టాప్ 10 సౌతిండియ‌న్ క్రైం థ్రిల్ల‌ర్లు ఇవే…

థ్రిల్లర్ అయినా కానీ క్రైం థ్రిల్ల‌ర్లు అయినా కానీ వస్తుందంటే ఉండే అదే వేరు. అది ఏ భాషలో ఉన్నా కానీ మనకు సరిగ్గా భాష అర్థం కాకపోయినా కానీ ఆ మూవీని చూసేందుకు మనం మొగ్గు చూపుతాం. అందుకోసమే థ్రిల్లర్స్ ఏ భాషలో వచ్చినా హిట్ అవుతుంటాయి. అటువంటి థ్రిల్లర్స్ సౌతిండియన్ సినిమాలో అనేకం ఉన్నాయి. చాలా మంది దర్శక నిర్మాతలు థ్రిల్లర్స్ తీసేందుకు ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. థ్రిల్లర్ స్టోరీ ప్రేక్షకులకు ఒక్క సారి […]

Share:

థ్రిల్లర్ అయినా కానీ క్రైం థ్రిల్ల‌ర్లు అయినా కానీ వస్తుందంటే ఉండే అదే వేరు. అది ఏ భాషలో ఉన్నా కానీ మనకు సరిగ్గా భాష అర్థం కాకపోయినా కానీ ఆ మూవీని చూసేందుకు మనం మొగ్గు చూపుతాం. అందుకోసమే థ్రిల్లర్స్ ఏ భాషలో వచ్చినా హిట్ అవుతుంటాయి. అటువంటి థ్రిల్లర్స్ సౌతిండియన్ సినిమాలో అనేకం ఉన్నాయి. చాలా మంది దర్శక నిర్మాతలు థ్రిల్లర్స్ తీసేందుకు ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. థ్రిల్లర్ స్టోరీ ప్రేక్షకులకు ఒక్క సారి కనెక్ట్ అయిందంటే అది భారీ హిట్ సాధించడం పక్కా. అందుకోసమే థ్రిల్లర్ కథకలకు మన హీరోలు కూడా ఓటేస్తుంటారు. అన్ని రకాల ఇండస్ట్రీల్లో థ్రిల్లర్ కథలకు కొదువ ఉండదు. కానీ వచ్చిన అన్ని థ్రిల్లర్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయవు. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టుగా ఉంటాయి. అటువంటి మూవీస్ పెద్ద హిట్ అవుతాయి. సౌత్ లో అటువంటి థ్రిల్లర్స్ ఏంటో ఓ సారి లుక్కేస్తే.. ఇక్కడ క్రైమ్ థ్రిల్లర్స్ జాబితా ఉంది. 

1. ఖైదీ (తమిళం)


ఈ మూవీ కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో ‘ఖైదీ’గా రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. డ్రగ్ బస్ట్ ఆపరేషన్‌ కు సంబంధించిన కథ ఈ మూవీలో ఉంటుంది. ఇది ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇక ఇందులో వచ్చే యాక్షన్ సీన్స్ ఓ లెవెల్లో ఉంటాయి. ఇది యాక్షన్-ప్యాక్డ్ రైడ్‌ కు దారి తీస్తుంది. కనికరం లేని యాక్షన్ సీక్వెన్స్‌ లకు కైతీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

2. జిగర్తాండ (తమిళం)


ఇది కూడా తమిళ మూవీయే కావడం విశేషం. ఈ తమిళ గ్యాంగ్‌స్టర్ చిత్రం తీవ్రమైన హింస మరియు నైతిక సందిగ్ధతలతో కూడిన అండర్ వరల్డ్ యొక్క క్రూరమైన ప్రపంచంలోకి మిమ్మల్ని లోతుగా తీసుకెళ్తుంది. ఈ మూవీ కూడా పెద్ద హిట్ సాధించింది. ఈ మూవీని తెలుగులో వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ గా రిమేక్ చేశారు. కానీ ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కు అంత పెద్దగా నచ్చలేదు. కానీ తమిళ జిగర్తాండ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 3. లూసిఫర్ (మలయాళం)


ఈ మలయాళ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ లో అధికార పోరాటాలు, నేరాలు మరియు హింసాత్మక ఘటనలను అనేకం చూపించారు. ఈ మూవీ సేమ్ నేమ్ తో తెలుగులో డబ్ అయింది. అంతే కాకుండా మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో ఈ మూవీని రిమేక్ చేశాడు. ఈ రిమేక్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అటు లూసిఫర్ లో మోహన్ లాల్ యాక్టింగ్ చూసిన జనం తెలుగులో చిరంజీవి యాక్షన్ తో కూడా సాటిస్ఫై అయ్యారు. 

4. కమ్మట్టిపదం (మలయాళం)


ఇది కూడా మలయాళ మూవీనే కావడం గమనార్హం. ఈ చిత్రం కొచ్చి నేర ప్రపంచంలోని చీకటి అండర్‌ బెల్లీని అన్వేషిస్తుంది. ఇందులో క్రూరమైన నేరం మరియు హింస ఉంటుంది. కమ్మట్టిపాడు అనేది గ్యాంగ్‌ స్టర్ల జీవితం మరియు వారు ఎదుర్కొనే కఠినమైన వాస్తవాల గురించి మీకు వివరిస్తుంది. 

5. లూసియా (కన్నడ)


అన్నీ తమిళ మలయాళ థ్రిల్లర్ సినిమాలే వస్తున్నాయని అనుకునే వారికి లూసియా మూవీ (కన్నడ) నుంచి వచ్చి బక కిక్ ఇచ్చింది. నిద్రలేమితో కష్టపడుతున్న చిత్రనిర్మాత కథలను అల్లుకున్న సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. లూసియా అనేది మీ మనస్సును కదిలించే అనుభవం.

6. విక్రమ్ వేద (తమిళం)


ఇది కూడా తమిళ చిత్రమే. మాధవన్ విజయ్ సేతుపతి నటించిన ఈ హిట్ మూవీని తెలుగులో రిమేక్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ తమిళ చిత్రం ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్ మరియు నిజాయతీ గల పోలీసు అధికారికి మధ్య జరుగుతుంది. విక్రమ్ వేద మూవీ తమిళంలో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీని టాలీవుడ్ లో కూడా ఇద్దరు బడా హీరోలతో రిమేక్ చేసేందుకు ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు టాక్. 

కేవలం ఇవి మాత్రమే అని కాకుండా అనేక యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రేక్షకులకు తొందరగా కనెక్ట్ కావడానికి నేటి తరం దర్శకులు ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్ మూవీలను ఎంచుకుంటున్నారు.