Varun Tej Lavanya Tripathi: కాక్​టైల్ పార్టీతో వివాహ వేడుకలు షురూ..!

మెగా ఫ్యామిలీలో(Mega Family) పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ(Varun Tej Lavanya Tripathi) ల పెళ్లికి సమయం దగ్గర పడింది. ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్(Destination wedding) చేసుకోనుంది. ఇక వీరు పెళ్లి చేసుకోవడానికి ఎంపిక చేసిన ఇటలీలోని టస్కానీ(Tuscany) డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధి గాంచింది. వరుణ్ తేజ్(Varun Tej) మరియు లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) ఇటలీలో […]

Share:

మెగా ఫ్యామిలీలో(Mega Family) పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ(Varun Tej Lavanya Tripathi) ల పెళ్లికి సమయం దగ్గర పడింది. ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్(Destination wedding) చేసుకోనుంది. ఇక వీరు పెళ్లి చేసుకోవడానికి ఎంపిక చేసిన ఇటలీలోని టస్కానీ(Tuscany) డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధి గాంచింది.

వరుణ్ తేజ్(Varun Tej) మరియు లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) ఇటలీలో తమ ప్రీ-వెడ్డింగ్(Pre-wedding) వేడుకలను జరుపుకుంటున్నారు. అక్టోబర్ 30న టస్కానీ(Tuscany)లో ఫ్యాన్సీ కాక్‌టైల్ పార్టీ(Cocktail party)తో ప్రారంభమవుతుంది. కొంతమంది ప్రముఖ డిజైనర్లు వధువు, వరుడు మరియు వారి కుటుంబాల కోసం ప్రత్యేక దుస్తులను తయారు చేస్తున్నారు. కాక్‌టైల్ పార్టీ తర్వాత, అక్టోబర్ 31న మెహందీ(Mehndi) మరియు హల్దీ(Haldi) వేడుకలు జరగనున్నాయి. అల్లు అర్జున్(Allu Arjun), రామ్ చరణ్(Ram charan) వంటి బంధువులతో పాటు వారి కుటుంబ సభ్యులు చాలా మంది పెళ్లి కోసం ఇటలీకి వస్తున్నారు. రామ్ చరణ్ మరియు అతని భార్య ఉపాసన ఇప్పటికే అక్కడ ఉన్నారు, వారి కుమార్తె క్లిన్ కారాతో తమ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

వధువు లావణ్య త్రిపాఠి, వరుడు వరుణ్ తేజ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ పెళ్లి కోసం ఇటలీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి(Varun Tej- Lavanya Tripathi) లతోపాటు పంజా వైష్ణవి తేజ్, నిహారిక కొణిదలతో పాటు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఇటలీ వెళ్లడం విశేషం. కొణిదెల, త్రిపాఠి, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇటలీ వెళతారు. ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్(Nitin), నిహారిక (Niharika)మరియు లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరు కానున్నారు. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లికి ముందు రెండు పార్టీలు జరిగాయి. తమ కుటుంబంలో భాగమైన అల్లు అర్జున్(Allu Arjun) మరియు చిరంజీవి(Chiranjeevi) తమ ప్రియమైన వారితో ఈ పార్టీలను నిర్వహించారు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్”(Game changer) అనే సినిమా పనిలో బిజీగా ఉన్నందున పార్టీలలోకి రాలేకపోయాడు.

వరుణ్ తేజ్, లావణ్యల వివాహం నవంబర్ 1న ఇటలీలో కుటుంబ సభ్యులతో జరగనుంది. పెళ్లి తర్వాత, వరుణ్ భారతదేశానికి తిరిగి వస్తాడు. ఈ మేరకు రిసెప్షన్ డేట్ అండ్ వెన్యూ కూడా ఫిక్స్ అయిపోయాయి. నవంబర్ 1న ఇటలీలో వరుణ్, లావణ్య పెళ్లి జరగనుండగా.. నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ క్రమంలోనే రిసెప్షన్ కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ ని అతిధులందరికీ పంచుతున్నారు. తాజాగా ఇన్విటేషన్ కార్డుకు సంబంధించి ఓ వీడియోని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. చూడడానికి చాలా రిచ్ గా ఆకర్షణీయంగా ఉన్న ఈ రిసెప్షన్ ఇన్విటేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శుభలేఖ ముందు భాగంలో వరుణ్, లావణ్య పేర్లలోని VL అక్షరాలతో లోగోని డిజైన్ చేశారు.

లోపల పై భాగంలో వరుణ్ తేజ్ నానమ్మ అంజనాదేవి, తాతయ్య కొణిదెల వెంకటరావు ఆశీస్సులతో.. అని ముద్రించి ఉంది. ఆ తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్.. అంటూ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లను హైలైట్ చేయడం విశేషం. కాగా రిసెప్షన్ ఇన్విటేషన్ లో గెస్ట్ లకు అవసరమైన కార్ పాస్ లను కూడా పొందుపరిచారు. వరుణ్, లావణ్య పెళ్లి దగ్గర పడడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వరుణ్ లవ్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ లావణ్య కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ వంటి సినిమాల్లో నటించారు. ‘మిస్టర్’ మూవీ షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి రిసెప్షన్ కి సంబంధించిన కాస్ట్యూమ్స్, స్టైలింగ్ ని ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.