ట్రెవర్ నోహ్ బెంగళూరు కామెడీ షో క్యాన్సల్

ప్రముఖ కమెడియన్ ట్రెవర్ నోహ్ కు సంబంధించిన బెంగళూరు స్టాండ్ అప్ కామెడీ షో క్యాన్సిల్ అయిన క్రమంలో కమెడియన్ కాస్త నిరాశలో ఉన్నట్లు కనిపించింది. అంతేకాకుండా ఇండియాకి సందర్శించినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని, ముఖ్యంగా బెంగుళూరులో జరగవలసిన కార్యక్రమం క్యాన్సిల్ అవ్వడానికి గల కారణాలు చాలా ఉన్నాయని, మరి ముఖ్యంగా ఇక్కడితో అయిపోలేదని, తను తప్పకుండా తిరిగి వస్తానని, మరొక షో నిర్వహిస్తానని చెప్పుకొచ్చాడు కమెడియన్.  కామెడీ షో క్యాన్సల్:  అమెరికా కమెడియన్ ట్రెవర్ […]

Share:

ప్రముఖ కమెడియన్ ట్రెవర్ నోహ్ కు సంబంధించిన బెంగళూరు స్టాండ్ అప్ కామెడీ షో క్యాన్సిల్ అయిన క్రమంలో కమెడియన్ కాస్త నిరాశలో ఉన్నట్లు కనిపించింది. అంతేకాకుండా ఇండియాకి సందర్శించినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని, ముఖ్యంగా బెంగుళూరులో జరగవలసిన కార్యక్రమం క్యాన్సిల్ అవ్వడానికి గల కారణాలు చాలా ఉన్నాయని, మరి ముఖ్యంగా ఇక్కడితో అయిపోలేదని, తను తప్పకుండా తిరిగి వస్తానని, మరొక షో నిర్వహిస్తానని చెప్పుకొచ్చాడు కమెడియన్. 

కామెడీ షో క్యాన్సల్: 

అమెరికా కమెడియన్ ట్రెవర్ నోహ్ తన భారతదేశం టూర్‌ను పూర్తి చేసుకున్న తర్వాత, బుధవారం తన దేశ పర్యటనను గురించి విశేషాలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు. తన వీడ్కోలుకు సంబంధించిన పోస్ట్‌లో, అనుకోకుండా క్యాన్సిల్ అయిన బెంగుళూరు షో గురించి మాట్లాడిన తర్వాత, అతను బెంగళూరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు, అక్కడ తన స్టాండప్ షో చివరి నిమిషంలో రద్దు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది..

ట్రెవర్స్ ఇండియా ట్రిప్: 

ట్రెవర్ నోహ్ ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించిన చాలా ఫోటో షేర్ చేసుకున్నాడు. అతను ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీలో తీసిన ఫొటోస్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. బిజీ, ఇరుకైన వీధుల్లో మెలికలు తిరిగిన విద్యుత్ తీగలు తన ఫోటోలలో క్లియర్గా కనిపించడం జరిగింది. బెంగళూరులోని శాసనసభ ఫోటోను కూడా ఆయన షేర్ చేసుకున్నాడు. 

బెంగుళూరుకు తిరిగి వస్తానని చెప్పిన ట్రెవర్: 

ఫోటోలను షేర్ చేసుకుంటూ, అతను తన క్యాప్షన్‌లో ఇలా వ్రాశాడు, మీలాంటి గొప్ప దేశంలో షో చేయడం నిజంగా ఒక ప్రత్యేకమైన అంశం అని.. మీ గొప్ప చరిత్రను, మీ రుచికరమైన వంటకాలను మరియు మీ అద్భుతమైన వాదనలకు థాంక్స్ చెప్పుకున్నాడు నటుడు. ఢిల్లీలో ముంబైలో జరిగిన ట్రిప్ నిజంగా ఒక మంచి అనుభవం అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ట్రెవర్ బెంగుళూరు కోసం ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా షేర్ చేశాడు, “బెంగుళూరు”, మన కథ పూర్తి కాలేదని, మళ్లీ తాను తిరిగి వస్తానని.. కచ్చితంగా బెంగళూరులో షో చేస్తానని చెప్పుకొచ్చాడు.

ట్రెవర్ ఫోటోలకు కామెంట్ల వర్షం: 

అమెరికా నుంచి వచ్చిన కమెడియన్ ఇండియాలో జరిగిన తన అనుభవాన్ని గురించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అనంతరం.. చాలామంది భారతీయులు స్పందించడం జరిగింది. ఎంతోమంది ఎన్నో కామెంట్ల రూపంలో తమదైన శైలిలో స్పందించారు. మీరు తీసిన ఫోటోలలో ఎడ్ల బండ్లు, కరెంట్ వైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయని, తమ దేశంలో ఇలాంటివి ఎన్నో చూడొచ్చని రాసుకొచ్చాడు ఒక వినియోగదారుడు. అంతేకాకుండా మరొకరు కామెంట్ చేస్తూ, ముంబాయిలో తను రెండు సంవత్సరాలు నివసించానని, ముంబై నిజంగా అద్భుతమైన ప్రదేశమని, ముంబైనీ లాస్ ఏంజెల్స్ తో పోల్చాడు. 

ట్రెవర్ నోహ్ గత నెలలో బెంగుళూరులో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా తన షోను రద్దు చేయడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే అతను ఇండియా ట్రిప్ అనంతరం చేసిన ప్రత్యేకమైన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అంతేకాకుండా, సవ్యంగా జరగాల్సిన బెంగుళూరు షో క్యాన్సిల్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని ప్రస్తావించాడు హాస్యనటుడు. నిజానికి షో జరగాల్సిన ప్రదేశంలోనే తనకి చాలా కుక్కలు కనిపించాయని.. ముఖ్యంగా చాలా కుక్కలను బోనులో బంధించి ఉండడం తాను చూశాడని, నిజంగా తన షో చేసే ప్రదేశంలో ఇలా కుక్కల్ని బంధించి ఉంచుతారని తన ఎప్పుడు ఊహించలేదని.. ఇలాంటి చోట తను షో చేయాలని ఎప్పుడు ఆశపడలేదని కూడా తన పోస్ట్ ద్వారా రాసుకోచ్చాడు కమెడియన్ ట్రెవర్ నోహ్.