పెళ్లి షాపింగ్‌లో వరుణ్‌ తేజ్ లావణ్య త్రిపాఠి

టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి మరికొన్ని రోజుల్లో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్న ఈ ప్రేమ జంట త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ సందర్భంగా పెళ్లి పనుల్లో టాలీవుడ్ ప్రేమ జంట బిజీగా ఉంది. తాజాగా ఓ షాపింగ్ మాల్ లో సందడి చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది.  మెగా ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్  వరుణ్ […]

Share:

టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి మరికొన్ని రోజుల్లో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్న ఈ ప్రేమ జంట త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ సందర్భంగా పెళ్లి పనుల్లో టాలీవుడ్ ప్రేమ జంట బిజీగా ఉంది. తాజాగా ఓ షాపింగ్ మాల్ లో సందడి చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది. 

మెగా ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అటు వరుణ్‌, ఇటు లావణ్య ఫ్యామిలీస్‌లో పెళ్లి పనులు కూడా షురూ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 9న వీరి నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఐదేళ్లుగా ప్రేమలో మునిగితేలుతూ ఎట్టకేళలకు పెళ్లి వరకు వచ్చారు. ప్రస్తుతం వరుణ్, లావణ్య పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఓవైపు తదుపరి సినిమా పనులు చూసుకుంటూనే తమ వెడ్డింగ్ ఏర్పాట్లపైనా శ్రద్ధ పెట్టారు. 

తాజాగా వరుణ్ తేజ్, లావణ్య ఓ షాపింగ్ మాల్ వద్ద కనిపించారు. ప్రముఖ సెలబ్రెటీ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు సంబంధించిన హైదరాబాద్ బ్రాంచ్ లో సందడి చేశారు. పెళ్లి ప్రత్యేకమైన దుస్తులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. స్పెషల్ డిజైన్స్ ను ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం వారిద్దరూ షాపింగ్ మాల్ వద్ద మెరిసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అభిమాన తారలు పెళ్లి షాపింగ్ లో బిజీగా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

ఇక, వరుణ్ – లావణ్య ల పెళ్లి ఎక్కడ జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. నాలుగే వేల మైళ్ల దూరంలో ఉన్న ఇటలీలోని ఓ ప్యాలెస్ లో జరిగే అవకాశం ఉందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. నవంబర్ 1న వీరి వెడ్డింగ్ గ్రాండ్ గా జరగనుందని కూడా అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ మేరకు సమయానికి అన్ని పనులు పూర్తి చేసేందుకు ఇటు మెగా ఫ్యామిలీ, అటు లావణ్య  కుటుంబ సభ్యులు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అతిథులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు వచ్చే ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారని తెలుస్తోంది. 

మొత్తానికి టాలీవుడ్  లవ్ బర్డ్స్ పెళ్లి పనుల్లో బిజీ కావడం విశేషం. పనుల్లో భాగంగా నగరంలో అక్కడక్కడ తళుక్కున మెరుస్తూ ఆకట్టుకోవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక వీరి పెళ్లి వేడుక కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ తన తదుపరి సినిమా పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూసుకుంటున్నారు. రీసెంట్ గా ‘గాంఢీవదారి అర్జున’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 25 థియేటర్లలో విడుదలైంది. రీసెంట్ గా నెక్ట్స్ ఫిల్మ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్ర డబ్బింగ్ పనులు కూడా షురూ చేశారు. 

ఇక లావణ్య త్రిపాఠి చివరిగా ‘పులిమేక’ అనే వెబ్ సిరీస్ లో మెరిసింది. జీ5లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘థనల్’, చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వరుణ్ – లావణ్య 2017లో వచ్చిన ‘మిస్టర్’ అనే చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే వీరిమధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఆ తర్వాత ‘అంతరిక్షం 9000 కేఎంపీహెచ్’లో నటించారు. ఆరేళ్లకు వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.