‘బ్రేక్‌ఫాస్ట్‌ డేట్‌’లో వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య‌!

‘మెగా’ ఇంటి కోడలిగా వెళ్లబోతోంది లావణ్య త్రిపాఠి. నాగబాబు కొడుకు వరుణ్‌ తేజ్, లావణ్య ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట ఒక్కటి కాబోతోంది. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు వీళ్లిద్దరూ వెకేషన్‌కు వెళ్లారు. విదేశాల్లో విహరిస్తున్న ఈ ప్రేమ జంట.. సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘బ్రేక్‌ఫాస్ట్‌ డేట్‌’ అంటూ కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో లావణ్య త్రిపాఠి పోస్టు చేసింది. మరోవైపు వరుణ్ తేజ్‌ కూడా కొన్ని ఫొటోలను […]

Share:

‘మెగా’ ఇంటి కోడలిగా వెళ్లబోతోంది లావణ్య త్రిపాఠి. నాగబాబు కొడుకు వరుణ్‌ తేజ్, లావణ్య ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట ఒక్కటి కాబోతోంది. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు వీళ్లిద్దరూ వెకేషన్‌కు వెళ్లారు. విదేశాల్లో విహరిస్తున్న ఈ ప్రేమ జంట.. సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘బ్రేక్‌ఫాస్ట్‌ డేట్‌’ అంటూ కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో లావణ్య త్రిపాఠి పోస్టు చేసింది. మరోవైపు వరుణ్ తేజ్‌ కూడా కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ‘వీకెండ్ లోడింగ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. తన ఫొటో తీసింది లావణ్యనే అని పేర్కొన్నాడు.

ఇటలీలో పెళ్లి..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ, అటు లావణ్య నుంచి కానీ ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ ప్రచారాన్ని వాళ్లు ఖండించనూ లేదు. ఈ నేపథ్యంలో జున్ 9న హైదరాబాద్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కొడుకు రామ్‌చరణ్, అల్లు అర్జున్, తదితరులు హాజరయ్యారు. ఇక పెళ్లి వేడుకను ఇటలీలో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి పెళ్లి గురించిన అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఇటలీలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పనులు కూడా ఇప్పటికే మొదలైనట్లుగా తెలుస్తోంది.

‘‘వరుణ్ ఎప్పుడూ తన విషయాలను బయటపెట్టడానికి ఇష్టపడడు. ఏదైనా సరే సింపుల్‌గా జరిగిపోవాలని అనుకుంటాడు. అందుకే వాళ్లు ఇటలీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అతిథుల జాబితాలో కేవలం 50 మంది మాత్రమే ఉంటారు. వాళ్లిద్దరికీ కూడా ఇదే కావాలి” అని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులను ఆహ్వానించనున్నారని సమాచారం.

ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు..

ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదని, ఈ ఏడాదిలోనే చేసుకుంటానని చెప్పాడు. ‘‘మా అమ్మ ఇంకా తేదీ ఖరారు చేయలేదు. పెళ్లి తేదీ విషయంలో ఆమెదే తుది నిర్ణయం. తేదీ ఓకే అయ్యాక వేదిక ఎక్కడనేది ఫిక్స్ చేస్తాం” అని చెప్పుకొచ్చాడు. పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక తర్వాతి సినిమాపై ప్లాన్ చేస్తానని అన్నాడు.

‘అంతరిక్షం’లో ప్రేమ

అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. దూసుకెళ్తా, భలె భలె మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, రాధ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. వరుణ్‌ తేజ్‌తో కలిసి మిస్టర్, అంతరిక్షం 9000 కిలోమీటర్లు సినిమాలో నటించింది. చివరి సారిగా 2022లో హ్యాపీ బర్త్‌డే సినిమాతో ప్రేక్షకులను పలకరిచింది.  అంతరిక్షం సినిమాతోనే వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు ఈ జంట త్వరలో పెళ్లిపెట్టలెక్కనుంది. మరోవైపు ముందు ఎవరు తమ ప్రేమను వ్యక్తం చేశారనే ప్రశ్నకు వరుణ్ తేజ్ బదులిస్తూ.. లావణ్యనే ప్రపోజ్ చేసిందని వరుణ్ తేజ్ చెప్పాడు. ఇక వరుణ్‌తేజ్ 2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత కంచె, లోఫర్, ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్‌2, గద్దలకొండ గణేశ్, ఎఫ్‌3 తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో గాండీవధారి అర్జునతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.