టైగర్ నాగేశ్వరరావు సినిమా విశేషాలు

మాస్ మహారాజ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రవితేజ సినిమా. ఆయన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలియని ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. రవితేజ తన కొత్త సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే ఒక ప్రత్యేకమైన రికార్డును సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ వంశీ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా చిత్రం ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తుంది.. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రత్యేకమైన విశేషాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రం ట్రైలర్:  మాస్ […]

Share:

మాస్ మహారాజ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రవితేజ సినిమా. ఆయన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలియని ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. రవితేజ తన కొత్త సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే ఒక ప్రత్యేకమైన రికార్డును సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ వంశీ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా చిత్రం ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తుంది.. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రత్యేకమైన విశేషాలు కనిపిస్తున్నాయి.

పాన్ ఇండియా చిత్రం ట్రైలర్: 

మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వంశీ ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ భారీ స్థాయిలో నిర్మించారు. నిర్మాత ప్రత్యేకించి ఈ సినిమా ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా చేయడానికి ఎటువంటి చాలా కృషి చేసినట్లు కనిపిస్తుంది. ప్రమోషన్స్‌పై విపరీతంగా ఖర్చు చేస్తూ, సినిమాపై మరింత ఆత్రుతను పెంచేందుకు చేస్తున్నట్లు కనిపిస్తుంది.

ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో రవితేజ ఆవిష్కరించారు. మేకర్స్ ప్రత్యేకించి ఈ సినిమా ట్రైలర్ను భారతీయ సైన్ లాంగ్వేజ్ లో విడుదల చేశారు, అందులో ఒక యాంకర్ క్లిప్‌లోని కంటెంట్‌ను వివరిస్తూ కనిపిస్తారు. భారతదేశంలోనే సైన్ భాషలో విడుదలైన తొలి ట్రైలర్ ఇదే. మిగతా ట్రైలర్స్‌తో పాటు సైన్ లాంగ్వేజ్ ట్రైలర్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ ప్రత్యేకమైన ట్రైలర్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అక్టోబర్ 20న భారతీయ సైన్ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. టైగర్ నాగేశ్వరరావు ISL భాషలో విడుదలైన మొదటి భారతీయ చిత్రం. భారతీయ సినిమాలో ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన ఆకర్షించుబడిన మార్పు అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా ప్రమోషన్ కోసం మేకర్స్ అంతా రెడీ అవుతున్నారు. జివి ప్రకాష్ కుమార్, ఈ సినిమాకు ఆహ్లాదకరమైన సంగీతం అందించగా, మేకర్స్ ప్రస్తుతం రెండు పాటలను విడుదల చేశారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో కథానాయికలు. సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత. టైగర్ నాగేశ్వరరావు దసరా సందర్భంగా అక్టోబర్ 19న అన్ని దక్షిణాది భాషలు మరియు హిందీలో విడుదల కానుంది. 

రవితేజ డైలాగ్స్: 

మరి ముఖ్యంగా ఈ సినిమాలో ప్రత్యేకించి రవితేజ తన సొంత గొంతుతో మాట్లాడిన డైలాగ్స్ అందరిని ఆకర్షిస్తాయని ఆయన ఆశిస్తున్నాడు. అంతేకాకుండా నిజంగా డైలాగ్స్ చెప్పేటప్పుడు హిందీలో మాట్లాడడం అంటే చాలా కష్టమని ఆయన భావించినట్లు, ప్రత్యేకించి ఈ సినిమా డబ్బింగ్ చిత్రం కాదని తన తనవైపు నుంచి చిత్రాన్ని థియేటర్స్ లో ప్రతి ఒక్కరు చాలా ఆదరించాలని కోరుకుంటున్నాడు రవితేజ. తప్పకుండా అందర్నీ ఆకర్షించే ఈ ప్రత్యేకమైన సినిమాకు సంబంధించి చిత్ర బృందం చాలా కృషి చేస్తుందని. ఈ చిత్రానికి తను మొదటిసారి సైన్ లాంగ్వేజెస్ కోసం ప్రత్యేకించి సంబంధించి చాలా ఎక్కువ కృషి చేశారని గుర్తు చేశారు. 

ఈ సినిమాలో ప్రత్యేకించి రవితేజ, అనుపం కేర్, నుపుర్ సనం తమ నటనతో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రవితేజ లాంటి లెజెండరీ యాక్టర్ తో పని చేయడం నిజంగా ఆనందంగా అనిపించిందని నుపుర్ సనం భావించారు. అనుపం కేర్ పక్కన ఒక్క సీను కూడా లేకపోయినప్పటికీ, నెక్స్ట్ టైం తప్పకుండా అనుపం కేర్ తో నటించే అవకాశాన్ని దగ్గించుకుంటానన్నారు నుపుర్. ఇంకా డైరెక్టర్ వంశీ విషయానికి వస్తే.. ఆయన సినిమా ఆటోగ్రాఫిక్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే, అయితే ఈ సినిమాలో ఎక్కువగా దుమ్ము ధూళి వంటి మధ్య చేయాల్సిన సీన్స్ కొన్ని ఉన్నప్పటికీ, రవితేజకి డస్ట్ ఎలర్జీ ఉన్నప్పటికీ, చాలా సపోర్ట్ చేసి ప్రతి సీను చాలా చక్కగా వచ్చేలా కృషి చేసారని చెప్పుకొచ్చారు వంశీ.