‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’ సీక్వెల్ కి రెడీ అంటూ ట్వీట్ చేసిన త్రిష

విక్టరీ వెంకటేష్, అందాల తార త్రిష జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’. తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2007లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అందుకుంది. చక్కటి కామెడీ, ఆద్యంతం ట్విస్టులతో కూడిన లవ్, అడుగడుగునా ఎమోషన్స్, ఫ్యామిలీ అంశాలు కలగలిపి ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇందులోని […]

Share:

విక్టరీ వెంకటేష్, అందాల తార త్రిష జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’. తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2007లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అందుకుంది. చక్కటి కామెడీ, ఆద్యంతం ట్విస్టులతో కూడిన లవ్, అడుగడుగునా ఎమోషన్స్, ఫ్యామిలీ అంశాలు కలగలిపి ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇందులోని పాటలు చార్ట్ బస్టర్లుగా మిగిలాయి. ఇప్పటికీ పలువురు ప్రేక్షకులను ఆ పాటలను గుర్తు చేసుకుంటూనే ఉంటారు.  ఇక గత కొంత కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తున్నది. హిట్ అందుకు చిత్రాలకు సీక్వెల్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇదే ట్రెండ్ ‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’ విషయంలోనూ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.  2013లో దర్శకుడు సెల్వ రాఘవన్ చేసిన ట్వీట్ ను తాజాగా త్రిష రీ ట్వీట్ చేయడం ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది.  ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని ఉందంటూ త్రిష తన మనసులో మాటను బయటపెట్టింది. దీంతో డైరెక్టర్ సెల్వ రాఘవన్, త్రిష ఇద్దరికీ ఆ సినిమా సీక్వెల్ పై ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది. మరి మన వెంకీ మామ ఈ సీక్వెల్ పై ఏమంటాడో చూడాలి.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే గురించి

వెంకటేష్, త్రిష మరియు ఇతర తారాగణంతో “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” విజయవంతమైన చిత్రం. ఇది తమిళం, బెంగాలీ, భోజ్‌పురి, కన్నడ మరియు ఒడియా వంటి వివిధ భాషలలో రీమేక్ చేయబడింది. “యారడి నీ మోహిని” అనే తమిళ వెర్షన్‌లో ధనుష్ మరియు నయనతార నటించారు. దర్శకుడు సెల్వరాఘవన్ 2022లో ధనుష్ ప్రధాన పాత్రలో “నానే వరువేన్” అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. మరియు కొన్ని సినిమాల్లో కూడా నటించి తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు.

ఇంతకీ సెల్వ రాఘవన్ చేసిన ట్వీట్ ఏంటంటే?

సుమారు 10 సంవత్సరాల క్రితం ‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’ దర్శకుడు సెల్వ రాఘవన్ ఓ ట్వీట్ చేశారు.  “‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’ చిత్రాన్ని మరోసారి చూశాను. హీరో వెంకటేష్, హీరోయిన్  త్రిషతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం. ఈ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని ఆ ట్వీట్ లో వెల్లడించారు. ఈ సినిమా విడుదలైన 5 సంవత్సరాలకు దర్శకుడు ట్వీట్ చేస్తే, దానికి 10 ఏండ్ల తర్వాత త్రిష రిప్లై ఇవ్వడం ఆసక్తిక కలిగిస్తోంది. ‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’ సినిమా సీక్వెల్ చేయడానికి దర్శకుడితో పాటు హీరోయిన్ త్రిషకు ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తే చక్కటి విజయాన్ని అందుకుంటుందని సినీ అభిమానులు సైతం భావిస్తున్నారు. దర్శకుడు, హీరోయిన్ ఒకే, మరి హీరో వెంకటేష్ ఏంటంటారో? అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఆయన కూడా ఓకే చెప్తే, ఈ సినిమా సీక్వెల పట్టాల మీదకు ఎక్కే అవకాశం ఉంటుంది.   

‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్ తో అద్భుత గుర్తింపు

త్రిష చివరిగా ‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్ లో నటించింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన సిరీస్‌లోని రెండు చిత్రాలలో త్రిష తన అద్భుత నటనతో ప్రశంసలు అందుకుంది.  ‘పొన్నియిన్ సెల్వన్ 2’ తర్వాత విజయ్‌ దళపతితో కలిసి ‘లియో’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ‘లియో’ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.