లియో సెన్సార్ పూర్తి.. 13 క‌ట్స్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

ఇలయతలపతి విజయ్ అభిమానులనే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్న మూవీ లియో. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, విజయ్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీకి తాజాగా సెన్సార్ పూర్తయింది.  సెన్సార్ ఏం చెప్పిందంటే..  అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీకి తాజాగా సెన్సార్ వర్క్ కంప్లీట్ అయింది. సెన్సార్ బోర్డు ఈ […]

Share:

ఇలయతలపతి విజయ్ అభిమానులనే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్న మూవీ లియో. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, విజయ్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీకి తాజాగా సెన్సార్ పూర్తయింది. 

సెన్సార్ ఏం చెప్పిందంటే.. 

అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీకి తాజాగా సెన్సార్ వర్క్ కంప్లీట్ అయింది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి గానూ U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. లోకేశ్ డైరెక్టర్ అంటే ఆ సినిమాల్లో ఎలాగూ వయలెన్స్ ఉంటుంది కాబట్టి లోకేశ్ సినిమాలకు మనం U సర్టిఫికెట్ ను ఎక్స్ పెక్ట్ చేయలేం. అంటే ఈ సర్టిఫికెట్ అర్థం చిన్నారులు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని వీక్షించాలి. అలా కాకుండా చిన్నారులు డైరెక్టుగా ఈ సినిమా చూసేందుకు వీలు లేదు. ఇక ఈ మూవీలో కొన్ని డైలాగ్స్ మరీ వల్గర్ గా కూడా ఉన్నాయి. ఈ డైలాగ్స్ కు సెన్సార్ బోర్డ్ కత్తెరేసింది. మరికొన్ని డైలాగ్ లను మ్యూట్ చేసింది. దీంతో ఈ సినిమాకు కొన్ని కట్స్, కొన్ని మ్యూట్స్ పడ్డట్లు అయింది. ఇక లోకేశ్ గత మూవీ విక్రమ్ ఒక రేంజ్ లో హిట్ అయింది. అంతకు ముందు అతడు తీసిన ఖైదీ, మాస్టర్ ల కంటే ఎక్కువగా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. దర్శకుడు లోకేశ్.. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక దానిని రూపొందించుకున్నాడు. అతడు చేసే అన్ని సినిమాలు ఇందులో భాగంగానే వస్తాయి. ఒక సినిమాకు ఒక సినిమాకు ఎక్కడో చిన్న లింక్ ఉంటుంది. కావున మనం లియోలో కూడా పాత సినిమాల ఫ్లేవర్స్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అది మాత్రమే కాకుండా పాత సినిమాల్లో నటించిన హీరోలను కూడా ఇందులో చూసే అవకాశం లేకపోలేదు. దాని గురించి లోకేశ్ ను ప్రశ్నించగా ఇప్పుడే ఏం చెప్పలేనని అక్టోబర్ 19 తర్వాత మీకే అన్ని విషయాలు తెలుస్తాయని అతడు స్పష్టం చేశాడు.

లియో ఎన్ని గంటలంటే.. 

అందరి అటెన్షన్ ను క్యాచ్ చేసిన ఈ మూవీ ఎన్ని గంటల నిడివితో ఉంటుందని అందరిలోనూ ఒక క్యూరియాసిటీ ఉంది. అది మాత్రమే కాకుండా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎన్ని మార్పులను సూచించిందని అందరూ అనుకుంటారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 13 మార్పులను తప్పనిసరి చేసింది. అంతే కాకుండా కొన్ని సన్నివేశాల్లో పదాలను కూడా మ్యూట్ చేసింది. సెన్సార్ బోర్డ్ లియో మూవీ రన్‌టైమ్ ను 164 నిమిషాలుగా లాక్ చేసింది. అంతే ఈ మూవీ 2 గంటల 44 నిమిషాలు ఉంటుందన్న మాట. ఇక ప్రేక్షకులను ఎంతో ఎదురు చూసేలా చేసిన లోకేశ్ కనకరాజ్, విజయ్ కాంబోలోని లియో మూవీ ఎటువంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో.. 

లియో తారాగణం వీరే.. 

అందరి అటెన్షన్ ను క్యాచ్ చేసిన లియో మూవీ తారాగణం గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే.. ఈ మూవీలో తలపతి విజయ్ తో పాటు సీనియర్ బ్యూటీ త్రిష కూడా నటిస్తోంది. కుర్ర హీరోయిన్లు ఎవరూ ఈ మూవీలో లేరు అంటే త్రిషనే విజయ్ కి జోడీగా నటిస్తోందని అనుకోవచ్చు. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా రోజులు గడుస్తున్నా కానీ త్రిష అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. దీంతోనే అమ్మడుకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక వీరితో పాటుగా అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, ప్రియా ఆనంద్ మరియు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తారాగణం పెద్ద ఎత్తున ఉంది. ఇక ఈ మూవీకి అనిరుధ్ రవించందర్ స్వరాలు సమకూర్చాడు. విజయ్ నటించిన చాలా సినిమాలు (రీసెంట్ టైమ్స్) అనిరుధే స్వరాలు అందిస్తున్నాడు. అంతే కాకుండా లోకేష్ కనకరాజ్ చివరి చిత్రం విక్రమ్ కి కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న విషయం తెలిసిందే. లియోకు కూడా అతడే మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ మూవీ ఆడియో కూడా ఒక రేంజ్ లో సక్సెస్ అయింది. అంతే కాకుండా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గరి నుంచి ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే క్యూరియాసిటీ అభిమానుల్లో పెరిగిపోయింది. ఇక ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ మూవీ కేఫ్ యజమాని చుట్టూ తిరిగే రివేంజ్ స్టోరీగా తెలుస్తోంది. లోకేశ్ గత సినిమాలు కూడా ఇదే జానర్ లో ఉంటాయి కనుక ఈ మూవీని కూడా మనం అలాగే ఊహించొచ్చు. ట్రైలర్ పాటలతోనే ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీ మరి రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుందో చూడాలి. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన మాస్టర్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.