Varun Lavanya : ఘనంగా వరుణ్‌ తేజ్‌- లావణ్య రిసెప్షన్‌..

Varun Lavanya : వరుణ్‌ తేజ్‌ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ల రిసెప్షన్‌ ఆదివారం సాయంత్రం(నవంబర్ 5న) ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎన్‌. కన్వెషన్‌ (మాదాపూర్‌) ఈ వేడుకకు వేదికైంది. ఈ వివాహ రిసెప్షన్‍(Reception) కు  వరుణ్ తేజ్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హాజరయ్యారు. ఇటలీలో వరుణ్, లావణ్య వివాహానికి వెళ్లిన చిరూ.. రిసెప్షన్‍‍లోనూ వారిని ఆశీర్వదించారు.  బ్లాక్ కలర్ సూట్ లో వరుణ్ తేజ్, లైట్ గోల్డ్ కలర్ శారీలో లావణ్య […]

Share:

Varun Lavanya : వరుణ్‌ తేజ్‌ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ల రిసెప్షన్‌ ఆదివారం సాయంత్రం(నవంబర్ 5న) ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎన్‌. కన్వెషన్‌ (మాదాపూర్‌) ఈ వేడుకకు వేదికైంది. ఈ వివాహ రిసెప్షన్‍(Reception) కు  వరుణ్ తేజ్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హాజరయ్యారు. ఇటలీలో వరుణ్, లావణ్య వివాహానికి వెళ్లిన చిరూ.. రిసెప్షన్‍‍లోనూ వారిని ఆశీర్వదించారు.  బ్లాక్ కలర్ సూట్ లో వరుణ్ తేజ్, లైట్ గోల్డ్ కలర్ శారీలో లావణ్య మెరిసిపోయారు. కొత్త పెళ్లి కూతురు అయితే చిరునవ్వులు చిందిస్తూ సిగ్గుపడుతూ కనిపించింది. ఆ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దాదాపు ఆరేళ్లు ప్రేమలో ఉన్న వరుణ్‌, లావణ్య (Varun Lavanya)పెద్ద అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలోని టుస్కానీ(Tuscany)లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. టుస్కానీలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగా వైభవంగా జరిగిన వీరి వివాహానికి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీతోపాటు.. పవర్ స్టార్ ఫ్యామిలీ, హీరో నితిన్ తన సతీమణి షాలినితో కలిసి హాజరయ్యారు. పెళ్లికి వారం రోజుల ముందే మెగా ఫ్యామిలీ(Mega Family) ఇటలీ వెళ్లి నాలుగు రోజులపాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ (Pre wedding Celebrations) ను ఘనంగా చేశారు. ఇక ఇటలీలోని టుస్కానీలో అక్టోబర్ 30 నుంచి పెళ్లి వేడుకలు షూరు అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి.

ఇక రెండు రోజుల క్రితమే మెగా ఫ్యామిలీ(Mega Family), కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి హైదరాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక ఆదివారం సాయంత్రం సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్లో వరుణ్, లావణ్య రిసెప్షన్(Reception) గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హజరయ్యారు. 

హాజరైన ప్రముఖులు వీరే..

చిరంజీవి, అల్లు అరవింద్, వెంకటేశ్, అక్కినేని నాగ చైతన్య, సాయి ధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, రోషన్ మేక, అల్లు శిరీశ్, జయసుధ, సుకుమార్, బాబీ, సందీప్ కిషన్, అడవి శేష్, రీతు వర్మ, ప్రవీణ్ సత్తారు, కల్యాణ్‌కృష్ణ, సుశాంత్, జగపతిబాబు, మైత్రీ రవి, దిల్‌రాజు, కార్తికేయ, అలీ, బోయపాటి శ్రీనివాస్, సునీల్, మురళీమోహన్, మైత్రీమూవీ చెర్రీ, సుబ్బరామిరెడ్డి, శివలంక కృష్ణప్రసాద్, ఉత్తేజ్, సుబ్బరాజు, గుణశేఖర్, సుమ, రోషన్, వీఎన్ ఆదిత్య, శ్రీనివాస్‌రెడ్డి, సంపత్‌నంది, బన్నీవాసు, ప్రియదర్శి, నవదీప్, అభినవ్ గౌతం, వెంకీ అట్లూరి, నాగవంశీ, ప్రిన్స్, బెల్లంకొండ సురేశ్, అశ్వనీదత్, స్వప్నదత్, అవసరాల శ్రీనివాస్, కృష్ణ చైతన్య, భారత బ్యాడ్మింటన్ సంచలనం సైనా నెహ్వాల్, రాజేంద్ర ప్రసాద్, అల్లు బాబీ, నల్లమలుపు బుజ్జీ, హైపర్ ఆది తదితరులు పాల్గొని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సంబంధిత ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ప్రస్తుతం వరుణ్, లావణ్య పెళ్లి వీడియో గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ(OTT) ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది. ఈ వీడియో స్ట్రీమింగ్ రైట్స్ మొత్తాన్ని ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ.8 కోట్ల భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ జంట వివాహ క్షణాలను చూసేందుకు అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీని గురించి నెట్‌ఫ్లిక్స్ లేదా వరుణ్ లావణ్య నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2017 నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థంతో తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు.