అత్యంత విషమంగా నటుడు శరత్ బాబు ఆరోగ్యం

సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం క్షీణించింది. కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో నటుడిని ఏప్రిల్ 20న బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చిక్సితను అందిస్తున్నారు. ప్రస్తుతం నటుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 71 ఏళ్ల వయస్సు ఉన్న నటుడు శరత్ బాబు ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్స్‌లో వెంటిలేటర్‌పై చిక్సిత తీసుకున్నట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురైన నటుడు శరత్ బాబు.. చెన్నైలోని […]

Share:

సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం క్షీణించింది. కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో నటుడిని ఏప్రిల్ 20న బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చిక్సితను అందిస్తున్నారు. ప్రస్తుతం నటుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

71 ఏళ్ల వయస్సు ఉన్న నటుడు శరత్ బాబు ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్స్‌లో వెంటిలేటర్‌పై చిక్సిత తీసుకున్నట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురైన నటుడు శరత్ బాబు.. చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే మరోసారి నటుడు అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌టంతో ఈ నెల 20న బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. కాగా ఈయన మల్టీ ఆర్గాన్ డ్యామేజ్‌తో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శరత్ బాబు సెప్సిస్‌ వ్యాధితో బాధపడుతున్నాడని ఇది మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం మరియు ఇతర అవయవాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు తెలిపారు.

నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై తన కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. శరత్ బాబు సినీ రంగ ప్రవేశం విషయానికి వస్తే.. ఆయన 1973లో సినీమా రంగంలో అడుగుపెట్టారు. రామరాజ్యం అనే మూవీతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు శరత్ బాబు.

నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, మూడుముళ్ల బంధం, అన్నయ్య, ఆపద్భాందవుడు వంటి ఎన్నో బంపర్ హిట్‌ కొట్టిన సినిమాల్లో ఆయన నటించారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి తన శరత్ ‌బాబు తన మార్క్ చూపించారు. తెలుగు మాత్రమే కాదు ఇతర సౌత్ ఇండియా భాషలైన తమిళ, కన్నడ మలయాళ సినిమాల్లో నటించడంతో ఆయనకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది.

శరత్‌బాబు నటించిన ‘మళ్లీ పెళ్లి’ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. ఆయన కొన్ని కన్నడ, మలయాళం మరియు హిందీ చిత్రాలలో కూడా సహాయ పాత్రలలో నటించారు. ఆయన ఉత్తమ నటనకు గాను తొమ్మిది సార్లు నంది అవార్డులు అందుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన శరత్‌బాబు మెుదట పోలీసు అధికారి కావాలనుకున్నారు. కానీ కంటిచూపు సమస్య కారణంగా తన కలను సాకారం చేసుకోలేకపోయారు. తన వ్యాపారంలో చేరాలని శరత్ బాబు తండ్రి కోరుకున్నాడు. కానీ ఆయన తల్లి మద్దతుతో శరత్ బాబు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి నటుడిగా స్థిరపడ్డాడు. శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆముదాలవలసలో జన్మించాడు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్.

శరత్ బాబు సినిమాలలో బలంగా ప్రయత్నిస్తున్న రోజులలో అప్పటికే తెలుగు సినీ రంగంలో ప్రముఖ నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద, వీరి వివాహం పద్నాలుగు సంవత్సరాల తర్వాత విడాకులతో అంతమైంది. 2007లో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ, నేను ఆసరా కోసం పెళ్ళిచేసుకుంటే, శరత్ బాబు అవసరానికి పెళ్ళిచేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్ళి అని చెప్పింది.