Urvashi Rautela: ఊర్వశికి షాక్.. ఫోన్ కొట్టేసిన వ్యక్తి కండీషన్ ఏంటో తెలుసా..?

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)కు ఓ వ్యక్తి తాజాగా ఈ-మెయిల్(Email) పంపాడు. ‘నీ ఫోన్ నా దగ్గర ఉంది. నీకు అది కావాలంటే.. నా సోదరుడు క్యాన్సర్(Cancer) నుంచి కోలుకోవడానికి నువ్వు నాకు సాయం చేయాలి’ అని ఈ-మెయిల్‌లో ఆ వ్యక్తి పేర్కొన్నాడు. కొందరు సినీ సెలబ్రిటీలకు క్రికెట్(Cricket) అంటే అభిమానం పీక్స్‌లో ఉంటుంది. అందుకే ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా నేరుగా చూడడానికి స్టేడియంకు వెళ్లిపోతుంటారు. బాలీవుడ్‌(Bollywood)లో అలాంటి క్రికెట్ పిచ్చి ఉన్న […]

Share:

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)కు ఓ వ్యక్తి తాజాగా ఈ-మెయిల్(Email) పంపాడు. ‘నీ ఫోన్ నా దగ్గర ఉంది. నీకు అది కావాలంటే.. నా సోదరుడు క్యాన్సర్(Cancer) నుంచి కోలుకోవడానికి నువ్వు నాకు సాయం చేయాలి’ అని ఈ-మెయిల్‌లో ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

కొందరు సినీ సెలబ్రిటీలకు క్రికెట్(Cricket) అంటే అభిమానం పీక్స్‌లో ఉంటుంది. అందుకే ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా నేరుగా చూడడానికి స్టేడియంకు వెళ్లిపోతుంటారు. బాలీవుడ్‌(Bollywood)లో అలాంటి క్రికెట్ పిచ్చి ఉన్న సినీ సెలబ్రిటీల్లో ఊర్వశి రౌతేలా కూడా ఒకరు. తనకు ఇండియన్ మెన్ క్రికెట్ టీమ్‌తో మంచి ఫ్రెండ్‌షిప్ ఉండడంతో స్టేడియంలో ఇండియన్ టీమ్ ఎప్పుడు ఆడడానికి అడుగుపెట్టినా.. వారిని ప్రోత్సహించడానికి ఊర్వశి అక్కడే ఉంటుంది. ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ 2023(ODI World Cup) జరుగుతుండగా.. ఒక క్రికెట్ ఫ్యాన్‌గా మ్యాచ్‌ను నేరుగా చూడడానికి వెళ్లింది. ఊర్వశి. అదే సమయంలో తన గోల్డ్ ఐఫోన్(Gold IPhone) పోగొట్టుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా(Social Media) వేదికగా ప్రకటించిన ఈ భామ.. అది రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చిన వారికి రివార్డ్ ప్రకటించింది. తాజాగా, ఓ వ్యక్తి తన దగ్గర ఆమె ఫోన్ ఉందని ఇవ్వాలంటే తన కండీషన్‌కు ఒప్పుకోవాలని మెయిల్ పెట్టాడు. ‘‘నీ ఫోన్ నా దగ్గర ఉంది. నీకు అది కావాలంటే.. నా సోదరుడు క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి నువ్వు నాకు సహాయం చేయాలి’’ అని మెయిల్ చేశాడు. ఇమెయిల్‌కు ప్రతిస్పందిస్తూ ఊర్వశీ రౌతేలా థంబ్స్-అప్ ఇచ్చారు. దీనిని ఆమె స్క్రీన్‌షాట్ తీసి తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ అవుతోంది.

24 క్యారెట్ల గోల్డెన్ ఐఫోన్..

వన్డే వరల్డ్ కప్ 2023లో గత వారం ఇండియా వర్సెస్ పాకిస్థాన్(Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌ను చూడడానికి ఎంతోమంది క్రికెట్ లవర్స్(Cricket Lovers) హాజరయ్యారు. అందులో ఊర్వశి రౌతేలా కూడా ఒకరు. అదే సమయంలో స్టేడియంలో తన కాస్ట్‌లీ ఐఫోన్‌(IPone)ను పోగొట్టుకుంది. ‘‘అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నా 24 క్యారెట్ల గోల్డ్ ఐఫోన్‌ను పోగొట్టుకున్నాను. ఎవరికైనా దొరికితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. దయజేసి సాయం చేయండి. నన్ను వీలైనంత త్వరగా కాంటాక్ట్ అవ్వండి’’ అని ఊర్వశి తన సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేసింది. దీంతో పాటు తను పోలిసులకు ఇచ్చిన కంప్లైంట్ కాపీని కూడా షేర్ చేసింది. అయితే రెండురోజులు అయినా తన ఫోన్ జాడ తెలియకపోవడంతో తన ఫోన్ తీసుకొచ్చి ఇచ్చిన వారికి రివార్డ్ ప్రకటించింది ఊర్వశి.

మామూలు ఫోన్‌ను ఉపయోగిస్తున్నా..

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను నేరుగా వీక్షించడానికి చాలామంది స్టేడియంకు హాజరయ్యారు. అదే సమయంలో చాలామంది తమ వస్తువులు పోయాయని వాపోయారు. అలాగే ఊర్వశి కూడా తన గోల్డ్ ఐఫోన్‌(IPhone)ను పోగొట్టుకుంది. కానీ ఎలాగైనా దానిని తిరిగి దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఐఫోన్ పోయిందని తను షేర్ చేసిన పోస్టులో అహ్మదాబాద్(Ahmedabad) పోలీసులను ట్యాగ్(Tag) చేయడంతో వారు స్పందించారు. ఫోన్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుకున్నారు. ప్రస్తుతం ఊర్వశి.. మామూలు ఫోన్‌ను ఉపయోగిస్తున్నానని, తన గోల్డ్ ఐఫోన్(Gold IPhone) కోసం ఎదురుచూస్తున్నానని వాపోయింది. 

రివార్డ్ ఇస్తాను..

ఐఫోన్(IPhone) చివరి లొకేషన్ అహ్మదాబాద్‌లోని ఒక మాల్‌లో చూపించినట్టుగా ఊర్వశి తెలుసుకుంది. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసింది. ‘‘రివార్డ్(Reward) ఇస్తాను. నా ఫోన్ చివరి లొకేషన్ ఒక మాల్‌(Mall)లో చూపించింది’’ అని చెప్పుకొచ్చింది. రివార్డ్(Reward) ఇస్తానని చెప్పింది కానీ ఆ రివార్డ్ ఏంటి అని మాత్రం ఊర్వశి బయటపెట్టలేదు. తన గోల్డెన్ ఐఫోన్‌(Golden IPhone)ను తిరిగి దక్కించుకోవడం కోసం ఊర్వశి చేస్తున్న ప్రయత్నాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆరోజు స్టేడియంలో లక్షల మంది ఉన్నారని, ఆ సమయంలో ఐఫోన్‌ను ఎవరైనా దొంగిలించినా.. అది తిరిగి దొరికే ఛాన్స్ లేదని, దాని గురించి వదిలేయమని ఈ హీరోయిన్‌కు కొందరు సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు.