బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? 

తెలుగు బిగ్ బాస్ 7 వీక్షకులారా, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో మన ముందుకు వచ్చేసింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7 రిలీజ్ అయిన అనంతరం ప్రతి ఒకరు షాక్ కి గురయ్యారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బిగ్ బాస్ సీజన్ 7 లో అంతా ఉల్టా పల్టాగా జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-7 లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ రేమోనేషన్ గురించి చర్చి జరుగుతోంది. మరి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి.. […]

Share:

తెలుగు బిగ్ బాస్ 7 వీక్షకులారా, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో మన ముందుకు వచ్చేసింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7 రిలీజ్ అయిన అనంతరం ప్రతి ఒకరు షాక్ కి గురయ్యారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బిగ్ బాస్ సీజన్ 7 లో అంతా ఉల్టా పల్టాగా జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-7 లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ రేమోనేషన్ గురించి చర్చి జరుగుతోంది. మరి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి..

కుడి ఎడమైనా పర్లేదు: 

అనుకున్నట్టుగానే, ప్రోమోలో చూపించిన విధంగానే, బిగ్ బాస్ హౌస్ లో అంతా రివర్స్ లో జరుగుతోంది. మొదటి రోజే, బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి 5 కంటెస్టెంట్లకు సుమారు 35 లక్షలు ఆఫర్ చేయడం జరిగింది. నిజానికి బిగ్ బాస్ ప్రతి సీజన్ లో, పాల్గొన్న కంటెస్టెంట్ల లో ఎవరైతే చివరి వరకు ఉంటారో, ఆ ఐదు మందికి మాత్రమే 35 లక్షలు ఆఫర్ చేయడం జరుగుతుంది. కానీ బిగ్ బాస్ సీజన్-7 మొదలైన మొదటి రోజే జరగడం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి బిగ్ బాస్ సీజన్-7 అన్ని సీజన్ల కన్నా భిన్నంగా ఉంటుంది అని మొదటి నుంచి ప్రోమోలో చూపించిన విధంగానే, ఈ సీజన్ లో అంత తారుమారుగా జరగడం కనిపించింది. కేవలం 15 మంది కంటెస్టెంట్లు మాత్రమే బిగ్ బాస్ మొదటి రోజున సందడి చేశారు. అయితే మొదటి ఎలిమినేషన్ లో, అనుకోని విధంగా జెమిని మరియు మరెన్నో చిత్రాలలో నటించిన ప్రముఖ నటి..కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం హౌస్ లో 14 మంది ఉన్నారు. 

కంటెస్టెంట్స్ ప్రతి వారం అందుకునే రెమ్యూనిరేషన్:

ప్రియాంక జైన్ – ప్రఖ్యాత టీవీ సీరియల్ ఆర్టిస్ట్- రూ. 2.5 లక్షలు

శివాజీ – తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి.. పరిచయం అవసరం లేదు- రూ. 4 లక్షలు

దామిని భట్ల – బాహుబలిలోని పచ్చబొట్టేసిన పాపులర్ పాట మరియు కొండ పొలం చిత్రంలో ధమ్ ఢామ్ పాడారు, దీనికి ఇటీవల చంద్రబోస్ జాతీయ అవార్డును అందుకున్నారు- రూ. 2 లక్షలు

ప్రిన్స్ యావార్ – మోడల్ మరియు ఫిట్‌నెస్ ఫ్రీక్, అతను కోల్‌కతాకు చెందినవాడు మరియు హైదరాబాద్‌లో కెరీర్‌ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు- రూ. 1.5 లక్షలు

సుభాశ్రీ రాయగురు – నటి మరియు న్యాయవాది – ఇటీవల అమిగోస్ చిత్రంలో నటించారు- రూ. 2 లక్షలు

షకీలా – సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి- రూ. 3.5 లక్షలు

ఆట సందీప్ – బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్, గతంలో అనేక రియాల్టీ షోలలో పాల్గొన్నారు- రూ 2.75 లక్షలు

శోభా శెట్టి – కార్తీక దీపంలోని ‘మోనిత’ పాత్రకు ప్రసిద్ధి చెందింది- రూ. 2.5 లక్షలు

టేస్టీ తేజ – ఫుడ్ వ్లాగర్.. ఫుడ్.. ఇంక తనదైన శైలిలో వినోదంతో తాజా సినిమాలను ప్రమోట్ చేస్తుంటాడు- రూ. 1.5 లక్షలు

రతికా రోజ్ – సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ – రీసెంట్‌గా నేను స్టూడెంట్ సర్ సినిమాలో నటించింది- రూ. 2 లక్షలు

గౌతం కృష్ణ – నటుడు మరియు డాక్టర్– ఆకాశవీధుల్లో సినిమాలో నటించారు- రూ 1.75 లక్షలు

పల్లవి ప్రశాంత్ – యూట్యూబర్, బిగ్ బాస్ షోలో భాగం కావాలని చాలా కాలంగా కోరుకుంటున్న డై హార్డ్ ఫ్యాన్- రూ. 1 లక్ష
అమర్‌దీప్ – పరిణయం సీరియల్ తో పాపులర్ అయిన టీవీ సీరియల్ ఆర్టిస్ట్- రూ. 2.5 లక్షలు