస్ పెల్లిస్సేరిచే హెల్మ్ చేసిన ‘మలైకోట్టై వాలిబన్’ షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశాడు. ఈ ప్రాజెక్ట్ జూన్‌లో పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అంతేకాకుండా, మోహన్‌లాల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బరోజ్’ కూడా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మోహన్లాల్ దర్శకత్వం వహిస్తున్న ఆయన తొలి చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మోహన్‌లాల్ కి సంబంధించిన మరో చిత్రం  వృషభహా అనే పాన్-ఇండియన్ చిత్రం కూడా ఉంది, దీనిని ఇటీవల ఏక్తా కపూర్ ప్రకటించారు. ఈ చిత్రంలో షానాయ కపూర్ కూడా నటిస్తోంది. 

ప్రస్తుతం ఆయన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది అభిమానులు 60 వయసులో కూడా యంగ్ గా కనిపిస్తున్నారు అంటూ, ఇలాంటి ఫిట్నెస్ సూత్రాలు మరెన్నో షేర్ చేసుకోండి అంటూ, ఆయన సినిమాలు విజయవంతంగా అందరి ముందుకి వచ్చి విజయం సాధించాలి అంటూ కోరుకుంటున్నారు.