గోపాల గోపాల సినిమా సీక్వెల్ ఉండకపోవచ్చు

వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రేయ నటించిన గోపాల గోపాల సినిమా 2017లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. హిందీ సినిమా OMG ఆధారంగా తెరకెక్కిన గోపాల గోపాల సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది, అంతేకాకుండా తర్వాత దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసుకున్నారు, గోపాల గోపాల సినిమా డైరెక్టర్ డోలి అలియాస్ కిషోర్ కుమార్ పరదసాని. అయితే ఒక కారణంగా సీక్వెల్ ఆలోచన మానుకున్నట్లు డోలి చెప్పుకొచ్చారు. గోపాల గోపాల సీక్వెల్ ఉండకపోవచ్చు:  ‘OMG […]

Share:

వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రేయ నటించిన గోపాల గోపాల సినిమా 2017లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. హిందీ సినిమా OMG ఆధారంగా తెరకెక్కిన గోపాల గోపాల సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది, అంతేకాకుండా తర్వాత దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసుకున్నారు, గోపాల గోపాల సినిమా డైరెక్టర్ డోలి అలియాస్ కిషోర్ కుమార్ పరదసాని. అయితే ఒక కారణంగా సీక్వెల్ ఆలోచన మానుకున్నట్లు డోలి చెప్పుకొచ్చారు.

గోపాల గోపాల సీక్వెల్ ఉండకపోవచ్చు: 

‘OMG 2’ సీక్వెల్‌ను రీమేక్ చేయాలని డాలి అనుకున్నప్పటికీ, OMG-2 సీక్వెల్ సంచలనాత్మక హిట్ అయినప్పటికీ, ఇప్పుడు తన గోపాల గోపాల సినిమా సీక్వెల్ ప్లాన్ ఆపినట్లు చెప్పుకొచ్చాడు. OMG-2ని తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకున్న‌ది నిజ‌మే అని, అయితే హిందీలో తీసిన కాన్సెప్ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కాస్త బోల్డ్‌గా అనిపించచ్చేమో అనే ఉద్దేశంతో, త‌ర్వాత గోపాల గోపాల సీక్వెల్ తీయాలని ఆలోచ‌న‌ను విరమించుకున్నాం అని చెప్పుకొచ్చాడు డాలి. 

అయితే నిజానికి OMG-2 ఒక అద్భుతమైన సినిమా అని, అనడంలో సందేహం లేదు  అని.. స్కూల్ పిల్లల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన టాపిక్‌ గురించి ఉంటుందని.. అంతేకాకుండా ఇప్పుడున్న కాలంలో పిల్లలు మొబైల్‌లు మరియు ట్యాబ్‌లను సులభంగా యాక్సెస్ చేయడంతో, పిల్లలను మొబైల్ నుంచి దూరంగా ఉంచడానికి తల్లిదండ్రులకు కష్టంగా మారింది. అయితే దీనికి సంబంధించి తల్లిదండ్రులు పిల్లల గురించి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, సెక్స్ ఎడ్యుకేషన్‌ గురించి అప్రమత్తలు ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు ముందుగానే నేర్పించాలని కాన్సెప్ట్ మీద హిందీ సినిమా OMG-2 ఉంది. అయితే ఈ కాన్సెప్ట్ అనేది తెలుగు ప్రేక్షకులకు కాస్త బోల్డ్ గా అనిపిస్తుంది అనే కారణంగానే, తెలుగులో గోపాల గోపాల సీక్వెల్ తీయడానికి వెనకాడినట్లు చెప్పుకొచ్చారు డాలి.

బి-టౌన్ స్టార్స్ అక్షయ్ కుమార్ మరియు పంకజ్ త్రిపాఠి OMG-2 లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారని, వారి నటన నిజంగా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ డాలి. సినిమాలో శివుని పరిచయం కూడా అద్భుతంగా ఉంది అని ఆయన చెప్పారు.

గోపాల గోపాల: 

‘గోపాల గోపాల’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఒకప్పుడు ఈ సినిమాలో నటించిన వెంకటేష్, పవన్ కళ్యాణ్ అదేవిధంగా శ్రేయలు చాలా అద్భుతంగా తమ నటనను ప్రదర్శించడం జరిగింది. ఈ సినిమా తీసి ఒక చరిత్ర సృష్టించారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ నటించి, వెంకటేష్ ఒక నాస్తికుడిలా నటించి చాలా బాగా ప్రశంసలు అందుకున్నారు. దేవుడిని నమ్మొచ్చు కానీ మూఢనమ్మకాలు మాత్రం పక్కన పెట్టాలి అని చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. 

పవన్ కళ్యాణ్ గురించి మరింత: 

ఇటీవల హిట్గా నిలిచిన’బ్రో’లో పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌లతో పాటు ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, సుబ్బరాజు మరియు వెన్నెల కిషోర్‌లతో సహా మరె ఎంతోమందిస్తేనే తారలు ఈ సినిమాలో ముఖ్యపాత్రులుగా పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటర్, పాటలను థమన్ సంగీతాన్ని అందించడం జరిగింది. ఒకపక్క రాజకీయరంగంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, అప్పుడప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో తలుక్కుమంటూ ప్రేక్షకులని అలరిస్తున్నారు.