అందుకే చిరంజీవి ఇప్ప‌టికీ అల‌రిస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఆగస్టు 22 వ తేదీన ఘనంగా జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల లోనూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు యువ హీరోలు అందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల వాల్తేర్ వీరయ్య చిత్ర నిర్మాత రవి శంకర్ యలమంచిలి, చిరంజీవి గారి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిరంజీవి గారు ఎలాంటి పాత్రలో […]

Share:

మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఆగస్టు 22 వ తేదీన ఘనంగా జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల లోనూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు యువ హీరోలు అందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల వాల్తేర్ వీరయ్య చిత్ర నిర్మాత రవి శంకర్ యలమంచిలి, చిరంజీవి గారి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిరంజీవి గారు ఎలాంటి పాత్రలో అయినా సులభంగా నటిస్తారు అని అన్నారు. ఎటువంటి సన్నివేశం అయినా ఎలాంటి ఎమోషన్ అయినా కూడా ఆయనకు చాలా ఈజీ గా ఉంటుంది అని కూడా అన్నారు. 

వాల్తేరు వీరయ్య సినిమా మొదటి హాఫ్ లో సాధారణమైన జాలరి పాత్రలో చిరంజీవి గారు ఒదిగిపోయారు, అలాగే ఆ చిత్రం సెకండ్ హాఫ్ లో అసలు భయం లేని వ్యక్తిగా శత్రువులతో పోరాడే పాత్రలో కూడా ఆయన అంతే సులభంగా చేయగలిగారు అని నిర్మాత రవి శంకర్ అన్నారు. యువ డైరెక్టర్ల తో చిరంజీవి గారు బాగా కలిసిపోతారు, సీనియర్ నటుడు పెద్ద హీరో అనే భావన ఎక్కడా ఆయనలో కనిపించదు. వాల్తేరు వీరయ్య సినిమా చిత్రీకరణ లో కూడా డైరెక్టర్ బాబీతో చిరంజీవి గారు చాలా కలివిడిగా మాట్లాడేవారు. ఏ సీన్ ఎలా చేయాలి అని డైరెక్టర్ తో అన్ని చర్చించే వారు. ఆయన హార్డ్ వర్క్ వలనే వాల్తేరు వీరయ్య సినిమా ఘన విజయం సాధించింది అని నిర్మాత వెల్లడించారు. ఆయన వ్యక్తిత్వం వలనే ఆయన చేస్తారు అనుకున్న దానికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అని మరియు ఇప్పటికీ ఆయన అభిమానులను అలరిస్తున్నారు అని ఆయన సినిమా కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అని కూడా అన్నారు. 

వాల్తేరు వీరయ్య తర్వాత భారీ అంచనాలతో విడుదల అయిన భోళా శంకర్ చిత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. చాలా కాలం గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు సాధించలేక పోయింది. ఈ విషయంలో చిరంజీవి అభిమానులు డైరెక్టర్ మెహర్ రమేష్ ను బాహాటంగా నే విమర్శించారు. ఇకపై చిరంజీవి రీమేక్ సినిమాలు చేయవద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి నటన బావున్నా కూడా కథనంలో పట్టు లేకపోవడం వలన హిట్ అవ్వలేక పోయింది. 

అయితే చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఆయన తదుపరి చిత్ర పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ కు సూపర్ హిట్ సినిమా బింబిసార డైరెక్ట్ చేసిన వశిష్ట ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. ఏం.ఏం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా వాల్తేరు వీరయ్య తప్ప చిరంజీవి నటించిన అన్ని చిత్రాలు నిరాశ పరిచాయి, ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలు తీవ్ర నిరాశ పరచడంతో అభిమానులు తాజా చిత్రం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు.