‘టైగర్‌…‌’ వస్తున్నాడు

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం టైగర్‌‌ నాగేశ్వర   రావు‌. 1970 నాటి కాలంలో స్టువర్ట్‌ పురం దొంగ టైగర్‌‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కృతి సనన్‌ చెల్లెలు నుపుర్‌‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ ఈ చిత్రంలో హిరోయిన్లుగా నటిస్తున్నారు. అనుపమ్‌ ఖేర్‌‌, మురళీ శర్మ, రేణూ దేశాయ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇన్ని రోజులు చిన్న లుక్స్, గ్లింప్స్ వచ్చాయి.. ఇప్పుడు వచ్చిన టీజర్‌‌ […]

Share:

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం టైగర్‌‌ నాగేశ్వర   రావు‌. 1970 నాటి కాలంలో స్టువర్ట్‌ పురం దొంగ టైగర్‌‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కృతి సనన్‌ చెల్లెలు నుపుర్‌‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ ఈ చిత్రంలో హిరోయిన్లుగా నటిస్తున్నారు. అనుపమ్‌ ఖేర్‌‌, మురళీ శర్మ, రేణూ దేశాయ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇన్ని రోజులు చిన్న లుక్స్, గ్లింప్స్ వచ్చాయి.. ఇప్పుడు వచ్చిన టీజర్‌‌ చూశాక ఓరేంజ్‌లో హైప్‌ పెరిగింది. ‘టైగర్ నాగేశ్వరరావు దండయాత్ర మొదలైంది’ అంటూ చిత్ర బృందం టీజర్‌‌ను విడుదల చేసింది. టీజర్‌‌ చూస్తుంటే మునుపెన్నడూ చూడని రవితేజను ఈ సినిమాలో చూడబోతున్నం అన్నట్లు కనిపిస్తోంది. టీజర్‌‌లో కొన్ని విజువల్స్‌ అయితే నెక్ట్స్ లెవల్‌ అనేలా ఉన్నాయి. టైగర్‌‌ నాగేశ్వరరావుపై ఇచ్చిన ఎలివేషన్స్, అలాగే, తన చిన్ననాటి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాడు. కశ్మీర్‌‌ ఫైల్స్, కార్తికేయ2 తర్వాత ఆయన నిర్మిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఇదీ. ఈ చిత్రానికి వంశీ దర్శకుడు. ఇక, టీజర్‌‌ విషయానికి వస్తే..

‘‘హైదరాబాద్‌, బొంబాయి, ఢిల్లీ ఇంకా అనేక నగరాల్లో అతి దారుణగా దోపిడీలు చేసిన స్టువర్ట్పురం దొంగ మద్రాస్‌ సెంట్రల్‌ జైల్‌ నుంచి తప్పించుకున్నాడు…” అంటూ మొదలయ్యే టీజర్‌‌లో టైగర్‌‌ నాగేశ్వరరావుగా రవితేజ సీరియస్‌ లుక్‌  ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఏ సౌత్‌  దొంగ కూడా ఈ జైలు నుంచి తప్పించుకోలేదని పోలీస్‌ చెప్పడం.. ఆ తర్వాత మురళీ శర్మ ఎంట్రీతో.. మనం టైగర్‌‌ జోన్‌లోకి ప్రవేశించాలి అనే పవర్‌‌ డైలాగ్‌ ఉంటుంది. ‘‘నాగేశ్వరరావు పాలిటిక్స్‌ లోకి వెళ్లుంటే వాడి తెలివి తేటలతో ఎలక్షన్ గెలిచేవాడు.. స్పోర్ట్స్ లోకి వెళ్లుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు.. ఆర్మీలోకి వెళ్లుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు.. దురదృష్టవశాత్తు వాడొక క్రిమినల్ అయ్యాడు” అని మురళీ శర్మ చెప్పే డైలాగ్‌ ఈ చిత్రంపై  అంచనాలను మరింత పెంచేసింది. ఎనిమిదేళ్లకే వాడు రక్తం తాగడం మొదలు పెట్టాడనే డైలాగ్‌ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసింది. ఇక, ఇందులో టైగర్‌‌ నాగేశ్వశరావుగా కనిపించిన రవితేజ చేసిన యాక్షన్‌ ఎలిమెంట్స్ స్టన్‌ అయ్యేలా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. బ్రిడ్జిపై వెళ్తున్న ట్రైన్‌కు తాడుతో కొక్కెం వేసి, ట్రైన్‌ మీదకు దూకడం లాంటి ఎపిసోడ్స్  యాక్షన్ ప్రియులను అలరించనున్నాయి. 

1970లలో దక్షిణ భారతదేశంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా స్టూవర్టుపురం నాగేశ్వరరావు కథతో వస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి ఛాయగ్రహణం ఆర్.మది, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ అవినాశ్ కొల్లా, డైలాగ్స్ శ్రీకాంత్ విస్సా, సహా నిర్మాత మయాంక్ సింఘానియా

దసరా బరిలో ‘టైగర్…’

దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20వ తేదీ టైగర్‌‌ నాగేశ్వరరావు సినిమా విడుదల కానుంది. అయితే, టైగర్‌‌ నాగేశ్వరరావు సినిమా వాయిదా పడుతుందని పుకార్లు రాగా, వాటిని చిత్ర బృందం కొట్టేసింది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో కమర్షినల్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘భగవంత్‌ కేసరి’ కూడా అదే టైమ్‌లో రిలీజ్‌ కానుంది. లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో తమిళ స్టార్‌‌ విజయ్‌ నటిస్తున్న ‘లియో’ కూడా అక్టోబర్‌‌ 19న థియేటర్లలో సందడి చేయనుంది.