త్రిష వర్షం వంటి మంచి మంచి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మరింత అలరించి దగ్గరయింది. తెలుగు, తమిళం, మలయాళం అనే భాష బేధం లేకుండా, అనేక భారతీయ భాష సినిమాలలో త్రిష నటించి అలరించింది. అయితే ఇప్పుడు ప్రత్యేకించి లియో సినిమాతో మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తుంది త్రిష. ఒకప్పుడు తన నటన, అందం, అభినయం ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే చెక్కుచెదరకుండా ఉన్నాయి.
ముఖ్యంగా లియో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ప్రతి ఒక్కరిని తప్పకుండా అలరిస్తుందని త్రిష ఆశాభావం వ్యక్తం చేసింది. సినిమా గురించి ప్రత్యేకించి ఎక్కువగా చెప్పకపోయినప్పటికీ, సినిమాలో విజయ్ పక్కన తన కెమిస్ట్రీ ఎప్పటిలాగే బాగుంటుందని చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో హీరోయిన్లుగా త్రిష, ప్రియ ఆనంద్ నటిస్తున్నారు. ప్రియ ఆనంద్ ముందుగా తెలుగులో లీడర్ సినిమా తో తన సినీ జీవితం ప్రారంభించింది. తర్వాత శర్వానంద్ తో కలిసి కో అంటే కోటి అనే సినిమాలో నటించింది. తెలుగులో కలిసిరాక ప్రియా ఆనంద్ తమిళ్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టింది. తమిళ్ లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది.
ఇక త్రిష విషయానికొస్తే మనకు తెలిసిందే, తను వర్షం సినిమాతో టాలీవుడ్ కుర్ర కారు మనసు దోచుకుంది. తర్వాత అతడు సినిమాతో మహేష్ బాబు తో కూడా నటించింది. త్రిష టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అయింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో త్రిష యాక్టింగ్ కి మంచి క్రేజ్ వచ్చింది. త్రిష నాగార్జునతో కింగ్. రవితేజతో కృష్ణ లాంటి సినిమాలో నటించింది. చిరంజీవితో స్టాలిన్ లో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగు సినిమాలు నటించట్లేదు.
అయినా ఇప్పటికీ తెలుగులో త్రిష కు మంచి క్రేజ్ ఉంది. తను సినిమా చేస్తానంటే నిర్మాతలు రెడీగా ఉన్నారు. తన సినీ కెరీర్లో చిన్నచిన్న వివాదాలు ఉన్నప్పటికీ త్రిష తన కెరీర్ లో ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే తన మొదటి సినిమా సందీప్ కిషన్ తో చేసిన నగరం. తను తర్వాత ఖైదీ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. లోకనాయకుడు కమల్ హాసన్ గారితో తను చేసిన విక్రమ్ బ్లాక్ బస్టర్. లోకివర్స్ అనే అనే సినిమాటిక్ యూనివర్స్ ని లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేశాడు.
తను ఇంతకుముందు తలపతి విజయ్ తో మాస్టర్ అనే సినిమా తీశాడు. అది బ్లాక్ బస్టర్.
‘పొన్నియిన్ సెల్వన్’ నటి, తన అందమైన రూపానికి, ప్రతిభకు ప్రశంసలు అందుకుంది. అయితే మరొకసారి మెగాస్టార్ చిరంజీవి సరసన కీలక పాత్రలో నటించేందుకు ఆమె ఎంపికైంది. త్రిష, చిరంజీవి కలిసి నటించిన చివరి చిత్రం 2006లో వచ్చిన ‘స్టాలిన్’.
జూన్ 22న విజయ్ తన 49వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా లియో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ కి విజయ్ ఫ్యాన్స్ దగ్గర్నుండి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే ఫాన్స్ సర్ప్రైజ్ అయ్యారు. ఈ ఫస్ట్ లుక్ లో విజయ్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. చేతిలో సుత్తితో ఎవర్నో కొడుతున్నట్టు ఉన్న ఈ పోస్టర్ ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ఇందులో హీరోయిన్ త్రిష తో విజయ్ ది హిట్ పెయిర్. గతంలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన గిల్లీ బ్లాక్ బస్టర్ హిట్. వీళ్ళిద్దరు మరోసారి కలిసి నటిస్తుండడంతో లియో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.