వైష్ణవి మరో జయసుధ: చిరంజీవి

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బేబీ సినిమా క్రియేట్ చేస్తున్న క్రేజ్ అనేది మామూలుగా లేదు. ‘బేబీ’ సినిమా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అత్యంత వేగంగా వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మీడియం రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలతో సమానంగా నడిచే సినిమాగా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ వైష్ణవి చైతన్య నటనకు ఎక్కువ మార్కులు వేశారు. గతంలో జరిగిన ఈవెంట్లలో అల్లు అరవింద్ […]

Share:

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బేబీ సినిమా క్రియేట్ చేస్తున్న క్రేజ్ అనేది మామూలుగా లేదు. ‘బేబీ’ సినిమా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అత్యంత వేగంగా వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మీడియం రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలతో సమానంగా నడిచే సినిమాగా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ వైష్ణవి చైతన్య నటనకు ఎక్కువ మార్కులు వేశారు. గతంలో జరిగిన ఈవెంట్లలో అల్లు అరవింద్ అంతేకాకుండా అల్లు అర్జున్ కూడా ఆమెను ప్రశంసించారు. 

ఆమె మరో జయసుధ: 

అయితే బేబీ సినిమా సెలబ్రేషన్స్ సందర్భంగా, చిరంజీవి ముఖ్య అతిథిగా ‘మెగా కల్ట్ సెలబ్రేషన్స్’ పేరుతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేదికపై చిరంజీవి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా దర్శక, నిర్మాతలు, హీరోలుగా నటించిన ఆనంద్ దేవరకొండ, విరాజ్‌లను అభినందిస్తూ వైష్ణవి చైతన్య నటనను మెచ్చుకున్నారు.

వైష్ణవి పాత్ర.. ఆమె నటన ఈ సినిమాను నిలబెట్టాయి పొగడ్తలతో ముంచుతారు. డీగ్లామర్ అయినా..గ్లామరస్ అయినా.. వేరియేషన్ చూపించిన వైష్ణవి పాత్ర తీరు బాగుంది అని చెప్పారు. చాలా సన్నివేశాలు చూశాక ఈ అమ్మాయి నటనలో చాలా మెచ్యూర్డ్ అనిపించింది అని అన్నారు. ఇది ఆమెకు మొదటి సినిమా అని వినగానే తెలిసి షాక్ అయ్యాను ఆటో చిరంజీవి బేబీ సినిమా గురించి మాట్లాడుతూ, ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఈ నేపథ్యంలో నేను ఒక మాట చెబుతున్నా.. నా మాట వృథా కాదు అంటూ చిరంజీవి ఒక మాట చెప్పారు. మనకు సహజ నటి జయసుధ ఉంది అని సంగతి తెలిసిందే అని.. ఎలాంటి పాత్రనైనా జయసుధ గారు చాలా బాగా చేసేవారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జయసుధ నటన గురించి, ఆ స్థానంలో ఎవరు వస్తారని ఆయన ఎప్పుడూ ఆలోచించేవారని.. ప్రస్తుతం బేబీ సినిమాలో నటించిన వైష్ణవిలో ఆ లక్షణాలు చూశాను అంటూ పొగిడారు చిరంజీవి. అంతేకాకుండా ఆమె భవిష్యత్తును చూస్తున్నాను అని.. చాలా సహజంగా నటించిన వైష్ణవికి మంచి భవిష్యత్తు ఉంది అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. 

బేబీ సినిమా విశేషాలు: 

బేబీ సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి ఇప్పటివరకు, బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూలను చూస్తూనే వచ్చింది. నిజానికి ఈ సినిమా నేచురల్ లవ్ స్టోరీ గా అనిపిస్తుంది. సహజ సిద్ధమైన పాత్రలు ఈ సినిమాలో మనకి కనువిందు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ గా నటించిన వైష్ణవి పాత్ర ప్రేక్షకులను ఎక్కువగా అలరించిందని చెప్పుకోవాలి. ఇది ఒకే సినిమా అయినాప్పటికీ అందులో ఆమె పాత్రలు రెండుగా మనకి కనిపిస్తాయి. రెండు భిన్నమైన అభిప్రాయాలు కలిగిన ఇద్దరు అమ్మాయిలు నటిస్తున్నట్లు చేసిన వైష్ణవి నటన అందరిని అలరించింది. ప్రస్తుతం చిరంజీవి వైష్ణవి గురించి మాట్లాడిన కొన్ని అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వైష్ణవి నటన చూసిన తర్వాత ఆయనకి నటి జయసుధ గుర్తొచ్చిందని, వైష్ణవికి భవిష్యత్తులో మరెన్నో మంచి అవకాశాలు వస్తాయి అంటూ చిరంజీవి బేబీ సినిమా గురించి, అందులో నటించిన నటి నటుల గురించి చాలా బాగా మాట్లాడారు. అయితే మరోపక్క బేబీ సినిమా ఆర్ఎక్స్ 100 సినిమాగా ఉంది అంటూ విమర్శలు కురిపించిన కొందరు లేకపోలేదు. ఏది ఏమైనాప్పటికీ విమర్శలకు దీటుగా సమాధానం ఇస్తూ బేబీ సినిమా వసూల్లను కలెక్ట్ చేస్తూ దూసుకుపోతోంది.