ద‌స‌రాకు లియో వ‌ర్సెస్ భ‌గ‌వంత్

తెలుగు రాష్ట్రాల్లో పండగ వచ్చిందంటే చాలు, రెండు మూడు క్రేజీ సినిమాలతో థియేటర్స్ కళకళలాడిపోతాయి. అలా మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి తర్వాత టాలీవుడ్ కి పెద్ద పండగ లాంటిది దసరా. ఈ సీజన్లో  కూడా అతి తక్కువ గ్యాప్ తో పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతుంటాయి. గత ఏడాది దసరాకి మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, అక్కినేని నాగార్జున ‘ఘోస్ట్’ వంటి చిత్రాలు ఒకే రోజు విడుదల అయ్యాయి. వీటితో పాటుగా చిన్న సినిమా […]

Share:

తెలుగు రాష్ట్రాల్లో పండగ వచ్చిందంటే చాలు, రెండు మూడు క్రేజీ సినిమాలతో థియేటర్స్ కళకళలాడిపోతాయి. అలా మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి తర్వాత టాలీవుడ్ కి పెద్ద పండగ లాంటిది దసరా. ఈ సీజన్లో  కూడా అతి తక్కువ గ్యాప్ తో పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతుంటాయి. గత ఏడాది దసరాకి మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, అక్కినేని నాగార్జున ‘ఘోస్ట్’ వంటి చిత్రాలు ఒకే రోజు విడుదల అయ్యాయి. వీటితో పాటుగా చిన్న సినిమా ‘స్వాతి ముత్యం’ కూడా విడుదలైంది.ఇక ఈ ఏడాది దసరా కి కూడా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నాయి. ఒకటి నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘భగవంత్ కేసరి’ కాగా, మరొకటి ఇలయథలపతి విజయ్ నటించిన ‘లియో’. ఈ రెండు సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంది.

రెండు సినిమాలు కూడా క్రేజీ కాంబినేషన్స్:

‘అఖండ’ , ‘వీరసింహా రెడ్డి’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య నుండి వస్తున్నా చిత్రం ఇది. అంతే కాకుండా అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా , కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ప్రముఖ యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య బాబు కి కూతురు గా నటిస్తుంది. బాలయ్య పుట్టిన రోజు నాడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య బాబు మార్క్ యాక్షన్ ఉంటూనే , అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా ఉంటుందని ఈ టీజర్ ని చూస్తే అర్థం అవుతాది. ఇక తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో’ చిత్రానికి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్.

ఒక్క రోజు గ్యాప్ లో రవితేజ సినిమా కూడా పోటీలోకి :

గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘మాస్టర్’ అనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చింది. ఈ చిత్రం తెలుగు లో కూడా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. ఇక విజయ్ గత కొంతకాలం నుండి వరుస హిట్స్ తో పీక్ ఫామ్ ని మైంటైన్ చేస్తున్నాడు. లోకేష్ కనకరాజ్ తన గత సినిమా ‘విక్రమ్’ సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని కొల్లగొట్టాడు. ఇలా ఇద్దరు ఈ రేంజ్ ఫామ్ లో ఉన్నప్పుడు చేస్తున్న సినిమా ఇది. ఇక అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో ఊహించుకోవచ్చు. రీసెంట్ గా విడుదల చేసిన మొదటి సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ట్రేడ్ లో మంచి అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ రెండు సినిమాలు అక్టోబర్ 19 వ తారీఖున గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్నాయి. తెలుగు కచ్చితంగా బాలయ్య సినిమానే లీడ్ లో ఉంటుంది. కానీ ఓవరాల్ గా మాత్రం విజయ్ ‘లియో’ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వస్తాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రెండు సినిమాలు విడుదలైన పక్క రోజే మాస్ మహారాజ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం కూడా విడుదల అవుతుంది. ఇక ఈ దసరా సీజన్ ద్వారా  మూవీ లవర్స్ కి ఒక రేంజ్  ఎంటర్టైన్మెంట్ దక్కనుంది.