జిమ్‌లో వరుణ్, లావణ్య వర్క్ అవుట్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా గాండీవ దారి అర్జున సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మెగా ఫాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి తన జీవితంలోకి రాబోతుందని ఆమె వరుణ్ తేజ్ సినీ కెరీర్ కు ఐరన్ లెగులా మారింది అంటూ చాలామంది లావణ్య త్రిపాటి పై విమర్శలు చేస్తూ వచ్చారు. ఇలా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో వరుణ్ […]

Share:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా గాండీవ దారి అర్జున సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మెగా ఫాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి తన జీవితంలోకి రాబోతుందని ఆమె వరుణ్ తేజ్ సినీ కెరీర్ కు ఐరన్ లెగులా మారింది అంటూ చాలామంది లావణ్య త్రిపాటి పై విమర్శలు చేస్తూ వచ్చారు. ఇలా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో వరుణ్ తేజ్ ఈ సినిమా విషయం అంతటితో మర్చిపోయి తదుపరి సినిమాలపై ఫోకస్ చేశారు.

 ఇటు అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన లావణ్య అనతికాలంలో ఫేమ్ తెచ్చుకుంది. లావణ్య సీరియల్ నటి కాగా ఆమెను దర్శకుడు హను రాఘవపూడి హీరోయిన్ చేశాడు. అందాల రాక్షసి ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. కమర్షియల్ గా ఆడకున్నా… లావణ్యకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. అనంతరం విష్ణుకు జంటగా నటించిన దూసుకెళ్తా సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ మూవీ మనం లో క్యామియో రోల్ చేసిన లావణ్యకు వరుసనే రెండు హిట్స్ పడ్డాయి. 

నానికి జంటగా నటించిన భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్. దర్శకుడు మారుతి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.  అనంతరం సోగ్గాడే చిన్ని నాయనా మూవీతో మరో హిట్ కొట్టింది. దాంతో లావణ్యకు ఆఫర్స్ క్యూ కట్టాయి. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ లావణ్య త్వర ఫేడ్ అవుట్ అయ్యింది. కేవలం పదేళ్లలో ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. అయితే మెగా ఫ్యామిలీ కోడలిగా వార్తల్లో నిలిచింది. లావణ్య వరుణ్ తేజ్ భార్య కానుంది. 

 జూన్ 9న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ నాగబాబు నివాసంలో జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు.  ఐదేళ్లకు పైగా వరుణ్, లావణ్య డేటింగ్ చేస్తున్నారని సమాచారం. 2017లో మిస్టర్ మూవీ కోసం జత కట్టిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.  

రెండేళ్లుగా వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను లావణ్య ఖండించడం విశేషం. దాంతో ఎక్కడో ఓ మూలన సందేహాలు ఏర్పడ్డాయి. ఆగస్టు చివరి వారంలో లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ వివాహం అంటూ ప్రచారం జరుగుతుంది. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.

ఇకపోతే వరుణ్ తేజ్ గత కొన్ని సంవత్సరాలుగా నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రేమలో విహరిస్తున్నటువంటి ఈ జంట పెద్దల అంగీకారంతో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇలా వీరి నిశ్చితార్థం జూన్ 20వ తేదీ ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.  ఇక పోతే ఈ జంట ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక వరుణ్ తేజ్ సైతం తన ప్రేమ విషయం బయటపడిన తర్వాత తమ ప్రేమ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. లావణ్య త్రిపాఠి, తన ఆలోచనలు అభిరుచులు ఒకటే కావడంతో జీవితాంతం ఇలాగే ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నామని అందుకే ఈ ప్రేమ విషయాన్ని నేనే ముందుగా లావణ్యకు ప్రపోజ్ చేశాను అంటూ వరుణ్ తెలిపారు. ఇక వీరి ప్రేమ విషయంలో నిహారిక సపోర్ట్ కూడా చాలా ఉందనే చెప్పాలి. ఈ విధంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక వీరి వివాహం నవంబర్ చివరిన లేదా డిసెంబర్ నెలలో జరగవచ్చని వరుణ్ తేజ్ వెల్లడించారు అయితే ఇప్పటికే పెళ్లి పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.  

ఇలా పెళ్లి పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెళ్లి కాకుండానే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా భారీగా వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్నారు. తరచూ నిహారిక లావణ్య జిమ్ కి వెళ్తూ వర్క్ అవుట్ చేయడం మనం చూస్తుంటాము అయితే తాజాగా కాబోయే భర్తతో కలిసి లావణ్య జిమ్ లో భారీగా వర్కౌట్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. 

ఈ క్రమంలోనే జిమ్ లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోని వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బెస్ట్ వర్కౌట్ బుడ్డి అంటూ లావణ్యతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో నేటిజన్స్ ఈ ఫోటో పై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లి కాకుండానే ఇద్దరు భారీగా కష్టపడుతున్నారంటూ కొందరు ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు.