Nayagan: కమల్-మణిరత్నం సినిమాలో నయనతార స్థానంలో త్రిష?

కమల్‌ హాసన్‌ – మణిరత్నం(Kamal Haasan – Mani Ratnam) కాంబోలో వచ్చిన  ‘నాయగన్’ (Nayagan) ఓ క్లాసిక్‌. ఆ తరవాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇంత కాలానికి మళ్లీ జట్టు కట్టారు. కమల్‌ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్ గా నయనతార(Nayanthara) స్థానంలో త్రిష(Trisha) పేరు ఖరారు చేసినట్లు సమాచారం. మూడున్నర దశాబ్దాల క్రితం విడుదలైన అద్భుత చిత్రం ‘నాయగన్’(Nayagan) తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదల […]

Share:

కమల్‌ హాసన్‌ – మణిరత్నం(Kamal Haasan – Mani Ratnam) కాంబోలో వచ్చిన  ‘నాయగన్’ (Nayagan) ఓ క్లాసిక్‌. ఆ తరవాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇంత కాలానికి మళ్లీ జట్టు కట్టారు. కమల్‌ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్ గా నయనతార(Nayanthara) స్థానంలో త్రిష(Trisha) పేరు ఖరారు చేసినట్లు సమాచారం.

మూడున్నర దశాబ్దాల క్రితం విడుదలైన అద్భుత చిత్రం ‘నాయగన్’(Nayagan) తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదల అయ్యింది. ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా నటించగా, దిగ్గజ దర్శకుడు మణిరత్నం(Maniratnam) తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. భారీగా వసూళ్ల వర్షం కురిపించింది. వీరిద్దరి కాంబోలో మళ్లీ ఇన్నేళ్లకు ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘కేఎచ్ 234’ తాత్కాలిక పేరుతో ఈ సినిమా ప్రీప్రొడక్షన్(Preproduction) పనులు జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చేయబోతున్నట్లు కమల్ వెల్లడించారు. కచ్చితంగా ‘నాయగన్’ లాంటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు.  

అటు వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో  హీరోయిన్ గా నయనతార(Nayanthara) స్థానంలో త్రిష(Trisha) నటిస్తుందని సమాచారం. ఇప్పటికే త్రిష కమల్ హాసన్ తో రెండు సినిమాలు చేసింది. అందులో ఒకటి ‘మన్మధన్ అంబు'(Manmadhan Ambu)  మరొకటి ‘తూంగవనం’ (Tungavanam). ఈ చిత్రంలోనూ ఎంపిక అయితే ముచ్చటగా మూడో చిత్రం అవుతుంది.

దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salmaan) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. జయం రవి(Jayam Ravi)కి కూడా ఓ పాత్ర దక్కింది. తెలుగు నుంచి ఒకరిద్దరు స్టార్‌ హీరోలు కమల్‌ చిత్రంలో అతిథులుగా మెరిసే ఛాన్స్‌ ఉంది. రజనీకాంత్‌(Rajinikanth) సైతం ఓ మెరుపులాంటి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ‘విక్రమ్‌’తో కమల్‌ ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేశారు. ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’తో బిజీగా ఉన్నారు. కమల్‌ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాకే మణి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ పారితోషికం విషయంలోనూ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారట. హీరోయిన్ త్రిష అయినా, నయనతార అయినా రూ. 12 కోట్లు ఇవ్వాలని అనుకున్నారట. నిజానికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ(South Film Industry)లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతార చలామణి అవుతోంది. ‘జవాన్’(Jawan) సహా పలు సినిమాలకు ఆమె రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంది. అయితే, ఇప్పుడు కమల్ హాసన్(Kamal Haasan) సినిమాలో హీరోయిన్ కు రూ. 12 కోట్లు ఇవ్వబోతున్నారు. 

నిజానికి ప్రస్తుతం న‌య‌న‌తార‌ తర్వాత అదే స్థాయిలో గుర్తింపు ఉన్న నటి త్రిష. అందం, అభినయంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘జవాన్’ తర్వాత నయతార రేంజి మరింత పెరిగింది. అయితే, త్రిషకు నార్త్ లో పెద్దగా గుర్తింపు లేదు. కొన్ని హిందీ సినిమాలు చేసినా మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. ఒకవేళ ఈ సినిమాలో తను నటిస్తే సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా రికార్డు సాధించే అవకాశం ఉంది. 

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పొన్నియ‌న్ సెల్వ‌న్ -1(Ponniyin Selvan-1) సినిమాలో చోళ యువ‌రాణి కుందైవి(Kundavi)గా క‌నిపించింది త్రిష‌. ఇందులో రాచ‌రిక‌పు ఎత్తులు తెలిసిన యువ‌రాణిగా న‌ట‌న‌తో పాటు అందంతో ఆక‌ట్టుకున్న‌ది. పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాకు ప్ర‌స్తుతం సీక్వెల్ రూపొందుతోంది. ఈ సీక్వెల్‌లో త్రిష క్యారెక్ట‌ర్‌కు మ‌రింత ఇంపార్టెన్స్ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పొన్నియ‌న్ సెల్వ‌న్ సీక్వెల్ పూర్త‌యిన వెంట‌నే క‌మ‌ల్‌హాస‌న్‌, మ‌ణిర‌త్నం సినిమా సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తోన్న 234వ సినిమా ఇది 2024లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మ‌ద్రాస్ టాకీస్‌, రెడ్ జైంట్స్ సంస్థ‌లు నిర్మిస్తోన్న ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాణ భాగ్య‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు.