వచ్చే సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న తెలుగు సినిమాలివే

ఈ 2023 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సీనియర్ నటులు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడటం చూశాము. చిరు నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి సందడి చేశాయి. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చిరంజీవి జాలరులకి నాయకుడిగా  ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో మరో హీరో రవితేజ కూడా ఓ పాత్రలో నటించారు. శృతి హాసన్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ క్యూటీ ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ […]

Share:

ఈ 2023 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సీనియర్ నటులు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడటం చూశాము. చిరు నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి సందడి చేశాయి.

బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చిరంజీవి జాలరులకి నాయకుడిగా  ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో మరో హీరో రవితేజ కూడా ఓ పాత్రలో నటించారు. శృతి హాసన్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ క్యూటీ ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ చేసింది. 

ఈ సినిమా ప్రేక్షకులకి నిజంగా పండుగే అని చెప్పవచ్చు.

ఫ్యాక్షనిజం నేపథ్యంలో గోపీచంద్ మలినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో  కూడా శృతి హాసన్ కథానాయిక. అన్నిటి కంటే ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాలు మైత్రీ 

మూవీ మేకర్స్ బ్యానర్‌పైనే రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలకీ గట్టి పోటీనే నడిచింది.

వచ్చే ఏడాది 2024 సంక్రాంతి సందర్భంగా

వచ్చే ఏడాది 2024 సంక్రాంతి సందర్భంగా స్టార్ హీరోల సినిమాలను విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు ఇప్పుడే ప్రయత్నిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే భారీ చిత్రాల జాబితా కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు, విడుదల తేదీని నిర్ధారించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’, ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’, రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్‌సి 15’, మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబో సినిమాలు ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 

ప్రభాస్ ప్రాజెక్ట్ కె జనవరి 12, 2024న విడుదలవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. దాదాపు 500 కోట్లతో ఈ సినిమా రూపొందుతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పఠానీ వంటి బాలీవుడ్ స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా మొదటి భాగం దేశ వ్యాప్తంగా హిట్ అవ్వడంతో, రెండో భాగంపై ఉత్కంఠ మొదలైంది. అలాగే శంకర్-రామ్ చరణ్‌ల భారీ కాంబోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వీటితో పాటు మహేష్ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. వచ్చే సంక్రాంతికి భారీ పోటీ ఉంటుందని అంటున్నారు.

త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబినేషన్

మూడవది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో క్రేజీ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబినేషన్ కి ఉన్న క్రేజే వేరు. అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత.. త్రివిక్రమ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు, 2023 విడుదలకు ప్లాన్ చేస్తున్నప్పటికీ, నిర్మాతలు ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల అవ్వవచ్చని అంటున్నారు. అక్టోబరు వరకు షూటింగ్‌ పూర్తవడం కష్టమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మహేష్ సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఒకవేళ మహేష్ సినిమా షూటింగ్ కి మధ్య కాస్త గ్యాప్ వచ్చినా.. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోయినా.. ఈ సినిమా కూడా సంక్రాంతికే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.