Varun Tej: వరుణ్ తేజ్ బ్యాచిలర్ ట్రిప్!

చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉంటూ, ఎంగేజ్మెంట్ చేసుకున్న కొత్త జంట వరుణ్-లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)లు ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్(Varun Tej) తో లావణ్య త్రిపాటి వివాహం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అందమైన ఇటలీలో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వరుణ్-లావణ్యాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అంతకన్నా ముందు ఫ్రీ వెడ్డింగ్ ఇటీవల జరగగా.. ప్రస్తుతం వరుణ్ తేజ్(Varun […]

Share:

చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉంటూ, ఎంగేజ్మెంట్ చేసుకున్న కొత్త జంట వరుణ్-లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)లు ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్(Varun Tej) తో లావణ్య త్రిపాటి వివాహం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అందమైన ఇటలీలో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వరుణ్-లావణ్యాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అంతకన్నా ముందు ఫ్రీ వెడ్డింగ్ ఇటీవల జరగగా.. ప్రస్తుతం వరుణ్ తేజ్(Varun Tej) ఇంస్టాగ్రామ్ (Instagram) ఫొటోస్ ద్వారా తను బ్యాచిలర్ పార్టీకి వెళ్లాడా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

వరుణ్ తేజ్ ఇంస్టాగ్రామ్(Instagram) ఫొటోస్: 

వరుణ్ తేజ్ తన ప్రత్యేకమైన నటనతో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. అయితే ఆయన ఇటీవల తన కాబోయే భార్య లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) కలిసి, తమ కుటుంబ సభ్యులతో ప్రీ వెడ్డింగ్ సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్(Varun Tej) స్పెయిన్ వెకేషన్ లో ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే వరుణ్ తేజ్ కచ్చితంగా పెళ్లి(Marriage)కి ముందు బ్యాచిలర్ ట్రిప్ కి వెళ్ళాడు అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. తను షేర్ చేసిన ఫోటోలో, ఆకాశం సముద్రం కలిసినట్టు ఉండే బ్యాక్ గ్రౌండ్ ముందు నిలబడి, సముద్రం వైపు చూస్తూ వైట్ కలర్ డ్రెస్ లో హుందాగా కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్. ఇటీవల వినాయక చవితి సందర్భంగా లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) తన కాబోయే భర్త వరుణ్ తేజ్(Varun Tej) తమ మొదటి వినాయక చవితిని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. 

కొత్తజంట వివాహం: 

తక్కువ ప్రొఫైల్‌ను మెయింటైన్ చేస్తూ. వారి వివాహం గురించి సంబంధించిన విషయాలు చాలా గోప్యంగా ఉంచడానికి, వరుణ్ తేజ్(Varun Tej) అలాగే త్రిపాఠిలు చూస్తున్నట్లు తెలుస్తోంది. మిస్టర్‌ సినిమాలో కలిసి నటించిన మొదటి చిత్రం సెట్స్‌లో కేవలం సహనటులుగా ప్రారంభమైన ఈ జంట రిలేషన్ ఇప్పుడు, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని కొత్తజంటగా మారబోతున్నారు.

జూన్ 2023లో వరుణ్ తేజ్(Varun Tej) మరియు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు, అందమైన దేశం ఇటలీని వేదికగా ఎంచుకున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పెళ్లి(Marriage) తేదీ ఇంకా ఖరారు కాకపోవడంతో దానికి సంబంధించిన సన్నాహాలు ఇంకా జరుగుతున్నాయి. పె(Marriage)ళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. 

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, రణవీర్ సింగ్-దీపికా పదుకొనే తర్వాత ఇటలీలో పెళ్లి(Marriage) చేసుకోబోతున్న సెలబ్రిటీ జంటగా తెలుగు స్టార్స్ వరుణ్ మరియు లావణ్యలు నిలవనున్నారు. వరుణ్ మరియు లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ ఉన్నప్పటికీ, వారి పెళ్లి(Marriage) ఏర్పాట్లు కోసం అదే విధంగా వారి పెళ్లి గురించి, వారు కాస్త లో ప్రొఫైల్ పాటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి చెందిన కొద్దిమంది సన్నిహితులు, వరుణ్(Varun Tej) మరియు లావణ్య కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి కోసం ఇటలీకి వెళ్లనున్నారు. అయితే వారి ఇరువురు పెళ్లి(Marriage) ఇటలీలో అంగరంగ వైభవంగా కన్నులు విందుగా ఉండబోతుందని, కుటుంబీకులు, సన్నిహితులు పేర్కొన్నారు.

మనందరికీ తెలిసినట్లుగా, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం చాలా మంది ప్రముఖులు గత కొంతకాలంగా డెస్టినేషన్ వెడ్డింగ్‌ల ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఇటలీలోని లేక్ కోమో నిజంగా ఒక అందమైన ప్రదేశం. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు అదొక అందమైన అనువైన చోటు. అయితే మరి ప్రస్తుతానికి వరుణ్ మరియు లావణ్య ఇటలీలో ఎక్కడ పెళ్లి(Marriage) చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారో చూడాల్సి ఉంది.