Salman Khan: ఎన్నో ఏళ్ల త‌ర్వాత సండే రిలీజ్ అవ్వ‌నున్న టైగ‌ర్ 3

ఏ సినిమా అయినా శుక్రవారం విడుదల చేస్తారు, లేదా ఒకటి రెండు రోజులు ముందు చేస్తారు ఏదైనా సెలవులు కలిసి వస్తే… కానీ సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన టైగ‌ర్ 3 (Tiger 3)’ మాత్రం విడుదల తేదీ, అలాగే అభిమానుల కోసం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించేలా వున్నాయి. సల్మాన్ ఖాన్ (SalmanKhan), కత్రినా కైఫ్ (KatrinaKaif), ఇమ్రాన్ హష్మి (EmraanHashmi) నటించిన ‘టైగర్ 3’ (Tiger3) సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. ఆ […]

Share:

ఏ సినిమా అయినా శుక్రవారం విడుదల చేస్తారు, లేదా ఒకటి రెండు రోజులు ముందు చేస్తారు ఏదైనా సెలవులు కలిసి వస్తే… కానీ సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన టైగ‌ర్ 3 (Tiger 3)’ మాత్రం విడుదల తేదీ, అలాగే అభిమానుల కోసం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించేలా వున్నాయి.

సల్మాన్ ఖాన్ (SalmanKhan), కత్రినా కైఫ్ (KatrinaKaif), ఇమ్రాన్ హష్మి (EmraanHashmi) నటించిన ‘టైగర్ 3’ (Tiger3) సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. ఆ మధ్య విడుదలైన సినిమా టీజర్ బాగా వైరల్ అయింది, సినిమా మీద ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా ట్రైలర్ ఈనెల అంటే అక్టోబర్ 16న (October16) విడుదల చేస్తున్నామని చిత్ర నిర్వాహకులు ఒక ప్రకటనలో చెప్పారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ మాత్రం ఇంకా ఖరారు చెయ్యలేదు అని తెలుస్తోంది.

 అయితే తాజా సమాచారం ప్రకారం, సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమా విడుదల తేదీ నవంబర్ 12న దీపావళి (Deepavali) రోజు విడుదల చెయ్యాలని భావిస్తున్నట్టుగా హిందీ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సంవత్సరం విడుదలకి చాలా పెద్ద సినిమాలు వున్నాయి. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’,(Tiger3) తరువాత రణబీర్ కపూర్ (RanbirKapoor) నటిస్తున్న ‘యానిమల్’ (Animal), తరువాత ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘సలార్’ (Salaar0 సినిమాలు వరసగా విడుదలకి వున్నాయి. అలాగే షారుఖ్ (ShahRukhKhan) నటించిన ‘డంకి’ (Dunki) కూడా డిసెంబర్ లో విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు.

మామూలుగా అయితే ఏ సినిమా అయినా శుక్రవారం(Friday) విడుదల చేస్తారు, సెలవులు కలిసి వస్తే ఒకటి రెండు రోజులు ముందుగా విడుదల చేస్తారు, కానీ ఆదివారం విడుదల చెయ్యడం అనేది చాలా తక్కువ. ఈమధ్య కాలంలో ఒక పెద్ద సినిమా ఆదివారం విడుదలవ్వలేదు, కానీ సల్మాన్ ఖాన్(Salman khan) తన ‘టైగర్ 3′(Tiger3) సినిమాని నవంబర్ 12 అంటే ఆదివారం నాడు విడుదల చెయ్యాలని సంకల్పించినట్టుగా తెలిసింది. ఎందుకంటే అదేరోజు దీపావళి(Diwali) పండగ రోజు కూడా. అందుకే అభిమానులకి దీపావళి కానుకగా ఈ ‘టైగర్ 3’ ని ఆరోజు విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్టుగా బాలీవుడ్ మీడియా లో కథనాలు వస్తున్నాయి. 

ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం అర్పించిన ఓ స్పై ఏజెంట్‌(Spy agent)ను దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తే.. తనపై పడిన ముద్రను చెరిపేసుకోవడానికి తనకు క్యారెక్టర్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని దేశాన్ని కోరాడం, అంతవరకు దేశం కోసం పోరాడుతూనే ఉంటానంటూ చెప్పడం వంటివి ఆడియెన్స్‌లో ఉత్కంఠ రేకెత్తించాయి. గ్లింప్సే ఈ రేంజ్‌లో ఉంటే ట్రైలర్‌ ఇంకా ఎలా ఉంటుందో అని అప్పుడే సల్మాన్(Salman) ఫ్యాన్స్‌ ఊహల్లో తేలిపోతున్నారు. ఇక గత వారం రోజులుగా ట్రైలర్‌(Trailer) అక్టోబర్‌ 16న రిలీజ్‌ చేస్తున్నట్లు పలు పోస్టర్‌లను మేకర్స్ అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.

కాగా తాజాగా ట్రైలర్‌ టైమ్‌ను సల్మాన్‌(Salman) అనౌన్స్‌ చేశాడు. టైగర్‌-3 ట్రైలర్‌ను అక్టోబర్‌ 16న మధ్యాహ్నం 12గంటలకు రిలీజ్(Release) చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాపై హిందీ ఆడియెన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల కూడా అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా తొలిసారి సల్మాన్ సినిమాతో తెలుగులో అత్యధిక స్క్రీన్‌లలో రిలీజ్‌ కాబోతుంది. పైగా పటాన్‌(Patan), జవాన్‌(Jawan) వంటి సినిమాలను తెలుగు ఆడియెన్స్‌ రిసీవ్‌ చేసుకున్న తీరు చూసి.. టైగర్‌-3(Tiger3) మేకర్స్‌ కూడా డబ్బింగ్‌ను పర్‌ఫెక్ట్‌గా చేయించేలా ప్లాన్‌ చేస్తుంది. రిలీజ్‌కు ఎలాగో ఇంకొ నెల టైమ్‌ ఉంది గనుక.. తెలుగు, తమిళ భాషల్లో ప్రమోషన్‌లు కూడా భారీగా చేయాలని యష్‌ రాజ్‌ ఫిలింస్‌ సంస్థ ప్లాన్‌ చేస్తుందట.

టైగర్‌ సిరీస్‌లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన ఈ చిత్రానికి మనీష్ శర్మ(ManishSharma)  దర్శకత్వం వహించాడు. యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి(Diwali) డేట్‌ను లాక్‌ చేసుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్‌(Release) కాబోతుంది. యష్‌ రాజ్‌ ఫిలింస్‌(Yash Raj Films) నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్‌ జిందా హే సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.