జూ.ఎన్టీఆర్ భార్య ప్రణతి పెళ్లి చీర విలువ కోటి రూపాయలు 

అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి పెళ్లిలో కోటి రూపాయల చీర గురించి ప్రస్తావన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2011లో జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి అంగరంగ వైభవంగా ఎంతో కన్నుల పండుగగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ జంటకు అభయ్ రామ్ భార్గవ్ రామ్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మరి ఇప్పుడు పెళ్లి వేడుకలో నార్నే […]

Share:

అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి పెళ్లిలో కోటి రూపాయల చీర గురించి ప్రస్తావన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2011లో జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి అంగరంగ వైభవంగా ఎంతో కన్నుల పండుగగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ జంటకు అభయ్ రామ్ భార్గవ్ రామ్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మరి ఇప్పుడు పెళ్లి వేడుకలో నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతి పెళ్లికూతురుగా కట్టుకున్న చీర గురించి సోషల్ మీడియాలో పలు అంశాలు బయటికి వచ్చాయి.

కోటి రూపాయల పెళ్లి చీర: 

అయితే పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కట్టుకున్న చీర ఖరీదు గురించి తెలుసుకొని నేటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు ఆమె ధరించిన చీర విలువ కోటి రూపాయలు. అంతేకాకుండా ఆ చీర బంగారు వర్ణం రంగులో ఉన్న బంగారు చీర దాదాపు కోటి రూపాయలు ఉండడం, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. సుమారు 100 కోట్లు ఖర్చు చేసి జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి వివాహం జరిగినట్లు తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం చీర గురించి, ఆమె కట్టుకున్న చీర విలువ గురించి ప్రస్తావన జరుగుతోంది. 

ఇంకా ప్రణతి కట్టుకున్న పెళ్లి చీర ధర గురించి తెలుసుకున్న తర్వాత ఆ చీర విశేషాలు తెలుసుకోకుండా ఉండగలమా మరి అవేంటో తెలుసుకుందాం. బంగారు వర్ణంలో ఉన్న చీర నిజానికి చాలా అందంగా తెలుగుదనం ఉట్టిపడేలా మనకి కనిపిస్తుంది. ముఖ్య లక్ష్మీ ప్రణతి చీర కంజీవరంలో స్వచ్ఛమైన బంగారు వెండి తీగలతో నేసినట్లు సమాచారం అందింది. ముఖ్యంగా కేవలం పెళ్లి గురించి చీర నేయించినట్లు సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె పెళ్లిలో కనిపించిన తీరు నిజంగా అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసిందని చెప్పాలి. బంగారు వర్ణంలో ఉన్న చీర, అదేవిధంగా ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్, బంగారు గాజులు నిజానికి తెలుగు అమ్మాయి పెళ్లికూతురుగా ఇలా రెడీ అవ్వాలి అనేటట్లు ఉంది. మరి పక్కన జూనియర్ ఎన్టీఆర్ కూడా తనదైన శైలిలో పట్టు వస్త్రాలు ధరించి ఒక చక్కని జంటగా కనువిందు చేస్తారు.

అయితే నిజానికి తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి విశేషాలు కొన్ని సంవత్సరాల వరకు చెప్పుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి మండపంలో సుమారు 3000 మంది అతిథులకు, దాదాపు 12 వేల మంది స్పెషల్ గా రెడీ చేయించిన మండపం, సుమారు 18 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెళ్లి గురించి సుమారు 100 కోట్లు ఖర్చు చేసినట్లు, అప్పట్లో కన్నుల పండుగగా వారి వివాహం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రణతి జంటకు 2014లో అభయ్ రామ్ పుట్టగా, 2019లో ఆ అబ్బాయి భార్గవ్ జన్మించాడు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమా విశేషాలు: 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం దేవర రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం టాలీవుడ్ లో ఎప్పుడు రాబోతోందా అని ఆత్రుతగా అభిమానుల్లో ఎదురుచేయిస్తుంది. అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహించింది కొరటాల శివ అయితే, ఇందులో మొట్టమొదటిసారిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ నటిస్తోంది.