కాబోయే కొత్తజంట వినాయక చవితి సంబరాలు

వినాయక చవితి సందర్భంగా లావణ్య త్రిపాఠి తన కాబోయే భర్త వరుణ్ తేజ్ తమ మొదటి వినాయక చవితిని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇందుకు వారి కుటుంబంతో కలిసి లావణ్య త్రిపాఠి కలిసి పూజలు చేసిన ఫోటోలను కాబోయే పెళ్లి కొడుకు వరుణ్ తేజ్ తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది.  కాబోయే కొత్త జంట వినాయక చవితి సంబరాలు:  ఈ సంవత్సరం జూన్ లో ఎంగేజ్మెంట్ జరుపుకున్న వరుణ్ తేజ్-లావణ్య […]

Share:

వినాయక చవితి సందర్భంగా లావణ్య త్రిపాఠి తన కాబోయే భర్త వరుణ్ తేజ్ తమ మొదటి వినాయక చవితిని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇందుకు వారి కుటుంబంతో కలిసి లావణ్య త్రిపాఠి కలిసి పూజలు చేసిన ఫోటోలను కాబోయే పెళ్లి కొడుకు వరుణ్ తేజ్ తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. 

కాబోయే కొత్త జంట వినాయక చవితి సంబరాలు: 

ఈ సంవత్సరం జూన్ లో ఎంగేజ్మెంట్ జరుపుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు చాలా సంతోషంగా వినాయక చవితి సంబరాలు తమ ఫ్యామిలీతో కలిసి చేసుకున్న ఫొటోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా కనిపించడం జరిగింది. వరుణ్ తన కాబోయే భార్య భార్య లావణ్య వెనుక నుంచోగా, నాగబాబు సతీమణి మరోపక్క కనిపించడం జరిగింది. మరో ఫోటోలో కాబోయే కొత్త అత్తా కోడలు కలిసి పూజ జరిపిస్తున్న కార్యక్రమం కనువిందు చేస్తుంది. అత్త కోడలు ఇద్దరు కూడా సాంప్రదాయమైన చీరకట్టులో ఫోటోలో కనిపించారు.

ఫోటోలను షేర్ చేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశాడు తొలిప్రేమ హీరో వరుణ్ తేజ్. వినాయక చవితి సందర్భంగా తన చెల్లెలు నిహారికను మిస్ అవుతున్నట్లు కూడా పోస్ట్ లో రాసుకోవచ్చాడు వరుణ్. అయితే ఇక లావణ్య త్రిపాఠి కూడా తన కాబోయే అత్తారింట్లో అడుగుపెట్టడమే కాకుండా, కుటుంబంలో కలిసిపోతూ ప్రతి పూజలోనూ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల ఒక బోల్డ్ సిరీస్ లో నటించను అంటూ, తనకు వచ్చిన ఆఫర్ ని తిరస్కరించింది లావణ్య. 

కొత్తజంట వివాహం: 

లావణ్య త్రిపాటి- వరుణ్ తేజ్ చాలా సుమారు 5-6 సంవత్సరాలుగా రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ ఎక్కువగా ఎవరికి తెలియదు, అయితే ఎంగేజ్మెంట్ తర్వాత వారిద్దరూ పెళ్లితో ఒకటవ్వబోతున్నట్లు ఫాన్స్ అందరికీ ఒక శుభవార్త తెలిపారు. జూన్ 2023లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు, అందమైన దేశం ఇటలీని వేదికగా ఎంచుకున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాకపోవడంతో దానికి సంబంధించిన సన్నాహాలు ఇంకా జరుగుతున్నాయి. పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. 

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, రణవీర్ సింగ్-దీపికా పదుకొనే తర్వాత ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్న సెలబ్రిటీ జంటగా తెలుగు స్టార్స్ వరుణ్ మరియు లావణ్యలు నిలవనున్నారు. వరుణ్ మరియు లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ ఉన్నప్పటికీ, వారి పెళ్లి ఏర్పాట్లు కోసం అదే విధంగా వారి పెళ్లి గురించి, వారు కాస్త లో ప్రొఫైల్ పాటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి చెందిన కొద్దిమంది సన్నిహితులు, వరుణ్ మరియు లావణ్య కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి కోసం ఇటలీకి వెళ్లనున్నారు. అయితే వారి ఇరువురు పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా కన్నులు విందుగా ఉండబోతుందని, కుటుంబీకులు, సన్నిహితులు పేర్కొన్నారు.

మనందరికీ తెలిసినట్లుగా, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం చాలా మంది ప్రముఖులు గత కొంతకాలంగా డెస్టినేషన్ వెడ్డింగ్‌ల ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఇటలీలోని లేక్ కోమో నిజంగా ఒక అందమైన ప్రదేశం. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు అదొక అందమైన అనువైన చోటు. అయితే మరి ప్రస్తుతానికి వరుణ్ మరియు లావణ్య ఇటలీలో ఎక్కడ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారో చూడాల్సి ఉంది.