ఎలిఫెంట్‌ విస్పరర్స్ డైరెక్టర్‌‌కు లీగల్‌ నోటీసులు

అస్కార్‌‌ విజేత, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్‌కు బొమ్మన్‌, బెల్లీ దంపతులు లీగల్‌ నోటీసులు పంపించారు. డాక్యుమెంటరీ చిత్రకరణ సమయంలో తమను  అన్ని విధాలా ఆదుకుంటామని మాటిచ్చి, ఇప్పుడు మోసం చేశారని ఆరోపిస్తూ బొమ్మన్‌ దంపతులు కార్తికి నోటీసులు పంపారు. పరిహారం కింద తమకు రూ.2 కోట్లు చెల్లించాలని లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ జంటకు ఇల్లు, మల్టీపర్పస్‌ వెహికల్, భారీ ఆర్థిక సాయంతో పాటు తమ మనుమరాలి చదువుకు కూడా సహాయం చేస్తామని […]

Share:

అస్కార్‌‌ విజేత, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్‌కు బొమ్మన్‌, బెల్లీ దంపతులు లీగల్‌ నోటీసులు పంపించారు. డాక్యుమెంటరీ చిత్రకరణ సమయంలో తమను  అన్ని విధాలా ఆదుకుంటామని మాటిచ్చి, ఇప్పుడు మోసం చేశారని ఆరోపిస్తూ బొమ్మన్‌ దంపతులు కార్తికి నోటీసులు పంపారు. పరిహారం కింద తమకు రూ.2 కోట్లు చెల్లించాలని లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ జంటకు ఇల్లు, మల్టీపర్పస్‌ వెహికల్, భారీ ఆర్థిక సాయంతో పాటు తమ మనుమరాలి చదువుకు కూడా సహాయం చేస్తామని మాటిచ్చారని లీగల్ నోటీసుల్లో ప్రస్తావించారు. మూవీ రిలీజ్‌ అయిన తర్వాత వచ్చే డబ్బులో కొంత ఇస్తామని కూడా చెప్పారని పేర్కొన్నారు. ఆస్కార్‌‌ వచ్చిన తర్వాత ప్రశంసలు, పురస్కారాలు అన్నీ ఆమె అందుకొని, తమకు మొండిచేయి చూపారన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందారన్నారు. బొమ్మన్‌ దంపతులకు ఇచ్చిన మాట ప్రకారం సాయం చేయకపోవడంతో దర్శకురాలికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

మీడియా సంస్థలు ఆ దంపతులను సంప్రదించినప్పుడు, ఈ కేసు గురించి ఇకపై మాట్లాడవద్దని, తమకు లాయర్లు సలహా ఇచ్చారని, వివరాలు కావాలంటే తమ లాయర్లను సంప్రదించాలని కోరారు. చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త, లాయర్ ప్రవీణ్ రాజ్‌ మాట్లాడుతూ, బొమ్మన్‌ జంట తనకు దాదాపు దశాబ్ద కాలంగా తెలుసని చెప్పారు. వీరు చెన్నైలోని ఓ న్యాయవాద సంస్థను సంప్రదించినప్పుడు తాను ఈ జంటను కలిశానన్నారు.  ‘‘బొమ్మన్‌, బెల్లీ ఇద్దరూ గోన్సాల్వేస్‌ చేసిన పనికి చాలా కలత చెందారు. వారు ఈ మూవీ తీస్తున్నప్పుడే బొమ్మన్‌ దంపతులకు డబ్బు సహాయంతో పాటు బెల్లీ మనవరాలి చదువుకు సాయం చేస్తామని చెప్పారు. కానీ ఆమె ఇప్పుడు ఈ సినిమా ద్వారా వచ్చిన భారీ లాభాల్లో కొంత భాగాన్ని కూడా వీరికి ఇవ్వడానికి నిరాకరిస్తోంది”అని ప్రవీణ్ రాజ్‌ పేర్కొన్నాడు.

ఈ జంట డాక్యుమెంటరీ మేకర్స్‌ ఏం చెబితే అది చేశారని, సినిమా బాగా వచ్చినప్పుడు ఇందులో వీరి కృషి కూడా ఉంటుందన్నారు. కానీ, బొమ్మన్‌ డైరెక్టర్‌‌ గోన్సాల్వేస్‌కి కాల్‌ చేసినప్పుడు  ఆమె ఫోన్‌ కూడా ఎత్తడం లేదన్నాడు. గోన్సాల్వేస్‌ కు చెందిన సిఖ్యా ఎంటర్‌‌టైన్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫు న్యాయవాది మహమ్మద్‌ మన్సూర్‌‌ నుంచి తనకు రిప్లై నోటీసు వచ్చిందని ప్రవీణ్‌ రాజ్‌ తెలిపారు. అందులో ఆమె.. ఆ జంటకు డబ్బు ఇచ్చారని పేర్కొన్నారు. వారు మరింత సాయాన్ని కోరారని, అందుకు డైరెక్టర్ నిరాకరించారని ఉంది. తన క్లయింట్‌ను సంప్రదించిన తర్వాత రెండ్రోజుల్లో ఆమెకు రీజాయిండర్‌‌ పంపుతానని మన్సూర్‌‌ చెప్పాడని ప్రవీణ్‌ రాజ్‌ వెల్లడించారు.

మావ‌టి కమ్యూనిటీల గురించి తెలిసేలా చేశాం..

 ‘‘ఎలిఫెంట్‌ విస్పరస్‌ను రూపొందించడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏనుగుల సంరక్షణ, వాటి కోసం అటవీ శాఖ, మావటిలు బొమ్మన్‌, బెల్లీ వంటి వారు చేసిన అద్భుతమైన పనులను హైలైట్‌ చేయడం. ఈ డాక్యుమెంటరీ విస్తృతంగా ప్రజాదరణ పొందడంతో మవాటీలకు, కావాడీ కమ్యూనిటీలపై ప్రభావం పడింది” అని సిఖ్యా ఎంటర్‌‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని ఏనుగులను చూసుకునే 91 మంది మవాటీలకు, కావాడీలకు, సంరక్షకులకు సహాయం చేయడానికి ఎకో ఫ్రెండ్లీ ఇండ్లను నిర్మించడానికి ముందుకొచ్చారు. అలాగే అనమలై టైగర్ రిజర్వ్‌ లో ఏనుగుల క్యాంప్‌లను అభివృద్ధి చేయడానికి విరాళాలు ఇచ్చారు. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్‌‌ అవార్డు రావడాన్ని దేశం మొత్తం సెలబ్రేట్‌ చేసుకుంది. అకాడమీ అవార్డు అనేది బొమ్మన్‌, బెల్లీ వంటి మవాటీల పనితనానికి జాతీయంగా గుర్తింపు వచ్చిందని మూవీ నిర్మాణ సంస్థ పేర్కొంది.