మేము ఫారిన్‌ టూర్లకు వెళ్లడం వారికి అసూయగా ఉంది

తెలుగు ఇండస్ట్రీలో హ్యాండ్సమ్‌  హీరో, సూపర్‌‌ స్టార్‌‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నాడు. అయితే, ఆయన ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌ ట్రిప్స్‌ ఎక్కువగా వెళ్తుండటంపై మూవీ ఆగిపోయిందేమోనని అభిమానులు, ప్రేక్షకులు కంగారు పడుతున్నారు. వీటన్నింటికీ ఆయన ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మహేశ్‌ బాబు పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. అందులో కొంత మంది అభిమానులు మహేశ్‌ను వెరైటీ ప్రశ్నలు అడిగి […]

Share:

తెలుగు ఇండస్ట్రీలో హ్యాండ్సమ్‌  హీరో, సూపర్‌‌ స్టార్‌‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నాడు. అయితే, ఆయన ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌ ట్రిప్స్‌ ఎక్కువగా వెళ్తుండటంపై మూవీ ఆగిపోయిందేమోనని అభిమానులు, ప్రేక్షకులు కంగారు పడుతున్నారు. వీటన్నింటికీ ఆయన ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మహేశ్‌ బాబు పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. అందులో కొంత మంది అభిమానులు మహేశ్‌ను వెరైటీ ప్రశ్నలు అడిగి నవ్వులు పూయించారు. అలాగే, మహేశ్‌  బాబు ఫారిన్ ట్రిప్స్‌ కూడా పలు ప్రశ్నలు అడిగారు. గుంటూరు కారం సినిమా విడుదలపై తేదీపై కూడా మహేశ్‌ కార్లిటీ ఇచ్చాడు.  

మహేశ్‌బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్‌, సితారలతో ఎక్కువ సమయం గడుపుతారు. వారితో కలిసి ఫారిన్‌లో విహారయాత్రలకు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలను మహేశ్ ఫ్యామిలీ చూసి వచ్చింది. బహుశా ఇన్ని దేశాలను ఏ తెలుగు హీరో ఫ్యామిలీతో చూసి ఉండడేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కువగా స్విట్జర్లాండ్‌, దుబాయ్, స్కాట్లాండ్ అంటే ఎక్కువగా ఇష్టం. గత కొన్ని నెలలుగా మహేశ్‌ ఫ్యామిలీ బ్యాక్‌ టు బ్యాక్‌ ట్రిప్స్‌కు వెళ్లి వస్తున్నారు. 

నేను ఫారిన్‌ టూర్లకు వెళ్లడం ఇష్టం లేదా..?

మహేశ్‌ తరుచూ ఫారిన్‌ ట్రిప్‌లపై ఆ ఇంటర్వ్యూలో ఒకరు ప్రశ్న అడగగా, దీనికి మహేశ్‌ బాబు నవ్వుతూ, ‘‘నేను ఫారిన్‌ ట్రిప్‌లకు వెళ్లడం మీకు ఎందుకు ఇష్టం లేదు?. షూటింగ్‌ల నుచి ఖాళీ దొరికినప్పుడల్లా నా కుటుంబంతో గడపాలని ఎక్కువగా చూస్తాను.లేదంటే పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు ఫారిన్‌ టూర్లకు వెళ్లేందుకు ఇష్టపడతాం. మీకు నా ఫారిన్‌ వెకేషన్ ఫొటోలు నచ్చుతాయా? చాలా మంది అసూయ పడుతున్నట్లు తెలుస్తోంది. నేను మాత్రం ఫ్యామిలీతో వీలైనంత వరకు టైమ్‌ స్పెండ్‌ చేసేందుకు ఇష్టపడతాను. వారు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతాం. వీలు ఉన్నప్పుడైనా వారితో సరదాగా గడపాలనేదే నా కోరిక” అని మహేశ్‌ చెప్పాడు. 

గుంటూరు కారం 2024 సంక్రాంతికి రిలీజ్‌ అవుతుందా?

మహేశ్‌ బాబు తదుపరి చిత్రం గుంటూరు కారం విడుదల తేదీ గురించి చాలామందిలో పలు అనుమానాలు ఉన్నాయి. 2024 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాకపోవచ్చని పలువురు అంటున్నారు. అయితే, దీనిపై మహేశ్‌ బాబు క్లారిటీ ఇచ్చారు. గుంటూరు కారం అనుకున్న టైమ్‌కే విడుదల అవుతుందని స్పష్టం చేశారు. మహేశ్‌ స్టేట్‌మెంట్‌తో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

మీనాక్షి చౌదరి, శ్రీలీల, జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు గుంటూరుకారంలో మూవీలో నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. 

గుంటూరు కారం చిత్రంపై గత కొన్నిరోజులుగా పలు రకాల రూమర్లు వస్తున్నాయి. ఈ మూవీ నుంచి హీరోయిన్‌ పూజా హెగ్డే తప్పుకున్నారు. ఆమె స్థానంలో శ్రీలీల చేస్తుది. మ్యూజిక్‌ డైరెక్టర్‌‌ తమన్‌ బయటకు వెళ్లిపోయాడని పుకార్లు వినిపించాయి. అలాగే, కెమెరా మెన్‌ పీఎస్ వినోద్‌ కూడా తప్పుకున్నారట.తాజాగా ఫైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌ కూడా తప్పుకున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. వీరి స్థానంలో కేజీఎఫ్‌ ఫైట్‌ మాస్టర్స్‌ అనల్‌ అరసు పనిచేస్తున్నారని తెలిసింది. అయతే, ఈ సినిమాలో రామ్‌ లక్ష్మణ్‌ వర్క్‌ కంప్లీట్‌ అయ్యిందని, అందుకే వారు వెళ్లిపోయారని సమాచారం. ఏదో ఒక వివాదంలో ఈ సినిమా ట్రెండింగ్‌లో కొనసాగుతూనే ఉంది. అయితే, నెటిజన్లు మాత్రం గుంటూరు కారం చిత్రం బిగ్‌బాస్‌ హౌస్‌లా తయారైందని ట్రోల్స్‌ చేస్తున్నారు.