బీజేపీలోకి చేరికపై కిచ్ఛా సుదీప్‌కి బెదిరింపు లేఖ.. క్లారిటీ ఇచ్చిన సుదీప్..

పార్టీలో చేరను కానీ.. మద్దతు ఇస్తానన్న కిచ్చా సుదీప్.. కర్ణాటక ఎన్నికల్లో కిచ్చా సుదీప్ బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే వార్త ఊపందుతోంది. సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో కాషాయ కండువా కప్పుకొనున్నట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం చేస్తోంది. తాజాగా కిచ్చా సుదీప్ బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఒక విలేఖరితో మాట్లాడుతూ.. నేను కేవలం బీజేపీ తరఫున ప్రచారం మాత్రమే చేస్తానని.. ఏ నియోజకవర్గంలో కూడా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.  కర్ణాటకలో మే […]

Share:

పార్టీలో చేరను కానీ.. మద్దతు ఇస్తానన్న కిచ్చా సుదీప్..

కర్ణాటక ఎన్నికల్లో కిచ్చా సుదీప్ బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే వార్త ఊపందుతోంది. సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో కాషాయ కండువా కప్పుకొనున్నట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం చేస్తోంది. తాజాగా కిచ్చా సుదీప్ బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఒక విలేఖరితో మాట్లాడుతూ.. నేను కేవలం బీజేపీ తరఫున ప్రచారం మాత్రమే చేస్తానని.. ఏ నియోజకవర్గంలో కూడా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. 

కర్ణాటకలో మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికోసం రాజకీయ పార్టీలు అన్ని విధాలుగా సామాజిక వర్గాలు ప్రాంతాలు, మతాలు ఇలా అన్ని విధాలుగా ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముస్లింలకు అందుతున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. బీజేపీ సర్కా ర్ దాన్ని లింగాయత్ సమానంగా పంచడం ద్వారా వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉండగా కర్ణాటక సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని.. ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన స్పష్టంగా తెలియజేశారు. సుధీర్ బీజేపీలో చేరతారని అంతకుముందే పలు వార్తలు జోరుగా ప్రసారం జరగగా అలాంటిదేమీ లేదని తాజాగా కిచ్చా సుదీప్ స్పష్టతనిచ్చారు. 

తాజాగా కిచ్చా సుదీప్ సీఎం బొమ్మై ఇద్దరు కలిసి బెంగళూరులో ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ సందర్భంగా కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. బొమ్మై సార్‌కు మద్దతిస్తున్నట్లుగా ప్రకటించానని, ప్రధాని మోదీ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను గౌరవిస్తానని సుదీప్ తెలిపారు. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సుదీప్ తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తినీ కాదన్నారు. తనకు మద్దతుని మాత్రమే ప్రకటించారని తనకు మద్దతు ఇవ్వటం అంటే బీజేపీకి మద్దతు ఇచ్చినట్లే అని అన్నారు. 

ఈ విషయంపై కిచ్చా సుదీప్ మేనేజర్‌కు సుదీప్ బీజేపీ పార్టీలో చేరకూడదు అని బెదిరింపు లెటరు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ బెదిరింపుల విషయంపై కిచ్చా సుదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఈ విషయాన్ని నేను చూసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. తాను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారికి అనుకూలంగా తాను పనిచేస్తానని కిచ్చా సుధీర్ స్పష్టం చేశారు.

ప్రకాష్ రాజ్ ట్వీట్..

తాజాగా కిచ్చా సుదీప్ బీజేపీలో చేరికపై మంగళవారం నుంచి జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కన్నడ నటుడు ఇవాళ బీజేపీలో చేరుతున్నారని ఒక మీడియా సంస్థ చేయగా ఇది ఫేక్ న్యూస్ అని బలంగా నమ్ముతున్నట్లు నటుడు ప్రకాష్ రాజు ట్వీట్ చేశారు. ఈ వార్తకు కిచ్చా సుదీప్ అభిమానులు మేము మిమ్మల్ని అభిమాన నటుడిగా కోరుతూ ట్వీట్ చేస్తున్నాము. దయచేసి మీరు రాజకీయాల్లోకి వెళ్ళద్దు అని రాజకీయ నాయకుడిగా చూడలేమని మీ స్నేహితులు మీ పేరు వాడుకుంటే సహించలేమని.. మీ స్నేహితుల కోసం ప్రచారం చేయవద్దని అభ్యర్థించారు. దీంతో “వి డోంట్ వాంట్ కిచ్చా సుదీప్ ఇన్ పాలిటిక్స్” అనే హ్యాష్ టాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండ్‌గా నిలిచింది. సుదీప్ అభిమానులు కూడా ఆయన రాజకీయాల్లోకి రాకూడదని అంటున్నారు. 

 

Tags :