కాఫీ డేట్ అంటూ విహరిస్తున్న లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్..

మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఎలాంటి గొడవలకు వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ… ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఎంతో సైలెంట్ గా ఉండే వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి తో రహస్యంగా ప్రేమాయాణం చేస్తూ […]

Share:

మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఎలాంటి గొడవలకు వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ… ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఎంతో సైలెంట్ గా ఉండే వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి తో రహస్యంగా ప్రేమాయాణం చేస్తూ వచ్చారు. అయితే ఈ విషయాన్ని తమ పెద్దలకు చెప్పడంతో వారి అంగీకారంతోనే పెళ్లికి సిద్ధమయ్యారు. అలా జూన్ 9వ తేదీ వరుణ్ తేజ్,  లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక త్వరలోనే వీరిద్దరు పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. అయితే నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ పలు వెకేషన్ లకు వెళుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

 ఇటీవల వీరిద్దరూ ఇటలీ వెకేషన్ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే..? అయితే తాజాగా మరోసారి ఈ కపుల్స్ కాఫీ డేట్ కి వెళ్లారని తెలుస్తోంది. ఈ విధంగా వీరిద్దరూ పెళ్లికి ముందే చిల్ అవుతూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అయితే ఇందులో వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా లావణ్య త్రిపాఠి ఫోటోని షేర్ చేయగా లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వరుణ్ తేజ్ ఫోటోలను షేర్ చేశారు.  ఇలా ఈ ఫోటోలు వైరల్ కావడంతో మెగా ఫాన్స్ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.. పెళ్లికి ఇంకాస్త టైం ఉండడంతో డేటింగ్ కు వెళ్తూ ఒకరు ఒకరు మరింత అర్థం చేసుకున్నారు. ఇకపోతే ఐదేళ్లపాటు ప్రేమాయణం నడిపిన లావణ్య  – వరుణ్ తేజ్ ఏమాత్రం కూడా ఎవరికి సందేహం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్కడ వీరి లవ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లూస్ దొరకకుండా చేశారు. ఆ విషయంలో చాలా గ్రేట్ అని అంటున్నారు. ఉన్నట్టుండి సడన్ గా కలిసి జీవించబోతున్నట్లు ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.

 ఏదేమైనా లావణ్య వరుణ్ తేజ్ ప్రేమను అనౌన్స్ చేయడంతో మెగా ఫ్యామిలీ, అభిమానులు, సినీ పెద్దలు హ్యాపీగానే ఫీలయ్యారు. సోషల్ మీడియా వేదికన విషెస్ కూడా తెలిపారు. నిశ్చితార్థం పూర్తి కావడంతో ఇక వీరి పెళ్లి బాజాలు ఎప్పుడు మోగుతాయా.. అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ  పిక్స్ చూసిన ఫ్యాన్స్ నెటిజన్లు కపుల్ గోల్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం “గాండీవ దారి అర్జున ” చిత్రంలో నటిస్తున్నారు. అటు లావణ్య తమిళంలో   ‘ తనల్ ‘ చిత్రంలో నటిస్తోంది. లావణ్య కూడా ఇప్పటివరకు పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది స్టార్ హీరోయిన్ అయ్యే రేంజ్ లో ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడు మళ్లీ తన సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ ఏది ఏమైనా అటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కెరియర్ లో  సక్సెస్ అవ్వాలని అలాగే వైవాహిక జీవితంలో కూడా సక్సెస్ పొందాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.