బాలయ్యకు ధన్యవాదాలు తెలిపిన అర్జున్ రాంపాల్

నందమూరి నటసింహం బాలకృష్ణ ఏస్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి భగవంత్ కేసరి మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ బాలయ్య గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య గత చిత్రాలు, అఖండ, వీరసింహ రెడ్డి మూవీలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న అనిల్ రావిపూడి కూడా […]

Share:

నందమూరి నటసింహం బాలకృష్ణ ఏస్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి భగవంత్ కేసరి మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ బాలయ్య గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య గత చిత్రాలు, అఖండ, వీరసింహ రెడ్డి మూవీలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న అనిల్ రావిపూడి కూడా గతంలో భారీ ఇండస్ట్రీ హిట్లు అందించడంతో ఈ మూవీ పక్కాగా ఇండస్ట్రీ హిట్ అంటూ బాలయ్య అభిమానులు రచ్చ చేస్తున్నారు. 

బాలయ్య కూతురిగా స్టార్ నటి.. 

తెలుగు నాట స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శ్రీ లీల ఈ మూవీలో బాలయ్య కు కూతురిగా నటిస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా సీనియర్ నటి కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యే ఈ ఇద్దరు హీరోయిన్లు డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీ హిట్ పక్కా అని అంతా అంటున్నారు. 

అర్జున్ రాంపాల్ ఎంట్రీ..

ఈ మూవీతోనే బాలీవుడ్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ రాంపాల్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.  ఈ మధ్యే ఆయన తన షూటింగ్ పోర్షన్ ను కంప్లీట్ చేశాడు. ఈ మూవీలో అతడి క్యారెక్టర్ పేరు రాహుల్ సంఘ్వి. ఈ మధ్య షూటింగ్ లో పాల్గొన్న అర్జున్ బాలయ్యతో సెట్స్ లో దిగి పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

బాలయ్యకు థ్యాంక్స్ చెప్పిన అర్జున్ 

తన తొలి తెలుగు మూవీ  అనుభవం గురించి అర్జున్ రాంపాల్ సోషల్  మీడియాలో పంచుకున్నాడు. తన తొలి తెలుగు మూవీ చేసేందుకు చాలా భయం అయిందని తెలిపాడు. తన మొదటి తెలుగు సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వచ్చినపుడు చాలా ఉద్వేగానికి లోనయ్యానని తెలిపాడు. కానీ మూవీ హీరో బాలయ్య బాబు అందించిన ప్రేమ మమకారం మర్చిపోలేనని తెలిపాడు. ఇప్పుడు తనకు పూర్తి కాన్ఫిడెంట్ వచ్చిందని అర్జున్ తెలిపాడు. తన  అన్న బాలకృష్ణ ప్రేమ శక్తి లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదని తెలిపాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడికి మరియు చిత్ర నిర్మాతకు అర్జున్ థ్యాంక్స్ చెప్పాడు. వారు అందించిన ప్రోత్సాహాన్ని మర్చిపోలేనని తెలిపాడు. అంతే కాకుండా షూటింగ్ వ్రాప్ చేసుకుని వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నాడు. 

మ్యూజిక్ అదిరిపోనుందట.. 

ఇక ఈ మూవీ మ్యూజిక్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని మూవీకి స్వరాలు సమకూరుస్తున్న థమన్ ప్రకటించాడు. అంతే కాకుండా ఈ మూవీ గురించి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ స్పందిస్తూ.. ఈ మూవీ మ్యూజిక్  అదిరిపోతుందని ఆయన పేర్కొన్నాడు. ఇక ఈ మూవీకి హిట్ రావడం పక్కా  అని బాలయ్య ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ మూవీకి ముందు బాలయ్య చేసిన అఖండ, వీరసింహా రెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఈ మూవీ హిట్ పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఇక ఈ మూవీలో కీ రోల్ పోషిస్తున్న శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది.