క్లీంకారా తొలి వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం

ఉపాసన, రామ్ చరణ్ వివాహం తర్వాత 11 సంవత్సరాలకు ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీ ఉపాసన పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఇలా మెగా కుటుంబంలోకి మూడో తరం వారసురాలు రావడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ చిన్నారికి క్లీంకారా అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే తన కూతురు జన్మించి దాదాపు రెండు నెలలు దాటిపోయిన ఇప్పటివరకు ఉపాసన క్లీంకారా […]

Share:

ఉపాసన, రామ్ చరణ్ వివాహం తర్వాత 11 సంవత్సరాలకు ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీ ఉపాసన పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఇలా మెగా కుటుంబంలోకి మూడో తరం వారసురాలు రావడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ చిన్నారికి క్లీంకారా అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే తన కూతురు జన్మించి దాదాపు రెండు నెలలు దాటిపోయిన ఇప్పటివరకు ఉపాసన క్లీంకారా ఫోటోని రివిల్ చేయలేదు.

ఆగస్టు 15వ తేదీ తన అమ్మమ్మతో కలిసి క్లీంకారా జెండా ఎగరవేసిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.అయితే ఇక్కడ కూడా తన కూతురి ఫేస్ కనపడకుండా ఉపాసన జాగ్రత్త పడింది.ఇకపోతే శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉపాసన వరలక్ష్మి వ్రతం నిర్వహించారని తెలుస్తోంది. దీంతో తన కుమార్తెతో కలిసి ఈ పూజలో పాల్గొన్నటువంటి ఈమె అందుకు సంబంధించిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ఇలా కూతురు జన్మించాక మొదటి వరలక్ష్మి వ్రతం కావడంతో తన కుమార్తెతో కలిసి ఉపాసన ఈ వేడుకను జరుపుకున్నారు.

ఉపాసన తన కూతురు క్లీంకారా కలిసి ఈ సారి వరలక్ష్మీ వ్రతం చేశారు. ఇక క్లీంకారను ఎత్తుకుని వరలక్ష్మీ పూజను పూర్తి చేసింది ఉపాసన. ఈ మేరకు ఓ ఫోటోను ఉపాసన షేర్ చేసింది. అందులో క్లీంకారా మొహం కనిపించకుండా ఎమోజీని అడ్డుగా పెట్టింది. రామ్ చరణ్ మెగా ఇంట్లో క్లీంకారా రాకతో సంబరాలు ఆకాశన్నంటాయి. పదేళ్లకు పైగా ఎదురుచూపులకు తగ్గ ప్రతిఫలం దక్కింది. తాత అయ్యానంటూ చిరంజీవి ప్రకటించిన పోస్టుల, క్లీంకారను ఎత్తుకుని ఆడిస్తున్నప్పుడు చిరు కళ్లలో కనిపించే ఆనందం గురించి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతోన్నారంటూ చిరంజీవి మొదటగా ప్రకటించాడు. క్లీంకార జన్మించింది అని కూడా చిరుయే ముందుగా పోస్ట్ వేశాడు.

ఈ బర్త్ డే తనకు ఎంతో ప్రత్యేకమని, క్లీంకారా రాకతో ఎంతో ప్రత్యేకంగా మారిందని చిరు చెప్పుకొచ్చాడు. ఇక ఉపాసన కూడా ఇది ఎన్ని రకాలుగా ప్రత్యేకంగా మారింది. మొదటి సారి ఇలా తన కూతురితో కలిసి వరలక్ష్మీ వ్రతం చేసుకుందట. ఇంతకంటే నేనేం ఎక్కువ అడగలేను.. క్లీంకారాతో నా మొదటి వరలక్ష్మీ వ్రతం అంటూ సంబరపడిపోయింది ఉపాసన.

ఇక రామ్ చరణ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటంతో ఈ పూజలో కూర్చోలేదని తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగులో జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ పూజకు రామ్ చరణ్ గైర్హాజరు అయినట్టుగా కనిపిస్తోంది. మిస్ అయ్యాను అంటూ బాధగా ఉందన్నట్టుగా రామ్ చరణ్ పోస్ట్ వేశాడు. ఆ ఎమోజీ మాత్రం బాగుందంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.

రామ్ చరణ్ లేటెస్ట్ లుక్, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నిహారిక రాఖీ కడుతున్న వీడియోలు ఒక్కసారిగా నెట్టింట్లో ట్రెండ్ అయ్యాయి. రామ్ చరణ్ హ్యాండ్సమ్ లుక్‌కు అంతా ఫిదా అయ్యారు. రామ్ చరణ్ లుక్ చూస్తుంటే గేమ్ చేంజర్ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సీన్లను షూట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

గేమ్ చేంజర్ మూవీ విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అప్డేట్లు ఇవ్వమని దిల్ రాజుని అడిగితే.. అంతా శంకర్ చేతుల్లోనే ఉందని అంటున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ వరకైనా సినిమా వస్తుందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. ఇండియన్ 2 సినిమాను పూర్తి చేశాకే.. గేమ్ చేంజర్‌ను వదలాలి అని శంకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.