లావణ్య విషయంలో నేను అలానే చేస్తా: వరుణ్

మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడు మెగాస్టార్ తమ్ముడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ గురించి టాలీవుడ్ జనాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో స్టార్ డమ్ తో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్న వరుణ్ తనతో కలిసి నటించిన ముద్దు గుమ్మ అందాల రాక్షసితో తెలుగు ప్రేక్షకుల మదులు దోచిన లావణ్య త్రిపాఠిని త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. మొన్నా మధ్యే హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి […]

Share:

మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడు మెగాస్టార్ తమ్ముడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ గురించి టాలీవుడ్ జనాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో స్టార్ డమ్ తో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్న వరుణ్ తనతో కలిసి నటించిన ముద్దు గుమ్మ అందాల రాక్షసితో తెలుగు ప్రేక్షకుల మదులు దోచిన లావణ్య త్రిపాఠిని త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. మొన్నా మధ్యే హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఎంగేజ్ మెంట్ జరిగిపోవడంతో అందరూ పెళ్లి ఎప్పుడు అని ఎంక్వైరీలు మొదలుపెట్టేశారు. కానీ వరుణ్ వీటికి ఎటువంటి సమాధానాలు చెప్పలేదు. అతడు మాత్రమే కాదు ఇటు మెగా ఫ్యామిలీ కానీ అటు హీరోయిన్ లావణ్య త్రిపాఠి కుటుంబం నుంచి కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు రాలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా నిరాశలో ఉన్నారు. ఈ లవ్ బర్డ్స్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. వీరి ఎంగేజ్ మెంట్ సమయంలో కూడా ఎవరూ ముందస్తుగా ప్రకటించలేదు. వీరి ఎంగేజ్ మెంట్ విషయాన్ని సోషల్ మీడియానే అనౌన్స్ చేసింది. దీంతో అందరికీ వీరి ఎంగేజ్ మెంట్ పై క్యూరియాసిటీ ఏర్పడింది. ఎంగేజ్ మెంట్ రోజు దగ్గరపడ్డా కానీ ఇటు వరుణ్ కుటుంబ సభ్యులు కానీ అటు లావణ్య కుటుంబ సభ్యులు కానీ డేట్ అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎంత మంది ఎన్ని ప్రశ్నలు వేసినా వారు చప్పుడు చేయలేదు. గుట్టు చప్పుడు కాకుండా లోలోపల వీరు పనులు పూర్తి చేసుకున్నారు. దీంతో అంతా షాకయ్యారు. ఏదో సోషల్ మీడియాలో మొదటే వార్తలు వైరల్ అయ్యాయి కాబట్టి చాలా మంది లైట్ తీసుకున్నారు కానీ లేకపోతే మరింత టెన్షన్ పడే వారు. 

గాండీవధారి తో వస్తున్న వరుణ్

వరుణ్ తేజ్ లాస్ట్ మూవీ గని ఆశించిన మేర హిట్ కాలేకపోయింది. కారణం ఏదైనా కానీ ఈ మూవీ మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. ఈ మూవీ సక్సెస్ కాకపోవడానికి అనేక మంది అనేక రీజన్లు చెప్పారు. తాజాగా వరుణ్ ఈ చిత్రం ప్లాప్ కావడంపై స్పందిస్తూ ప్రేక్షకులకు ఒక్కొక్కరికి ఒక్కో జానర్ నచ్చుతుంది. మేము అందరు ప్రేక్షకులను సాటిస్ఫై చేసేందుకు అన్ని జానర్లను టచ్ చేశాం అందుకే గని మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు అని తెలిపాడు. అంతే కాకుండా ఈ మూవీ ఆడదని తాను ముందే అనుకున్నానని చెప్పి అందర్నీ షాక్ కు గురి చేశాడు. ఈ మూవీ పెద్దగా ఆడకపోయినా వరుణ్ మాత్రం ఏ మాత్రం బెంగపడలేదు. ఆ ప్లాప్ నుంచి వెంటనే తేరుకుని గాండీవధారి అర్జున అనే కొత్త మూవీని పట్టాలెక్కించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో కలిసి వరుణ్ ఈ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. అప్పట్లో అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీలో ఈ చిన్నది సందడి చేసింది. ఏజెంట్ మూవీ కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం కావడంతో ఎవరూ సాక్షి వైద్య గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ సాక్షి వైద్య కూడా గ్లామరస్ గానే ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన డైరెక్టర్ ప్రవీణ్ తన మూవీలో సాక్షికి హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం హీరోయిన్ సాక్షి వైద్య పవర్ స్టార్ పవన్ కు జోడీగా నటించనుంది. పవర్ స్టార్ నెక్ట్స్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ కాగా.. సెకండ్ హీరోయిన్ గా మేకర్స్ సాక్షి వైద్యను సెలెక్ట్ చేశారు.

వరుణ్ పర్ఫెక్ట్ ఆన్సర్

ఇదిలా ఉండగా.. మొన్న గాండీవధారి అర్జున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రీరిలీజ్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే మూవీ టీం ట్రైలర్ ను లాంచ్ చేపించింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు వరుణ్ చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది. నీకు కాబోయే భార్య లావణ్య, నీ చెల్లెలు నిహారిక కాల్ చేయమని ఒకే సారి మెసేజ్ చేస్తే ముందుగా నీవు ఎవరికి కాల్ చేస్తావని సుమ ప్రశ్నించింది. దీనికి వరుణ్ కొద్ది సేపు ఆలోచించి నిహారిక నా కంటే చిన్నది కాబట్టి నేను నిహారికకే ముందు ఫోన్ చేస్తానని వెల్లడించాడు. ఈ సమాధానం వైరల్ అవుతోంది.