Urfi Javed: ఉర్ఫీ జావేద్‌ కు హత్య బెదిరింపులు..

ఉర్ఫీ జావేద్‌ (Urfi Javed)ని చంపేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. నిందితుడిపై ముంబై పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. బాలీవుడ్ నటి, ఓటీటీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్ (Urfi Javed) గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో కొన్ని టివి షోలతో ఉర్ఫీ గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె వేసుకునే వెరైటీ బోల్డ్ డ్రెస్ లతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ […]

Share:

ఉర్ఫీ జావేద్‌ (Urfi Javed)ని చంపేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. నిందితుడిపై ముంబై పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.

బాలీవుడ్ నటి, ఓటీటీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్ (Urfi Javed) గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో కొన్ని టివి షోలతో ఉర్ఫీ గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె వేసుకునే వెరైటీ బోల్డ్ డ్రెస్ లతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఇటీవల ఉర్ఫీకి సోషల్ మీడియాలో బెదిరింపులు(Threats) ఎక్కువయ్యాయి. ఉర్ఫీ జావేద్‌ (Urfi Javed)ని చంపేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. నిందితుడిపై ముంబై పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. నిజానికి ఉర్ఫీ హాలోవీన్ పార్టీ కోసం ఒక వీడియోను షేర్ చేసింది. ఆమె లుక్‌పై కోపంతో ఉన్న వ్యక్తి దానిని తొలగించాలని ఉర్ఫీకి మెయిల్ చేశాడు. అలా చేయకుంటే చంపేస్తామని బెదిరించాడు. ఉర్ఫీ తన సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్‌ను పంచుకోవడం ద్వారా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు విషయం పోలీసుల వరకు చేరింది.

Read More: Koozhangal: ఆస్కార్ ఎంట్రీ ఇచ్చిన త‌మిళ చిత్రం.. ఓటీటీలోకి

‘చంపడానికి సమయం పట్టదు’

ఉర్ఫీ జావేద్‌కి ట్రోలింగ్(Trolling) లేదా బెదిరింపులు(Threats) రావడం కొత్త విషయం కాదు. ఈసారి ఆమె లుక్ చూసి కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఉర్ఫీ షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో నిఖిల్ గోస్వామి(Nikhil Goswami) పేరు కనిపిస్తుంది. మీరు అప్‌లోడ్ చేసిన వీడియోను తొలగించండి. లేకపోతే మిమ్మల్ని చంపడానికి సమయం పట్టదు అని రాసి ఉంది. సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఉర్ఫీ ఇటీవలి వీడియో భూల్-భులయ్యా(Bhool-Bhoolaiya) చిత్రంలోని ఛోటా పండిట్(Chhota Pandit) పాత్ర. ఇందులో రాజ్‌పాల్ యాదవ్‌(Rajpal Yadav)గా కనిపించింది. ఉర్ఫీ తన ముఖానికి ఎరుపు రంగు వేసుకుంది. కుంకుమపువ్వు ధోతీ స్టైల్ ప్యాంట్‌తో హై నెక్ టాప్.. మెడలో బంతిపూల దండ, చెవుల్లో అగరబత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ లుక్‌కి సంబంధించి నటికి మెయిల్‌లో హత్య బెదిరింపులు వచ్చాయి. ఇది మాత్రమే కాదు.. నటి మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని కూడా అందులో ఆరోపించారు. రెండు రోజుల క్రితం.. ఉర్ఫీ జావేద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకున్నారు. దీనిలో ఆమె భూల్ భూలయ్యా ఛోటా పండిట్‌లో కనిపించింది. ఛోటా పండిట్ లుక్‌ని కాపీ కొట్టినందుకు నటికి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని నటి స్వయంగా వెల్లడించింది.

ఉర్ఫీ జావేద్‌(Urfi Javed) కు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమెకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో దర్శకుడు నీరజ్ పాండే(Neeraj Pandey) కార్యాలయం నుంచి ఆమెకు హత్య బెదిరింపు వచ్చింది. ఆ సమయంలో నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రీన్‌షాట్‌(Screenshot)ను పంచుకుంది. దర్శకుడు నీరజ్ పాండే అసిస్టెంట్ తనను వేధించాడని చెప్పింది.

బిగ్ బాస్ ఓటీటీ (OTT) షో తర్వాత ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి బాగా పేరు సంపాదించింది. ఏఎల్టి బాలాజీలో ప్రసారమైన ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా, ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా కనిపించింది. 2016 నుండి 2017 వరకు, ఉర్ఫీ స్టార్ ప్లస్ ‘చంద్ర నందిని’లో ఛాయా పాత్రను పోషించింది. 2018లో సాబ్ టీవీ (SAB TV) ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి పాత్రను పోషించింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా చేసింది. ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది.