వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లికి అతిధులు వీరే

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లికి అంతా సిద్ధమైంది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని టాక్ వినిపిస్తోంది. ఎంగేజ్ మెంట్ వరకు తమ లవ్ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉంచిన ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థ వేడుకను కానిచ్చేసింది. దీంతో వీరి పెళ్లికి అయినా వేడుక చేస్తారా లేదా? అని అంతా ఎదురుచూస్తున్నారు.  కనిపెట్టేసిన సోషల్ మీడియా వీరి నిశ్చితార్థం జరగబోతుందంటూ ఇటు హీరో కానీ అటు హీరోయిన్ కానీ ఎవరూ ప్రకటించలేదు. వారి మ్యారేజ్ గురించి […]

Share:

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లికి అంతా సిద్ధమైంది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని టాక్ వినిపిస్తోంది. ఎంగేజ్ మెంట్ వరకు తమ లవ్ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉంచిన ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థ వేడుకను కానిచ్చేసింది. దీంతో వీరి పెళ్లికి అయినా వేడుక చేస్తారా లేదా? అని అంతా ఎదురుచూస్తున్నారు. 

కనిపెట్టేసిన సోషల్ మీడియా

వీరి నిశ్చితార్థం జరగబోతుందంటూ ఇటు హీరో కానీ అటు హీరోయిన్ కానీ ఎవరూ ప్రకటించలేదు. వారి మ్యారేజ్ గురించి మొదట సోషల్ మీడియానే వెల్లడించింది. వారు పెళ్లి చేసుకోబోతున్నారంటూ మొదట సోషల్ మీడియాలోనే వార్తలు వచ్చాయి. దీంతో అంతా ఇవన్నీ ఫేక్ వార్తలు అంటూ కొట్టిపారేశారు. కానీ ఈ ఫేక్ వార్తలే నిజం అయ్యాయి. చివరికి ఈ ఇద్దరు నిశ్చితార్థం చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరు ఇప్పటికే అనేక సినిమాల్లో కలిసి తెరను పంచుకున్నారు. ఇక అంతే కాకుండా వీరు వివాహ బంధంతో ప్రస్తుతం మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 

అప్పుడే చెప్పేశారు

వారి ఎంగేజ్ మెంట్ జరిగిన సమయంలోనే త్వరలోనే వివాహం ఉంటుందని ఇరు కుటుంబాల పెద్దలు వివరించారు. నవంబర్ 2023లో వీరి వివాహం ఉండనుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా వారి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఉండనుందని టాక్ నడుస్తోంది. ఈ వెడ్డింగ్ కు అతి కొద్ది మంది అతిథులు మాత్రమే వస్తారని సమాచారం. ఇటలీలోని ఓ ప్రదేశంలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుందని వినికిడి. అంతే కాకుండా ఈ వివాహానికి వచ్చే వారికి సంబంధించిన లిస్ట్ కూడా వైరల్ అవుతోంది.

ఫ్రెండ్స్ లిస్ట్ ఎక్కువే…

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇద్దరికీ ఇండస్ట్రీలో అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కు అతి కొద్ది మంది మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కొద్ది మంది ఫ్రెండ్స్ సమక్షంలో వీరి వివాహ వేడుక జరనుందని టాక్. దీంతో వీరి పెళ్లికి హాజరయ్యే అతిధుల సంఖ్య వైరల్ అవుతోంది. ఈ వేడుకకు టాలీవుడ్ హీరోలు వరుణ్ తేజ్ బంధువులైన అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ మొదలైన మెగా హీరోలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ హీరోలతో పాటు మరింత మంది ప్రముఖులు కూడా హాజరుకానున్నారని టాక్. అంతే కాకుండా ఈ గెస్ట్ లిస్ట్ నుంచి మరింత మంది ప్రముఖుల పేర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహ తేదీ మరియు వెడ్డింగ్ వేదిక ఖరారు కావడంతో ఇక అంతా గెస్ట్ లిస్ట్ మీద దృష్టి సారించారు. ఇప్పటికే ఈ స్టార్ జోడీకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. 

మొదలైన పనులు

ఈ స్టార్ లవ్ బర్డ్స్ పెళ్లి కోసం.. ఇప్పటికే అన్ని పనులు మొదలైనట్లు సమాచారం. ఇటలీలోని రొమాంటిక్ డెస్టినేషన్ లో వీరి పెళ్లికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి కోసం టాలీవుడ్ ప్రముఖులు అతి కొద్ది సంఖ్యలో రానున్నారు. అంతే కాకుండా వీరి పెళ్లి తర్వాత ఇచ్చే పార్టీలో అనేక మంది ప్రముఖులతో  పాటు హీరోలు, హీరోయిన్లు కూడా  పాల్గొంటారని సమాచారం. దీంతో ఈ పెళ్లితో  పాటు అనేక మంది లవ్ బర్డ్స్ మరింత మంది ఒక్కటయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ పెళ్లి కోసం వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అంతా ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లిని గ్రాండ్ గా చేయనున్నట్లు ఇప్పటికే ఇరు కుటుంబాలు తెలిపాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.