జైలర్ సినిమాలో విగ్నేష్ శివన్ రాసిన పాట

ఇటీవల జైలర్ సినిమా నుంచి రీలీజ్ అయిన మరో పాట ‘రాతమారే’ లిరికల్ వీడియో హైలెట్ గ మారింది. అయితే ఈ పాటకు సంబంధించిన కొత్త విషయం వైరల్ గా మారింది. ఈ పాట రాసింది మరి ఎవరో కాదు నయనతార భర్త విగ్నేష్ శివన్. రజనీకాంత్ సినిమా కోసం విగ్నేష్ రాసిన మొట్టమొదటి పాట ఇది. ఈ పాట రాసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, ముఖ్యంగా ఈ పాటను తన ఇద్దరు బిడ్డలకు డెడికేట్ […]

Share:

ఇటీవల జైలర్ సినిమా నుంచి రీలీజ్ అయిన మరో పాట ‘రాతమారే’ లిరికల్ వీడియో హైలెట్ గ మారింది. అయితే ఈ పాటకు సంబంధించిన కొత్త విషయం వైరల్ గా మారింది. ఈ పాట రాసింది మరి ఎవరో కాదు నయనతార భర్త విగ్నేష్ శివన్. రజనీకాంత్ సినిమా కోసం విగ్నేష్ రాసిన మొట్టమొదటి పాట ఇది. ఈ పాట రాసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, ముఖ్యంగా ఈ పాటను తన ఇద్దరు బిడ్డలకు డెడికేట్ చేస్తున్నట్లు పోస్ట్ చేశాడు విగ్నేష్. 

ఇటీవల మరిన్ని పోస్టులు చేసిన విగ్నేష్: 

గతంలో, దర్శకుడు ఫాదర్స్ డే సందర్భంగా తమ పిల్లలను పట్టుకొని ఉన్న ఒక పిక్చర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం, వారు తమ పిల్లల పేర్లను రుద్రోనీల్ ఎన్ శివన్ మరియు ఉలాగ్ దైవిక్ ఎన్ శివన్ అని ప్రకటించడం జరిగింది. 

నయనతార తన పిల్లలతో హ్యాపీగా గడుపుతుంది. తాను మరో పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే, తన ఫ్యామిలీ కోసం చక్కని టైమ్ స్పెండ్ చేస్తుంది నయనతార. నయనతార తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలలో ఒకరు. తను ఎన్నో సినిమాలలో కథానాయికిగా ప్రతి ఒక్కరి మన్ననలు అందుకుంది. ఆమె గత సంవత్సరం దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట అక్టోబర్‌లో తమ పిల్లలను ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే ప్రస్తుతం నయనతార తన పిల్లలతో హ్యాపీగా గడుపుతున్న క్షణాలను, నయనతార భర్త విగ్నేష్ సోషల్ మీడియాలో హ్యాపీగా షేర్ చేశారు.

జైలర్ సినిమా విశేషాలు: 

పాటు, జైలర్‌లో జాకీ ష్రారోఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, మిర్నా మీనన్, తమన్నా మరియు మలయాళం స్టార్ మోహన్‌లాల్ అతిధి పాత్రలో పెద్ద పెద్ద తారలు కనిపించబోతున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు, ఆ పాటలు ఇప్పటికే ఇంటర్నెట్ ని ఊపేస్తున్నాయి. జైలర్ ఆగస్ట్ 10న విడుదల కానుంది. 

అంచనాలు పెంచిన కావాలా పాట: 

ప్రస్తుతం జైలర్ సినిమా నుంచి విడుదలైన కావాలా సాంగ్ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఇందులో నటించిన తమన్నా తన డాన్స్ తో అందరినీ అలరించింది. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా గురించి ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. మరో పక్క తమన్నా డాన్స్ చూసిన తర్వాత, ఈ సినిమా గురించి అభిమానుల్లో మరింత ఉత్కంఠ మొదలైంది. తమన్నా భాటియా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూనే ఉంది. ఈసారి జైలర్ పాట కావాలా తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. తమన్నా భాటియా, రజనీకాంత్ డాన్స్ చేసిన ఈ పాటని ఇటీవలే విడుదల చేశారు. 

జైలర్ సినిమా నుంచి రీలీజ్ అయిన మరో పాట ‘రాతమారే’ లిరికల్ వీడియో హైలెట్ గ మారింది. అయితే ఈ పాటకు సంబంధించిన కొత్త విషయం వైరల్ గా మారింది. ఈ పాట రాసింది మరి ఎవరో కాదు నయనతార భర్త విగ్నేష్ శివన్. రజనీకాంత్ సినిమా కోసం విగ్నేష్ రాసిన మొట్టమొదటి పాట ఇది. ఈ పాట రాసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, ముఖ్యంగా ఈ పాటను తన ఇద్దరు బిడ్డలకు డెడికేట్ చేస్తున్నట్లు పోస్ట్ చేశాడు విగ్నేష్.