ద‌స‌రా, వాల్తేరు వీర‌య్య‌.. 200 రోజుల సెల‌బ్రేష‌న్స్

తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గారు నిలిచిన చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ అలాగే నాని సినిమా ‘దసరా’ 200 డేస్ సెలబ్రేషన్ జరుపుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచిన సినీ తారలు.  సెలబ్రేషన్ విశేషాలు:  చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా, ఈ సంవత్సరం ఏప్రిల్లో అందరి ముందుకు వచ్చి ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన చిరంజీవి అలాగే రవితేజ మధ్య ఉన్న కెమిస్ట్రీ అందరి అభిమానులను ఆకర్షితులను చేసిందని చెప్పుకోవాలి. అందుకే […]

Share:

తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గారు నిలిచిన చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ అలాగే నాని సినిమా ‘దసరా’ 200 డేస్ సెలబ్రేషన్ జరుపుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచిన సినీ తారలు. 

సెలబ్రేషన్ విశేషాలు: 

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా, ఈ సంవత్సరం ఏప్రిల్లో అందరి ముందుకు వచ్చి ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన చిరంజీవి అలాగే రవితేజ మధ్య ఉన్న కెమిస్ట్రీ అందరి అభిమానులను ఆకర్షితులను చేసిందని చెప్పుకోవాలి. అందుకే బాక్స్ ఆఫీస్ దగ్గర మరిన్ని సినిమాలు వచ్చినప్పటికీ వాటన్నిటిని వెనక్కి నెట్టి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది వాల్తేర్ వీరయ్య. సోమవారం నాడు హైదరాబాదులో జరిగిన, వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణీయంగా రవితేజ, చిరంజీవిలు ఇంకా వాల్తేరు వీరయ్యే సినిమాలో నటించిన కొందరు నటులు కనిపించారు. 

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా, రవితేజ చిరు సోదరుడిగా కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రం సోమవారం విజయవంతంగా 200 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుంది, దీనిని చిత్ర బృందం అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఈ వేడుకకు చిరు, రవితేజ హాజరవడంతో కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. వాల్తేరు వీరయ్య విడుదలైన తర్వాత గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. 

దసరా సినిమా విశేషాలు: 

మరోపక్క 200 డే సెలబ్రేషన్ జరుపుకున్నారు దసరా సినిమా టీం. నిజానికి ఈ దసరా సినిమా నాని సినీ కెరీర్ లోనే ఒక పెద్ద సక్సెస్ ని తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి. నిజానికి దసరా సినిమా సెలబ్రేషన్ సమయంలో నాని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తన సక్సెస్ కి కారణం ప్రేక్షకులే అంటూ, తనని ఇలాగే అభిమానులు ఆదరించాలని కోరాడు. దసరా సినిమాలో నాని అలాగే కీర్తి సురేష్ లు ప్రధాన పాత్రలలో నటించారు, ఈ సినిమా కేవలం అభిమానులనే కాకుండా పెద్దపెద్ద సినీ తారల చేత కూడా పొగడ్తలు అందుకుంది. చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వరకు ప్రతి ఒక్కరూ దసరా సినిమా గురించి తమ వైపు నుంచి పొగడ్తలు కురిపించిన రోజులున్నాయి. శ్రీకాంత్ ఓడేలా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల కలెక్షన్ రాబట్టిందని చెప్తున్నారు.

రిలీజ్ కి దగ్గరలో చిరంజీవి బోలా శంకర్ సినిమా: 

2015లో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం వేదాళం రీమేక్ ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న భోలా శంకర్. ఈ చిత్రంలో తమన్నా చిరంజీవికి జతగా నటిస్తూ ఉండగా, మరోవైపు కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో కనిపించనుంది. బోలా శంకర్ చిత్రంలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, మరియు ఉత్తేజ్ కూడా నటించారు.

భారీ అంచనాల మధ్య, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ సోషల్ మీడియాలో విడుదలైన క్షణం నుంచి ఎన్నో ఆదరాభిమానాలను అందుకుంది అంతేకాకుండా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. టీజర్ పవర్-ప్యాక్డ్ యాక్షన్ అంతే కాకుండా బ్యాగ్రౌండ్ లో వినిపించ మాస్ మ్యూజిక్ ర్యాంపేజ్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి. భోళా శంకర్ ఈ సంవత్సరం ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. అదే రోజున విడుదలవుతున్న రజనీకాంత్ జైలర్‌ మూవీకి గట్టి పోటీ ఇవ్వనుంది.