రికార్డ్ సృష్టించిన రవితేజ కొత్త సినిమా ట్రైలర్

మాస్ మహారాజ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రవితేజ సినిమా. ఆయన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలియని ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. రవితేజ తన కొత్త సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే ఒక ప్రత్యేకమైన రికార్డును సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ వంశీ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా చిత్రం ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తుంది.. ఎందుకో మీరే చూసేయండి.  పాన్ ఇండియా చిత్రం ట్రైలర్:  మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా […]

Share:

మాస్ మహారాజ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రవితేజ సినిమా. ఆయన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలియని ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. రవితేజ తన కొత్త సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే ఒక ప్రత్యేకమైన రికార్డును సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ వంశీ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా చిత్రం ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తుంది.. ఎందుకో మీరే చూసేయండి. 

పాన్ ఇండియా చిత్రం ట్రైలర్: 

మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వంశీ ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ భారీ స్థాయిలో నిర్మించారు. నిర్మాత ప్రత్యేకించి ఈ సినిమా ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా చేయడానికి ఎటువంటి చాలా కృషి చేసినట్లు కనిపిస్తుంది. ప్రమోషన్స్‌పై విపరీతంగా ఖర్చు చేస్తూ, సినిమాపై మరింత ఆత్రుతను పెంచేందుకు చేస్తున్నట్లు కనిపిస్తుంది.

ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో రవితేజ ఆవిష్కరించారు. మేకర్స్ ప్రత్యేకించి ఈ సినిమా ట్రైలర్ను భారతీయ సైన్ లాంగ్వేజ్ లో విడుదల చేశారు, అందులో ఒక యాంకర్ క్లిప్‌లోని కంటెంట్‌ను వివరిస్తూ కనిపిస్తారు. భారతదేశంలోనే సైన్ భాషలో విడుదలైన తొలి ట్రైలర్ ఇదే. మిగతా ట్రైలర్స్‌తో పాటు సైన్ లాంగ్వేజ్ ట్రైలర్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ ప్రత్యేకమైన ట్రైలర్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అక్టోబర్ 20న భారతీయ సైన్ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. టైగర్ నాగేశ్వరరావు ISL భాషలో విడుదలైన మొదటి భారతీయ చిత్రం. భారతీయ సినిమాలో ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన ఆకర్షించుబడిన మార్పు అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా ప్రమోషన్ కోసం మేకర్స్ అంతా రెడీ అవుతున్నారు. జివి ప్రకాష్ కుమార్, ఈ సినిమాకు ఆహ్లాదకరమైన సంగీతం అందించగా, మేకర్స్ ప్రస్తుతం రెండు పాటలను విడుదల చేశారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో కథానాయికలు. సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత. టైగర్ నాగేశ్వరరావు దసరా సందర్భంగా అక్టోబర్ 19న అన్ని దక్షిణాది భాషలు మరియు హిందీలో విడుదల కానుంది. 

రవితేజ సినీ కెరీర్: 

రవితేజ ఫ్రెండ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలు నటించాడు. ఈ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలే. ఇడియట్ అయితే రవితేజ కెరీర్నే మార్చేసింది. రవితేజ కెరీర్ ఇడియట్ కి ముందు ఇడియట్ తర్వాత అన్న విధంగా మారింది. ఆ తర్వాత కూడా రవితేజతో పూరి జగన్నాథ్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అనే సినిమా తీసి మంచి హిట్ ఇచ్చాడు. రవితేజని హీరోగా నిలబెట్టింది పూరి జగన్నాథ్ అంటే అతిశయోక్తి కాదు. రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్ మళ్లీ రావాలని కోరుకుందాం. రవితేజ ఇప్పుడు పెద్ద స్టార్. తనకు లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో తను నటించిన ధమాకా బ్లాక్ బస్టర్. ఆ తర్వాత డిఫరెంట్ గా ట్రై చేసిన రావణాసుర ఫ్లాప్ అయింది. కానీ రావణాసుర సినిమా చాలా బాగుంటుంది. ఇప్పుడు తను నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ రెడీగా ఉంది. ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి రవితేజని మరో పాన్ ఇండియన్ స్టార్ని చేయాలని మనం కోరుకుందాం.