హాలీవుడ్ న‌టుల ధ‌ర్నా

గత కొంత కాలం నుండి హాలీవుడ్ నటీనటులు సమ్మె లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే, మే నెల నుండి విరామం లేకుండా ఈ సమ్మె ని నిర్వహిస్తున్న చలన చిత్ర మరియు టెలివిజన్ రచయిలతో వీళ్ళు చేతులు కలిపారు. ఈ సమ్మె ద్వారా వీరు అనేక ప్రదర్శనలు మరియు సినిమాలను విడుదల చెయ్యడం వంటివి ఆపేసి సమ్మె ని మరింత తీవ్రవంతం చేసారు. స్టూడియోలతో చర్చలు జరిపి విఫలమైన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. […]

Share:

గత కొంత కాలం నుండి హాలీవుడ్ నటీనటులు సమ్మె లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే, మే నెల నుండి విరామం లేకుండా ఈ సమ్మె ని నిర్వహిస్తున్న చలన చిత్ర మరియు టెలివిజన్ రచయిలతో వీళ్ళు చేతులు కలిపారు. ఈ సమ్మె ద్వారా వీరు అనేక ప్రదర్శనలు మరియు సినిమాలను విడుదల చెయ్యడం వంటివి ఆపేసి సమ్మె ని మరింత తీవ్రవంతం చేసారు. స్టూడియోలతో చర్చలు జరిపి విఫలమైన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో ఉన్న స్టూడియోస్ గత 63 సంవత్సరాలలో ఎన్నడూ చూడని నష్టాలను ఈ సమ్మె కారణం గా చూడాల్సి వస్తుంది. ఈ సమ్మె కారణం గా విదేశాల్లో జరగుతున్న నిర్మాణాలను కూడా ఆపివెయ్యాల్సి వచ్చిందట.

హాలీవుడ్ టాప్ స్టార్స్ డిజిటల్ డబుల్స్ ‘ఒక రోజు వేతనం’తో జీవించాల్సి వస్తుందని  యూనియన్ భయపడుతోంది:

ఆంథాలజీ టెలివిజన్లో ప్రసారం అయ్యే  ‘బ్లాక్ మిర్రర్’ తరహాలో, స్క్రీన్ యాక్టర్స్ కోసం ఉపయోగించబడే డిజిటల్ ప్రతిరూపాలపై కంట్రోల్ తెచ్చుకోవడం కోసం మాత్రమే మేము స్టూడియోలతో పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చింది ఈ యూనియన్. స్టూడియో వారు మేము వాడే డిజిటల్ ఇమేజిలను దుర్వినియోగ పర్చుకుంటున్నారని అందుకే ఈ పోరాటం చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. మరోపక్క స్టూడియోలకు చెందిన యజమానులు మాత్రం వాళ్ళ డిజిటల్ ఇమేజిలు స్టూడియోస్ ఉండడం వల్లే సురక్షితంగా ఉన్నాయని కౌంటర్లు ఇచ్చారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సినీ మరియు టెలివిజన్ నటీనటులకు చాలా  సున్నితమైన సమస్యగా తయారైంది, ఈ టెక్నాలజీ ని ఉపయోగించి తమ స్వరాలు మరియు పోలికలను నకిలీ చేసేందుకు ఉపయోగిస్తున్నారని భయపడుతున్నారు. తెరపై ఈ డిజిటల్ ప్రతి రూపాలు ఎలా ఉపయోగించాలి అనే  దానిపై నియంత్రణను నిర్ధారించడానికి నటీనటులు హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పంద చర్చలను ఏర్పాటు చేసారు. హాలీవుడ్ స్టూడియోలతో కాంట్రాక్ట్ చర్చలలో ఇది అనేక  అతి ముఖ్యమైన పాయింట్‌స్ లో ఒకటి.అయితే ఈ చర్చలు ఫలించలేదు. అయితే AMPTP, వాల్ట్ డిస్నీ, నెట్‌ఫ్లిక్స్ మరియు ఇతర ప్రధాన స్టూడియోలు డిజిటల్  స్ట్రీమింగ్ సేవల తరపున చర్చలు జరుపుతున్నారు. నటీనటుల డిజిటల్ ప్రతిరూపాలు దుర్వినియోగం కాకుండా రక్షించే ప్రక్రియలో  “గ్రౌండ్‌బ్రేకింగ్ AI ప్రతిపాదన”కు అంగీకరించినట్లు యూనియన్ తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఒక నటుడి ప్రతిరూపాన్ని, అతని స్వరాన్ని వాడుకోవాలంటే కచ్చితంగా అతని అనుమతిని కోరాల్సి ఉంటుంది ఈ ఒప్పందం ప్రకారం.

SAG-AFTRA చీఫ్ నెగోషియేటర్ డంకన్ క్రాబ్‌ట్రీ-ఐర్లాండ్ గురువారం లాస్ ఏంజిల్స్‌లో విలేకరుల సమావేశం: 

ఆయన మాట్లాడుతూ  ” నటీనటులను వ్యక్తిగతంగా వారి పూర్తి బ్యాక్ గ్రౌండ్ వివరాలను స్కాన్ చెయ్యాలని, ఏరోజుకి ఆ రోజు పని చేసినందుకు డబ్బులు చెల్లించాలని, అంతే కాకుండా సదరు బ్యానర్ కి సంబంధించిన సినిమాల కోసం వాడుకోవడానికి తయారు చేయించుకున్న ప్రతిరూపాలు శాశ్వతంగా ఉపయోగించుకునే విధంగా ఉండాలి, ఈ ప్రతిపాదన గురించి మరోసారి అందరూ అలోచించి నిర్ణయం తీసుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు.నేపథ్య నటుల డిజిటల్ ప్రతిరూపాలను ఎటువంటి అనుమతి లేదా పరిహార చెల్లింపులు  లేకుండా శాశ్వతంగా ఉపయోగించాలని SAG-AFTRA యొక్క వాదన తప్పు అని AMPTP తెలిపింది. ప్రస్తుత ప్రతిపాదనలో బ్యాక్‌గ్రౌండ్ యాక్టర్‌ని ఉపయోగించే మోషన్ పిక్చర్‌కు డిజిటల్ రెప్లికా వినియోగాన్ని పరిమితం చేస్తుందని పేర్కొంది. ఏదైనా ఇతర ఉపయోగానికి ఆ నటుడి సమ్మతి మరియు ఉపయోగం కోసం బేరసారాలు అవసరం, కనీస చెల్లింపుకు లోబడి, స్టూడియోలు పేర్కొన్నాయి.