ఫ్యామిలీతో వరుణ్ తేజ్ విదేశీ టూర్‌..!

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ , హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం చేసుకున్నారు. కొంతకాలంగా లావణ్యతో ప్రేమలో ఉన్న వరుణ్ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఫంక్షన్ ముగిసిన వెంటనే.. ఇద్దరు కూడా తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో ఎంగేజ్‌మెంట్ స్టిల్స్‌ షేర్ చేశారు. అంతేకాదు ఈ ఫొటోలకు వరుణ్ ‘నా లావ్ దొరికింది’ అంటూ క్యాప్షన్ ఇవ్వగా.. ‘నన్ను నేను కనుగొన్నాను’ అని లావణ్య తన పోస్ట్‌కు క్యాప్షన్ జతచేసింది. ఇక […]

Share:

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ , హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం చేసుకున్నారు. కొంతకాలంగా లావణ్యతో ప్రేమలో ఉన్న వరుణ్ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఫంక్షన్ ముగిసిన వెంటనే.. ఇద్దరు కూడా తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో ఎంగేజ్‌మెంట్ స్టిల్స్‌ షేర్ చేశారు. అంతేకాదు ఈ ఫొటోలకు వరుణ్ ‘నా లావ్ దొరికింది’ అంటూ క్యాప్షన్ ఇవ్వగా.. ‘నన్ను నేను కనుగొన్నాను’ అని లావణ్య తన పోస్ట్‌కు క్యాప్షన్ జతచేసింది. ఇక ఈ పోస్టులపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. వరుణ్, లావణ్యపై ప్రేమ కురిపిస్తూ విషెస్ తెలియజేస్తు, ఇద్దరూ చల్లగా ఉండాని దీవిస్తూ.. మీ ప్రేమ అంతరిక్షం దాకా చేరాలంటూ ఫన్నీ కామెంట్స్ చేసారు.

ఇక వరుణ్, లావణ్య ఎంగేజ్‌మెంట్ పిక్స్‌పై ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా విషెష్ తెలియజేస్తూ వారిపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఇదే క్రమంలో వరుణ్ చెల్లెలు నిహారిక కొణిదెల హార్ట్ ఎమోజీస్‌‌తో రిప్లయ్ ఇచ్చింది. అయితే నిహారిక పోస్టు చూసిన నెటిజన్లు మాత్రం.. నీ భర్త ఎక్కడ అంటూ కామెంట్లో అడుగుతున్నారు. ‘నీ పెళ్లి ఎప్పుడు అక్క, లైఫ్ అంతా సింగిల్ ఉంటానని మాత్రం చెప్పకు’ అంటూ మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. వరుణ్, లావణ్యకు ప్రగ్యా జైస్వాల్, లక్ష్మి మంచు, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వంటి సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెప్పారు.

లావణ్య, వరుణ్ ఇప్పటి వరకు ‘అంతరిక్షం, మిస్టర్’ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ మూవీస్ చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. అంతేకాదు బెంగుళూరులో జరిగిన లావణ్య బర్త్‌డే వేడుకలో వరుణ్ అఫీషియల్‌గా తనకు ప్రపోజ్ చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ నిశ్చితార్థం జరిగే వరకు ఇద్దరు కూడా తమ రిలేషన్‌షిప్‌ను చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. లావణ్య తెలుగులో చివరగా ‘చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్‌డే’ చిత్రాల్లో కనిపించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘అందాల రాక్షసి’ మూవీతో తను టాలీవుడ్‌కు పరిచయం కాగా.. తన కెరీర్‌లో ‘సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్’ వంటి హిట్లు ఉన్నాయి.

ఇక తన హిందీలో కూడా ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. ఇక వరుణ్ తేజ్ గాండీవ‌ధారి అర్జున  సినిమాతో ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి నిరాశ పరిచిన వరుణ్ తేజ్.. కొన్ని రోజులు క్రితం కుటుంబంతో కలిసి విదేశాలకు హాలీడే టూర్ కి వెళ్ళాడు. నాగబాబు, నిహారిక, తల్లి పద్మజతో కలిసి వరుణ్.. కెన్యాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ టూర్ కి సంబంధించిన ఫోటోలను ప్రతిఒక్కరు తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే, వరుణ్ తన కుటుంబంతో కలిసి విదేశీ టూర్‌కి వెళ్ళింది కేవలం ఎంజాయ్ చేయడం కోసమే కాదట.

వరుణ్ తేజ్ త్వరలో లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్‌ తరహాలో చేసుకోబోతున్నట్లు వరుణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఇందుకోసం ఇండియాలో ఒక మూడు, ఫారిన్ లో రెండు ప్లేస్‌లను పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే వరుణ్ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళాడంటూ చెబుతున్నారు. కాగా ఈ వివాహం ఈ ఏడాది నవంబర్ లో జరగబోతుంది అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా వరుణ్, లావణ్య.. ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు, ముందుగా వరుణే ప్రపోజ్ చేసినట్లు కూడా ఇటీవల వెల్లడించాడు. అయితే ఈ ప్రేమ విషయాన్ని మాత్రం ఎంగేజ్మెంట్ వరకు రహస్యంగానే ఉంచుతూ వచ్చాడు. ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తన చేతిలో ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’  చిత్రాలు ఉన్నాయి. ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ ఆల్రెడీ మొదలు కాగా.. మట్కా సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్దమవుతుంది.