టాలీవుడ్-కోలీవుడ్ కాంబోలో సినిమా

ఉప్పెన సినిమాతో పాపులర్ అయిన డైరెక్టర్ బుచ్చిబాబు మరో వినూత్న చిత్రాన్ని అందించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్-కోలీవుడ్ కొంబోలో రాబోతున్న ఈ సినిమాలో, టాలీవుడ్ లో ఫేమస్ హీరో, కోలీవుడ్ లో ఫేమస్ హీరో నటించబోతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమాలో బిజీగా ఉండగానే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ షెడ్యూల్ కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్ర నిర్మాణం వచ్చే సంవత్సరం జనవరి నుంచి మొదలవుతున్నట్లు సమాచారం.  […]

Share:

ఉప్పెన సినిమాతో పాపులర్ అయిన డైరెక్టర్ బుచ్చిబాబు మరో వినూత్న చిత్రాన్ని అందించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్-కోలీవుడ్ కొంబోలో రాబోతున్న ఈ సినిమాలో, టాలీవుడ్ లో ఫేమస్ హీరో, కోలీవుడ్ లో ఫేమస్ హీరో నటించబోతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమాలో బిజీగా ఉండగానే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ షెడ్యూల్ కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్ర నిర్మాణం వచ్చే సంవత్సరం జనవరి నుంచి మొదలవుతున్నట్లు సమాచారం. 

టాలీవుడ్-కోలీవుడ్ కొంబో: 

ఉప్పెన సినిమాతో పాపులర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు మరో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ ఫేమస్ నటుడు విజయ్ సేతుపతి ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి గురించి ప్రత్యంగించి చెప్పాల్సిన అవసరం లేదు. తాను ఎటువంటి సినిమా తీసిన, అందులో నటించడం కాకుండా జీవిస్తూ ఉంటాడు. ఒక సినిమా నిజంగా మన కళ్ళ ముందు జరుగుతుందా అన్నట్లు విజయ్ సేతుపతి నటన అలరిస్తోంది. ఇప్పుడు, కోలీవుడ్ లో ఫేమస్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ లో ఫేమస్ హీరో రామ్ చరణ్ కలిసి బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం. 

ముఖ్యంగా ఈ సినిమాని వృద్ధి సినిమాస్-సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు ఏ ఆర్ రెహమాన్.  పాన్-ఇండియన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన S S రాజమౌళి-RRR, దక్కించుకున్న విజయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ప్రొడక్షన్ బ్యానర్ లో వచ్చిన RRR మూవీలో నటించిన, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. వారి నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఇప్పుడు అదే బ్యానర్ కాంబినేషన్ లో రాబోతున్న విజయ్ సేతుపతి-రామ్ చరణ్ కాంబో చిత్రం కూడా విజయవంతం అవుతుందని అంచనాలతో రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

రామ్ చరణ్ గేమ్ చేంజర్: 

మొదటిలో కియారా అద్వానీ- రామ్ చరణ్ జతగా నటించిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ఆదరభిమానాలు అందుకున్న తర్వాత, మళ్లీ ఈ జంట గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి శంకర్ డైరెక్టర్, నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రివిల్ అయిన సంగతి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ కియారా అద్వానీ ఫస్ట్ లుక్, ఆమె బర్త్డే సందర్భంగా ఈరోజు విడుదల కాబోతోంది. 

గేమ్ చేంజర్ అనేది నిర్మాతగా దిల్ రాజు తీస్తున్న 50వ సినిమా. అంతేకాకుండా, అతని అత్యంత ఖరీదైన నిర్మాణంతో మొదటి పాన్-ఇండియన్ చిత్రం అవడం విశేషం. ఇది మావెరిక్ ఫిల్మ్ మేకర్ శంకర్ తీస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా. ఇంకా, తన కెరీర్‌లో మొదటిసారి, నిర్మాత దిల్ రాజు కూడా తన సినిమాను పూర్తిగా కార్పొరేట్ స్టూడియో జి స్టూడియోస్కి అమ్మడం జరిగింది. 325 కోట్ల – 350 కోట్ల రేంజ్‌లో ఈ డీల్ జరిగినట్లు సమాచారం. 

రామ్ చరణ్ గురించి మరింత: 

చరణ్ తన మొదటి చిత్రం చిరుత (2007)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్ డూపర్ హిట్ అయిన RRR (2022), ఇది ₹1,200 కోట్లు (US$150 మిలియన్లు) సంపాదించింది, తర్వాత అదే అత్యధిక వసూళ్లు సాధించింది. RRRలో తన నటనతో ఆకర్షించి, యాక్షన్ మూవీలో ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ ఛాయిస్ నామినేషన్లో అవార్డ్స్‌ అందుకున్నాడు.