పవన్‌ కల్యాణ్‌ది ఒదిగి ఉండే మనస్తత్వం

పవన్‌ కల్యాణ్  హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘హరిహర వీరమల్లు’.  హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు 17వ శ‌తాబ్దానికి చెందిన సినిమా. పవన్‌ కల్యాణ్‌ గెట‌ప్ కూడా డిఫ‌రెంట్‌గా ఉంది.  ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొఘ‌లు ప్ర‌భుత్వాన్ని ఎదిరించే పోరాట యోధుడు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాలో రాబిన్ హుడ్ త‌రహా పాత్ర‌ను పోషిస్తున్నారు.  అలాగే మొఘ‌ల్ చ‌క్ర‌వర్తి పాత్ర‌లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ న‌టించ‌బోతున్నారు. ఈ సినిమాలో మొఘ‌ల్ యువ‌రాణి పాత్ర‌లో న‌ర్గీస్ […]

Share:

పవన్‌ కల్యాణ్  హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘హరిహర వీరమల్లు’.  హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు 17వ శ‌తాబ్దానికి చెందిన సినిమా. పవన్‌ కల్యాణ్‌ గెట‌ప్ కూడా డిఫ‌రెంట్‌గా ఉంది.  ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొఘ‌లు ప్ర‌భుత్వాన్ని ఎదిరించే పోరాట యోధుడు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాలో రాబిన్ హుడ్ త‌రహా పాత్ర‌ను పోషిస్తున్నారు.  అలాగే మొఘ‌ల్ చ‌క్ర‌వర్తి పాత్ర‌లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ న‌టించ‌బోతున్నారు. ఈ సినిమాలో మొఘ‌ల్ యువ‌రాణి పాత్ర‌లో న‌ర్గీస్ ఫ‌క్రీ. పంచ‌మి అనే మ‌రో పాత్ర‌లో నిధి అగ‌ర్వాల్ అల‌రించ‌నుంది.

మార్ష‌ల్ ఆర్ట్స్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన జానీ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ మార్ష‌ల్ ఆర్ట్స్‌ను త‌న సినిమాల్లో ఎక్క‌డా ట‌చ్ చేయ‌లేదు. రెండు ద‌శాబ్దాల త‌ర్వాత మ‌ళ్లీ క‌త్తి చేత బ‌ట్టి సీరియ‌స్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ ఫొటోను షేర్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు ద‌శాబ్దాలు త‌ర్వాత మ‌ళ్లీ మార్ష‌ల్ ఆర్ట్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నాన‌ని అన్నారు. ఆయ‌న ఫొటోను షేర్ చేసిన క్ష‌ణాల్లోనే అది తెగ వైర‌ల్ అయ్యింది. గ‌తంలో మార్ష‌ల్ ఆర్ట్స్ గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన మాట‌ల‌ను ఆయ‌న అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. హ‌రి హ‌ర వీర మల్లు సినిమా ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు.

తాజాగా ప్రముఖ మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షకుడు హార్ష్ వర్మ పవన్‌పై ప్రశంసలు కురిపించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కల్యాణ్  నటిస్తోన్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాలో పవన్‌ యుద్ధ విద్యల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. ‘షావోలిన్ వారియర్‌ మంక్ అకాడమీ’లో పవన్‌ శిక్షణ తీసుకున్నారు. అయితే, ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్‌ హర్ష్‌ వర్మ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఈ విషయంపై తాజాగా ఆయన మాట్లాడుతూ పవన్‌ వల్లే తనకు నటనపై ఆసక్తి కలిగిందన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

‘పవన్‌తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. సెట్‌లో ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆయన దృష్టి చాలా స్పష్టంగా ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. ఏదైనా సన్నివేశాన్ని అప్పటికప్పుడు మార్చినా ఆయన వెంటనే అర్థం చేసుకుంటారు. ఆయనకు శిక్షణ ఇచ్చే సమయంలో నాకు కూడా నటనపై ఆసక్తి ఉందని వెల్లడించాను. వెంటనే లుక్ టెస్ట్‌ చేశారు. అంతా ఓకే అయింది. నాకు నటించాలనే కోరిక పుట్టడానికి పవన్‌ కూడా ఓ కారణం. ‘హరిహర వీరమల్లు’ క్లైమాక్స్‌ సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుతం దీనితో పాటు మరికొన్ని బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటిస్తున్నాను ’ అని చెప్పారు.

నిర్మాత ఏఎమ్‌ రత్నం ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘హరిహర వీరమల్లు’ సినిమాను కచ్చితంగా ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది ఎన్నికల కంటే ముందే చిత్రాన్ని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎన్నో రోజులుగా ఈ సినిమా రిలీజ్ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తోన్న అభిమానుల్లో ఉత్సాహం నింపినట్లైంది.

హరి హర వీర మల్లు సినిమా పూర్తి కాగానే …పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలు చేయటానికి రెడీ అవుతున్నారు. అందులో ఓ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇది పక్కా గ్యాంగ్‌స్టర్ బేస్డ్ మూవీ అని సమాచారం. డి.వి.వి.దానయ్య నిర్మాత. మరో చిత్రానికి హరీష్ శంకర్  డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా ప్రకటన త్వరలోనే రానుంది.