మార్చిలో తెలుగు సినిమాలు

మార్చి 2023లో రాబోయే తెలుగు సినిమాలు కబ్జా, దసరా, బలగం మరియు మరెన్నో… 2023 సంవత్సరంలో మొదటి రెండు నెలలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అద్భుతమైన విజయాలు ఏమీ అందలేదు. వీర సింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య మరియు సార్ వంటి సినిమాలు మాత్రమే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలాగే ఈ సినిమాలు వాణిజ్య పరమైన విజయాన్ని కూడా అందుకున్నాయి. అయితే ఈ మూడు తప్ప చెప్పుకోదగ్గ గొప్ప సినిమాలు ఏమీ రాలేదు. అప్పుడే మార్చి […]

Share:

మార్చి 2023లో రాబోయే తెలుగు సినిమాలు

కబ్జా, దసరా, బలగం మరియు మరెన్నో…

2023 సంవత్సరంలో మొదటి రెండు నెలలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అద్భుతమైన విజయాలు ఏమీ అందలేదు. వీర సింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య మరియు సార్ వంటి సినిమాలు మాత్రమే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలాగే ఈ సినిమాలు వాణిజ్య పరమైన విజయాన్ని కూడా అందుకున్నాయి. అయితే ఈ మూడు తప్ప చెప్పుకోదగ్గ గొప్ప సినిమాలు ఏమీ రాలేదు. అప్పుడే మార్చి నెలలోకి అడుగు పెట్టేశాం. సమ్మర్ కూడా దగ్గర పడుతున్నందున రాబోయే నెలలో విడుదల కానున్న అన్ని టాలీవుడ్ సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.

బలగం – మార్చి 3వ తేదీ

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన బలగం మార్చి నెల మొదటి వారంలో విడుదల అయింది. తెలంగాణా పల్లెవాసుల జీవితం చుట్టూ తిరిగే ఈ డ్రామాకి చిత్ర నిర్మాత వేణు యెల్దండి దర్శకత్వం వహించారు.

CSI సనాతన్ – మార్చి 10వ తేదీ

శివశంకర్ దేవ్ దర్శకత్వం వహించిన CSI సనాతన్ చిత్రంలో కౌశిక్ మహాత, ఆది మరియు నందినా రాయ్ తదితరులు నటించారు. ఒక కేసు సమయంలో జీవితం తల కిందులయ్యే సాహసో పేతమైన పరిశోధకుడిగా కథను అల్లినట్టు తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ మార్చి 10వ తేదీన పెద్ద తెరపైకి వచ్చింది.

గాందీవధారి అర్జున – మార్చి 13వ తేదీ

వరుణ్ తేజ ప్రధాన పాత్రలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా డబ్ చేయబడిన గాంధీవధారి అర్జునగా తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి పెద్దగా తెలియనప్పటికీ మార్చి 13వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

కబ్జా – మార్చి 17వ తేదీ

కబ్జా 1942 నుండి 1947 మధ్య కాలంలో జరిగిన కథా అంశంతో ఉపేంద్ర, సుదీప్ మరియు శ్రియ శరణ్ ప్రధాన పాత్రలలో వస్తున్న ఒక యాక్షన్ డ్రామా చిత్రం. ఆర్ చంద్రు రచన, దర్శకత్వం వహించిన కబ్జా మార్చి 17వ తేదీన సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించినట్లు సమాచారం.

బెదురులంక 2012 – మార్చి 22వ తేదీ

క్లాక్స్ హెల్మ్ చేసిన బెదురులంక 2012లో నేహా శెట్టి, కార్తికేయ గుమ్మకొండ మరియు అజయ్ ఘోష్ నటించారు. ‘ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ 2012’ కాన్సెప్ట్ ఆధారంగా మార్చి 22వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

దాస్ కా ధమ్కీ – మార్చి 22వ తేదీ

విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయంలో నటించిన దాస్ కా ధమ్కి ఒక యాక్షన్ చిత్రం. ఇందులో నివేదా పేతురాజ్, రావు రమేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్చి 22వ తేదీన సినిమా థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

దసరా – మార్చి 30

మార్చిలో అత్యంత ఎదురుచూసిన సినిమాలలో నాని మరియు కీర్తి సురేష్ నటించిన దసరా ఆన్‌లైన్‌లో చాలా సంచలనం సృష్టిస్తోంది. శ్రీకాంత్ ఒదెల రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలంగాణలోని గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనులలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. మార్చి 30వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.