Varun Lavanya Marriage: వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి ముహూర్తం ఫిక్స్..!

మెగా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) వివాహం(marriage) అతి తొందర్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్(Pre wedding) సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. వివాహ ముహూర్తంతో పాటుగా వేదిక పైన స్పష్టత వచ్చింది. విశాఖ వేదిక గురించి ఉపాసన కొణిదెల(Upasana Konidela) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అటు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సైతం వరుణ్ తేజ్ వివాహం కోసం తన వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. […]

Share:

మెగా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) వివాహం(marriage) అతి తొందర్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్(Pre wedding) సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. వివాహ ముహూర్తంతో పాటుగా వేదిక పైన స్పష్టత వచ్చింది. విశాఖ వేదిక గురించి ఉపాసన కొణిదెల(Upasana Konidela) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అటు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సైతం వరుణ్ తేజ్ వివాహం కోసం తన వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ పూర్తిగా సెలబ్రేషన్స్ జోష్ లో ఉంది.

వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ ముహూర్తం ఖరారైంది. జూన్ 9న వీరిద్దరి నిశ్చితార్దం జరిగింది. ఆ తరువాత ఇద్దరూ సినిమా షూటింగ్స్ లో బిజీ అయ్యారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటగా మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో మిస్టర్ సినిమా(Mister Movie) షూటింగ్ ఇటలీ(Italy)లోనే జరిగింది.  ఆ సమయంలోనే వీళ్ల లవ్ ట్రాక్ నడిచింది. అయితే ఆ సినిమా సక్సెస్‌ కాకపోయినప్పటికి వీళ్లిద్దరి ప్రేమ మాత్రం ఏడడుగుల వరకు వెళ్లింది. అప్పుడు వరుణ్ తేజ్(Varun Tej) – లావణ్య(Lavanya Tripathi) ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలను చిరంజీవి(Chiranjeevi) సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఈ ఫొటోలు ఇప్పుడు మెగా అభిమానుల మధ్య వైరల్ గా మారాయి. 

ఇటలీ వేదికగా కల్యాణం: 

వరుణ్ తేజ్-లావణ్య వివాహం నవంబర్ 1న( November 1th) జరగనుందని మెగా క్యాంపు నుంచి సమాచారం అందుతోంది. అయితే, వివాహం మాత్రం ఇటలీలోని టుస్కానీ(Tuscany) నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రీ వెడ్డింగ్ ఫొటోలు(Pre wedding photos) షేర్ చేసిన ఉపాసన తాము టస్కనీ వచ్చేసామని రాసుకొచ్చారు. ఇక, పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 17న ఇటలీ వెళ్లనున్నారు. వివాహం అనంతరం తిరిగి వస్తారని తెలుస్తోంది. దీంతో, ఇంకా కొద్ది రోజుల్లోనే  వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది. వివాహం ఇటలీలో జరిగినా..హైదరాబాద్ తో పాటుగా డెహ్రాడూన్ లోనూ రిసిప్షెన్ ఏర్పాటు చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ లో పెరగటంతో అక్కడ కూడా రిసిప్షెన్ కు నిర్ణయించారు.

మెగా ఇంట సెలబ్రేషన్స్:

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్(Pre wedding celebrations) లో మెగా..అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం వేడకల్లో ఉన్నారు. ఇటలీ మధ్య ప్రాంతంలో ప్రకృతి రమణీయతకు మారుపేరుగా టస్కనీ ప్రఖ్యాతి గాంచింది. టస్కనీ రాజధాని ఫ్లోరెన్స్(Florence) అపురూప శిల్పకళా సంపదకు నిలయంగా వర్ధిల్లుతోంది. ఇక్కడ ఎల్బా ప్రాంతంలోని బీచ్ లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇక అక్కడే వరుణ్, లావణ్య వివాహం జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో, తాజా ఫొటోలు మెగా ఫ్యాన్స్ మధ్య వైరల్ అవుతున్నాయి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) మంచి జోరు మీద ఉన్నారు. జయాపజయాలను పట్టించుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన సినిమాల బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. ఆయన గత చిత్రం ‘గాండీవధారి అర్జున’ అట్టర్ ఫ్లాప్ అయినా ఆ ప్రభావం రాబోయే సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మీద పడలేదు. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా రూపొందుతోన్న ‘ఆపరేషన్ వాలెంటైన్’(Operation Valentine)కు మంచి నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే ‘ఆపరేషన్ వేలంటైన్’ షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ 50 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు కావడం గమనార్హం. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా ‘మట్కా’ చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు.