ఫ్లాపైనా రెమ్యున‌రేషన్ త‌గ్గించుకోని టాలీవుడ్ హీరోలు

టాలీవుడ్ ఒక అందమైన పరిశ్రమ. రకరకాల మనుషులతో, కొత్త కొత్త కథలతో కూడిన ఒక అందమైన మాయా లోకం.  అందులో మసులుకోవాలంటే ప్రతిభతో పాటు అందం, అభినయం మన సొంతం కావాలి.  ఆ పరిశ్రమలో పేరు ప్రతిష్ఠలు సాధించాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు. ఎంతో కృషి, పట్టుదలతో సాధించాలి. అలాగే ప్రస్తుతం మనం కొంత మందిని చూస్థూనే ఉన్నాం.  చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ […]

Share:

టాలీవుడ్ ఒక అందమైన పరిశ్రమ. రకరకాల మనుషులతో, కొత్త కొత్త కథలతో కూడిన ఒక అందమైన మాయా లోకం.  అందులో మసులుకోవాలంటే ప్రతిభతో పాటు అందం, అభినయం మన సొంతం కావాలి.  ఆ పరిశ్రమలో పేరు ప్రతిష్ఠలు సాధించాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు. ఎంతో కృషి, పట్టుదలతో సాధించాలి. అలాగే ప్రస్తుతం మనం కొంత మందిని చూస్థూనే ఉన్నాం. 

చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రవితేజ వంటి టాలీవుడ్ సూపర్ స్టార్లు గత కొన్నేళ్లుగా హిట్ సినిమా అందుకున్న  తర్వాత వారి రెమ్యునేషన్ లను పెంచారు. అయితే వారి సినిమా ఫ్లాప్ అయితే మాత్రం రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి ఇష్టపడరు అని సినీ నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు.

సినీ పరిశ్రమ ఒక వ్యాపారం లాంటిదే. అందులో ఆర్టిస్ట్లు జీతాలకే పనిచేస్తారు. అక్కడ వ్యాపారస్తుడు నిర్మాత. మిగతా వాళ్లంతా జీతాలు తీసుకుని పని చేస్తున్నారు. అదే జీతం తీసుకునే వ్యక్తి నటించిన సినిమా హిట్ని అందుకొని, ప్రేక్షకుల హృదయాలను దోచుకంటే మాత్రం ఆ వ్యక్తి జీవితమే మారిపోతుంది. ఇంకా మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ అతన్ని చేరుకుంటాయి.  అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అది వేరే విషయం. అది అలా ఉంటే ఈ కాలం స్టార్స్ మాత్రం ఆలోచనతో మంచి కథలను ఎంచుకుంటున్నారు. దర్శకులు సైతం వాళ్ళను మెప్పించే కథలతోనే వస్తున్నారు. ఒక స్టార్ హీరో ఒక సినిమాలో నటిస్తే అది హిట్ని అందుకున్నా లేదా ఫ్లాప్ ని అందుకున్నా, దానికి పెట్టిన పెట్టుబడి మాత్రం వచ్చేస్తున్నాయ్. ప్రస్తుత కాలంలో నిర్మాతలు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే వారు పెట్టిన పెట్టుబడి లాభాన్ని తేకపాయినా నష్టాన్ని మాత్రం తేవట్లేదు. 

” చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ల రెమ్యునరేషన్  పెంచుకుంటూ పోవడమే తప్ప తగ్గడానికి నిరాకరిస్తున్నారనే చెప్పాలి. ఇంకొంతమంది అయితే వారి సినిమాకి బాక్సాఫీస్ దగ్గర వచ్చిన గ్రాస్ కలెక్షన్ల తో వాళ్ళ డిమాండ్ మరింత పెంచుకుంటున్నారు. నిజానికి, గ్రాస్ కలెక్షన్ కి నెట్ కలెక్షన్ కి చాలా తేడా ఉంది. ఉదాహరకు, ఒక సినిమా రూ.200కోట్లు వసూలు చేస్తే, డిస్ట్రిబ్యూటర్ చేతికి వచ్చే అసలు డబ్బు కేవలం రూ. 90నుండి 95 కోట్లు మాత్రమే. ఈ కలెక్షన్స్ మాత్రమే ఆ సినిమాకి వచ్చే సంపాదన. వాస్తవానికి, నిర్మాతలు ఒక  చిత్రాన్ని హైప్ చెయ్యడానికి మరియు ప్రేక్షకులకు సినిమా మీద ఆసక్తి కలిగేలా ప్రోత్సహించడానికి గ్రాస్ కలెక్షన్స్ ని మాత్రమే ప్రచారం చేస్తారు. ఒక స్టార్ కి సంబంధించిన అభిమానులు ప్రత్యర్థి యొక్క కలెక్షన్స్ ని నకిలీ గానే పేర్కొంటున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొంతమంది స్టార్స్ తమ రెమ్యునేషన్ పెంచుకోవడానికి ఇదే గ్రాస్ కలెక్షన్స్ కోట్ చేయడం చాలా దురదృష్టకరం “అని ఒక అజ్ఞాత నిర్మాత చెప్పారు. 

అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో సినిమాలు తీసిన నిర్మాత లగడపాటి శ్రీధర్ ఈ వాదనను కొట్టిపారేశారు,”పెద్ద స్టార్స్ అందరికీ గ్రాస్ మరియు నెట్ కలెక్షన్ ల మధ్య వ్యత్యాసం తెలుసని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారిలో చాలా మందికి వారి సొంత ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ హౌసెస్ ఉన్నాయి. నిర్మాతలు ఒక ప్రోజెక్ట్ లోకి ప్రవేశించేముందు పని చేయాల్సి ఉంటుంది. నిర్మాత సరైన వ్యాపారవేత్తలా ప్రవర్తించాలి. ఒక ప్రోజెక్ట్ లో పెట్టుబడి పెట్టేముందు అతను తన లాభనష్టాల గురించి ఆలోచించాలి.” అని అతను సూచించారు. 

 పెద్ద స్టార్స్ కు వారి సొంత బ్రాండ్ అలాగే రెడిమేడ్ మార్కెట్ ఉన్నందున వారిని నిందించడం అన్యాయం. వారికి తగ్గటూగానే రేమ్యునిరేషన్ ని కోరుకుంటారు. నిర్మాతలు వారి అవసరం కోసం స్టార్స్ ని సంప్రదించాలిగానీ, వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అలా అనేవారు మీ కథ మీద నమ్మకంతో, ఒకరిని నిందించకుండా, చిన్న నటుడితో ఎందుకు చేయలేకపోతున్నారు.” అని కూడా శ్రీధర్ ప్రశ్నించారు.